Welcome to

HAMARI HINDI


7-11-2022


మార్గశిర పౌర్ణమి, బుధవారంవారం.



దత్తాత్రేయ జయంతి



"ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి దత్తాత్రేయ మంత్రం వినండి




శ్రీ దత్తాత్రేయ మంత్రం


దత్తాత్రేయ హరే కృష్ణా ఉన్మత్తానంద దాయకా||
దిగంబర మునే బాల పిశాచ జ్ఞాన సాగరా||


దత్త జయంతి


దత్తాత్రేయని జన్మదినాన్ని మార్గశిర పౌర్ణమి రోజున దత్త జయంతిగా జరుపుకుంటారు. ఇది పవిత్రమైన రోజుగా పరిగణించబడుతోంది. అత్రి మహాముని, మహా పతివ్రత అనసూయల సంతానమే దత్తాత్రేయుడు. ఈయన త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశలతో జన్మించిన అవతారమూర్తి. అందునా దత్తాత్రేయుడు విష్ణువు అంశతో, చంద్రుడు బ్రహ్మ అంశతో, దుర్వాసుడు శివుని అంశతో జన్మించారు.


దత్త జయంతి కథ


పురాణాల ప్రకారం, ఈ దేవుడిని ముక్కోటి దేవతల అవతారంగా భావిస్తారు. ఈయనకు ఆరు చేతులు, మూడు తలలు, శంఖం, చక్రం, త్రిశూల ఆయుధాలు, తన వెంట నాలుగు శునకాలు, గోమాత కూడా ఉంటాయి. ఇలా మూడు రూపాల కారణంగా దత్తాత్రేయుడిని కలియుగ ప్రత్యక్ష దైవంగా పరిగణిస్తారు. ఈ స్వామి వారిని ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించేనట్టేనని చాలా మంది నమ్ముతారు. త్రిమూర్తుల స్వరూపంగా భావించే ఈ స్వామిని సన్యాసి లేదా బ్రహ్మచారి అని పిలుస్తారు

పురాణాల ప్రకారం, ఒక రోజున లక్ష్మీ, సరస్వతి, పార్వతీ దేవిలు తమ స్త్రీ తత్వాన్ని చూసి చాలా గర్వపడ్డారు. వారి అహాన్ని పోగొట్టడానికి భగవంతుడు కొన్ని మాయలు చేశాడు. అలా ఒకరోజు నారదుడు ఈ ముగ్గురి వద్దకు వచ్చి ముని అత్రి భార్య అనసూయ ముందు మీ స్త్రీతత్వం ఏమీ ఉండదని చెప్పారు. అప్పుడు ముగ్గురు భార్యలు తమ భర్తలకు ఈ కథ చెప్పి మీ ముగ్గురూ వెళ్లి అనసూయ స్త్రీ తత్వాన్ని పరీక్షించాలని తలచారు.వారి అభ్యర్థన మేరకు సతీ అనసూయ పవిత్రత ధర్మాన్ని పరీక్షించేందుకు త్రిమూర్తులు భూమికి చేరుకున్నారు. అక్కడ అత్రి ముని లేని సమయంలో, ముక్కోటి దేవతలు మునుల రూపంలో అనసూయ ఆశ్రమానికి చేరుకుని, తల్లి అనసూయ ముందు భోజనం చేయాలనే కోరికను వ్యక్తం చేశారు. అనసూయ కూడా వారి ఆతిథ్యాన్ని మన్నించి విధేయత చూపించి భోజనం పెట్టడానికి సిద్ధమైంది. అయితే త్రిమూర్తులు తమ ఎదుట నగ్నంగా ఉండి భోజనం పెట్టాలని షరతు విధించారు. దీంతో ఆ తల్లికి అనుమానం వచ్చింది. ఆ సమయంలో తను ఆ సమస్య నుంచి బయట పడేందుకు తన భర్త అత్రి మునిని స్మరిస్తూ ధ్యానంలో ఉన్నప్పుడు, తన ముందు నిలబడి ఉన్న మునుల రూపంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, మహేశ్వరలను చూసింది.

