మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కి ఒక కొత్త ఫ్లేవర్ ఇవ్వడానికి ఇక్కడ 12 ఐడియాస్..
కొత్త సంవత్సరానికి ఈ నిర్ణయాలు తీసుకుంటే మీ సక్సెస్‌ని ఎవరు ఆపలేరు..రేపు కొత్త సంవత్సరం మొదలవుతోందనగా ఇవాళ సాయంత్రం చేయాల్సిన పని.., గత సంవత్సరాన్ని నెమరు వేసుకోవడం తో పాటూ కొత్త సంవత్సరంలో ఎలా ఉండాలా అని ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం..
లైఫ్ లో ఎలాంటి చేంజెస్ కావాలని అనుకుంటున్నారు, అందుకు ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలి, ఎలా అమలు పరచాలి..
సింపుల్ గా చెప్పాలంటే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ చేసుకోవడం.
ఈ రిజల్యూషన్స్ అనేవి పూర్తిగా వ్యక్తిగతమైనవే, అందులో కాదనేందుకు ఏమీ లేదు.
ఎక్కువ పాప్యులర్ రిజల్యూషన్స్ లో healthy ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ గా వర్కౌట్ చేయాలి, సేవ్ చేయాలి, ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ గడపాలి, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి తీసుకోవడం తగ్గించాలి, ఇంకా ఆర్గనైజ్డ్ గా ఉండాలి వంటివి ఉంటాయి.
మీ న్యూ ఇయర్ రిజల్యూషన్స్ కి ఒక కొత్త ఫ్లేవర్ ఇవ్వడానికి ఇక్కడ 12 ఐడియాస్ ఉన్నాయి..
1.PLANT A PLANT TO SAVE OUR PLANET..
'ప్లాంట్ ఏ ప్లాంట్ టు సేవ్ అవర్ ప్లానెట్' ఈ నూతన సంవత్సరాన్ని ఒక మంచి మొక్కను నాటి సంతోషంగా ప్రారంభించి కుటుంబ సభ్యులతో స్వీట్స్ తో నోరు తీపి చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది.
2.HEALTH IS GIFT
(EAT HEALTHY)
'Healthy MIND in Healthy BODY'
ఎప్పుడైతే మనం ఆరోగ్యవంతంగా ఉన్నామో మన యొక్క మనస్సు మన యొక్క బుద్ధి అన్నీ ఆరోగ్యవంతంగా ఉంటాయి. మంచి పనులు చేయగలుగుతాం దానికి కావాల్సింది మంచిగా తినడం మంచి వ్యాయామం చేయడం.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు ప్రతిరోజు మనం మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకొనుటకు కొన్ని పనులు చేయాలి.
◆ఉదయం 7-8లోపు అల్పాహారం
మధ్యాహ్నం 1 లోపు భోజనం
రాత్రి 8 గంటల లోపు తినడం, తిన్నాక 100అడుగులైనా వేయడం..
★రోజు ఒక పండు తినడం, ఖచ్చితంగా వ్యాయామం చేయడం యోగ ప్రాణాయామాలు చేయడం మొదలైనవి.
☺️ఈసారి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నారు? తిన్నారా అని కాకుండా ఈరోజు వ్యాయామం చేసారా.. ఈరోజు వాకింగ్ చేసారా? అని అడగండి జీవితంలో చాలా మంచి మార్పులు చూస్తాం.
(Note:బయట ఫుడ్ అవాయిడ్ చేయండి)
3.POSITIVE THINKING & DOING
LOVE ALL💝💝..
జీవితంలో క్రొత్త క్రొత్త ఆలోచనలతో, క్రొంగొత్త ఉత్సాహంతో ప్రతిరోజునూ ప్రారంభించాలి. ఎప్పుడైతే మనం పాజిటివ్ గా థింక్ చేస్తామో.. అన్ని పనులు ఖచ్చితంగాా పాజిటివ్ గానే అవుతాయి. రేపటి ప్రణాళికలు ఈరోజే రచించుకుని వాటిని అవలంబించాలి .. 'వాయిదాని వాయిదా' వేయాలి..☺️
గతంలో జరిగిన చెడుని గూర్చి చింతించకుమా.. రాబోయే భవిష్యత్తుకి ఉత్సాహాన్ని అందించుచూ ముందుకు సాగిపో మిత్రమా..
★మనల్ని మనం నిందించుకోవడం తప్పు.. మనలోని మంచిని గుర్తించి, అద్దం ముందు నిలబడి పొగుడుకోండి.. Self Confidence పెరుగుతుంది..
(◆గతంలో తెలిసీ తెలియక చేసిన తప్పులకు మనలో మనమే ఒప్పుకుని, క్షమాపణలు చెప్పుకోవాలి..)
మనకి లేదా మనల్ని శత్రువులుగా
భావించేవారిని రేపు WISH చేయండి..
పాత కక్షలు ఆవేశాలని మర్చిపోండి.
LOVE ALL..
వీలైతే ప్రేమిద్దాం DUDE... మహా అయితే ఏం చేస్తారు తిరిగి ప్రేమిస్తారు..
శతృవులే లేని జీవితం ..
Wow.. సూపర్ కదా..!
4.LAUGH LOUDLY
'నవ్వటం ఒక యోగం నవ్వకపోవడం రోగం' అని ఒక మహాకవి చెప్పినట్లు ప్రతిరోజు మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఎల్లప్పుడూ పైకి గట్టిగా నవ్వడానికే ప్రయత్నం చేయాలి. తద్వారా మన చుట్టూ వాతావరణ పాజిటివ్ గా స్ప్రెడ్ అవుతుంది అన్ని శుభాలు జరుగుతాయి.
ఒకసారి ప్రయత్నం చేసి మీరే చూడండి మీకే తెలుస్తుంది.
5.TALK WITH ELDERS, PARENTS, RELATIVES & FRIENDS..
మన జీవితంలో 'మనీ' తో పాటు మన పేరెంట్స్ కి, పెద్దవారికి, ఫ్రెండ్స్ కి అందరికీ విలువ మరియు సమయాన్ని ఇవ్వాలి..
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పెద్దవారి గొప్పదనాన్ని మర్చిపోయారు..
వారు లేనప్పుడు బాధపడేకన్నా.. ఉన్నప్పుడు వారి విలువ తెలుసుకుని, వారిని సంతోషపెట్టి చూడండి..
They are not OLD..
most EXPERIENCED..
మనకు వచ్చిన సమస్యని పెద్దవారితో షేర్ చేసుకుంటే వారు వారి జీవితంలో చూసినటువంటి ఎన్నో ఉదాహరణలు చెప్పి మన యొక్క సమస్యకి సమాధానం చిటికెలో సూచిస్తారు.
కనీసం వారాంతంలో అయినా మన యొక్క బంధువులకి మన ఫ్రెండ్స్ కి ఒక ఫోను ఒక మెసేజ్ పెట్టండి.. దీన్ని అలవాటుగా మార్చుకోండి..
ఏదో ఒక వారం మనం పొరపాటున వారికి మెసేజ్ పెట్టకపోయినా ఫోన్ చేయకపోయినా వారి నుండి వచ్చే రెస్పాన్స్ మీకే తెలుస్తుంది.
6.COMPLIMENTS & GIFTS
'పంచితే పెరిగేదాన్నే కదా ప్రేమ అంటారు..'
ఏదైనా విశేషమైన పండుగప్పుడు లేదా పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగలు మరియు వివిధ సందర్భాలలో మీ ఇంట్లో పెద్దవారికి పిల్లలకు మీ భాగస్వాములకు గిఫ్ట్స్ ఇచ్చి చూడండి ప్రేమ మరింత పెరుగుతుంది.
ఆ ఆనందానికి NO WORDS అన్నట్టు..😊
7.READ ONE BOOK A MONTH
మంచి పుస్తకం మన యొక్క జీవితాన్ని మారుస్తుంది ..
'పెద్దబాలశిక్ష' కొని ఇంట్లో ఉంచండి మీరు చదవండి.. మీ ఇంట్లో పిల్లలు చేసే చదివించండి..
యండమూరి వీరేంద్రనాథ్ చౌదరి గారి యొక్క విజయానికి 7 మెట్లు మొదలైన పుస్తకాలు జీవితానికి వెలుగునిస్తాయి..
8.PLAN A LUNCH/DINNER..TOUR WITH FAMILY
★ "గృహమే కదా స్వర్గసీమ" అన్నారు పెద్దలు..
మన ఇంట్లో అందరూ ఆనందంగా ఉన్నప్పుడే మన స్వర్గంలో ఉన్నట్లు..
మీ ఫ్యామిలీతో ఒక రెస్టారెంట్ కి వెళ్లి విందు ఆరగించి ఫోటోలను మీ ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేసుకోండి.. ఒక సినిమా కి వెళ్ళండి.. మూడు లేక 6 నెలలకు ఒకసారి ఏదైనా ప్రదేశానికి టూర్ వెళ్లండి.. రొటీన్ లైఫ్ నుండి మీకు కొత్త జోష్ ని ఇస్తుంది. మీ మధ్య మీ కుటుంబం మధ్య బంధాలను మరింత బలపరుస్తుంది..
9.HELP POOR..
NATURE WILL BLESS
ఎప్పుడో ఆలయాలకు, ప్రార్థనా స్థలాలకు వెళ్ళినప్పుడు అక్కడి వాళ్లకు రూపాయి వేసి ఏదో గొప్ప పని చేసినట్టుగా భావిస్తూ ఉంటారు..
కానీ మిత్రులారా..... వారికి డబ్బులు బదులు ఆహారం ఇవ్వండి..మీ జీవితంలో ముఖ్యమైన రోజులు వచ్చినప్పుడు, మీ పిల్లల పుట్టినరోజు అన్నదానం చేసి చూడండి ..
వారికీ ఈ మంచి అలవాటు వస్తుంది..
అంతేకాదు మన చుట్టూ ఉన్న జంతువులకు,పక్షులకు ఆహారాన్ని ఇవ్వండి..
(మీ ఆచారాన్ని బట్టి 'గోసేవ' చేయండి)
అవతలి వారి ఆకలి తీర్చినప్పుడే దేవుడు కనిపిస్తాడు..
(కావాలంటే.. వాళ్ళ కళ్ళలో చూడండి కనిపిస్తాడు😊)
10.CLEAN YOUR HOME-OFFICE- SURROUNDINGS-REDUCE WASTE
SPREAD GOOD FRAGNANCE..
మీ పరిసరాల్లోని చెత్తను, నిరుపయోగంగా ఉన్న, పగిలిన వస్తువులను తొలగించండి.. వేస్ట్ ను పెరగకుండా ప్రయత్నించండి.. మీ ఇంట్లో ఎప్పటికప్పుడు మంచి సువాసనను వెదజల్లే అరోమా ఫ్రాగ్నెన్సులను వ్యాపింపజేయండి అగరుబత్తీలు వెలిగించండి..
11. NOTE YOUR SPENDINGS..
మనం రోజువారి చేసే ప్రతి ఖర్చుని నోట్ చేసుకోండి.. డైరీ రాయండి జీవితంలో ఏం సాధించామో ఆ డైరీ మీకు చెబుతుంది..
12. YOU ARE THE KING / QUEEN
"LOVE YOURSELF"
'మన జీవితానికి మనమే రాజులం రాణులం..'
జీవితాన్ని ఒక రాజు లేక ఒక రాణి ఏ విధంగా జీవిస్తారో అలా జీవించండి.
ముందు మనం.. తర్వాతే అందరూ..
ఇతరుల కోసం త్యాగం చేసి మన జీవితాన్ని వేస్ట్ చేసుకోకూడదు.
చాలామంది తమ పుట్టినరోజులు వచ్చినప్పుడు కనీసం కొత్త బట్టలు కూడా వేసుకోరు..
ఆ.. ఎందుకులే.. ఏముందిలే అంటారు..
మనల్ని మనమే ప్రేమించలేనప్పుడు ఇతరుల నుంచి ఆశించకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉల్లాసంగా ఉత్సాహంగా రాబోయే నూతన సంవత్సరాన్ని ముందుగా ప్లాన్ చేసుకోండి ఆరోగ్యవంతమైన ఆనందదాయకమైన జీవితాన్ని ఇకనుంచి అయినా గడపండి..
వీటితోపాటు మీరు కోరుకునే మరిన్ని అంశాలు ఇక్కడ జోడించుకుని నూతన నిర్ణయాలు తీసుకోండి..
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
అందరికీ
2024
"ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.."
ALSO READ