అప్పుడు ముని కమండలం నుంచి అనసూయ దేవి నీటిని చిలకంరించి, వారిని ఆరు నెలల శిశువులుగా మార్చారు. అనంతరం వారి షరతు మేరకు భోజనం తినిపించింది. అదే సమయంలో ముక్కోటి దేవతలు తమ భర్త తమ నుంచి విడిపోవడంతో చాలా కలత చెందారు. అప్పుడు నారద ముని ద్వారా విషయం తెలుసుకున్న దేవతలు తమ తప్పును అంగీకరించి అనసూయకు క్షమాపణలు చెప్పారు. ఈ తర్వాత తమ భర్తలను తిరిగి పొందారు. అయితే అనసూయ పతివ్రతను మెచ్చిన త్రిమూర్తులు తన గర్భం నుంచి జన్మిస్తామని వరమిచ్చారు. అందులో భాగంగానే బ్రహ్మ భాగం నుంచి చంద్రుడు విష్ణువు నుంచి దత్తాత్రేయుడు, శివుడినుంచి ముని దుర్వాసుడు జన్మించారు. అప్పటి నుంచి దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల రూపంగా పరిగణించబడ్డాడు.



జటాధరం పాండురాంగం శూలహస్తం కృపానిధిమ్ ।
సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే ॥ 1 ॥

అస్య శ్రీదత్తాత్రేయస్తోత్రమంత్రస్య భగవాన్నారదృషిః । అనుష్టుప్ ఛందః । శ్రీదత్తః పరమాత్మా దేవతా । శ్రీదత్తాత్రేయ ప్రీత్యర్థే జపే వినియోగః ॥

నారద ఉవాచ ।
జగదుత్పత్తికర్త్రే చ స్థితిసంహారహేతవే
భవపాశవిముక్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 1 ॥

జరాజన్మవినాశాయ దేహశుద్ధికరాయ చ ।
దిగంబర దయామూర్తే దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 2 ॥

కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తిధరాయ చ ।
వేదశాస్త్రపరిజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 3 ॥

హ్రస్వదీర్ఘకృశస్థూలనామగోత్రవివర్జిత ।
పంచభూతైకదీప్తాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 4 ॥

యజ్ఞభోక్తే చ యజ్ఞాయ యజ్ఞరూపధరాయ చ ।
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 5 ॥

ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవస్సదాశివః ।
మూర్తిత్రయస్వరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 6 ॥

భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే ।
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 7 ॥

దిగంబరాయ దివ్యాయ దివ్యరూపధరాయ చ ।
సదోదితపరబ్రహ్మ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 8 ॥

జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపురనివాసినే ।
జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 9 ॥

భిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమమయం కరే ।
నానాస్వాదమయీ భిక్షా దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 10 ॥

బ్రహ్మజ్ఞానమయీ ముద్రా వస్త్రే చాకాశభూతలే ।
ప్రజ్ఞానఘనబోధాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 11 ॥

అవధూత సదానంద పరబ్రహ్మస్వరూపిణే ।
విదేహదేహరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 12 ॥

సత్యరూప సదాచార సత్యధర్మపరాయణ ।
సత్యాశ్రయపరోక్షాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 13 ॥

శూలహస్తగదాపాణే వనమాలాసుకంధర ।
యజ్ఞసూత్రధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 14 ॥

క్షరాక్షరస్వరూపాయ పరాత్పరతరాయ చ ।
దత్తముక్తిపరస్తోత్ర దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 15 ॥

దత్త విద్యాఢ్య లక్ష్మీశ దత్త స్వాత్మస్వరూపిణే ।
గుణనిర్గుణరూపాయ దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 16 ॥

శత్రునాశకరం స్తోత్రం జ్ఞానవిజ్ఞానదాయకమ్ ।
సర్వపాపం శమం యాతి దత్తాత్రేయ నమోఽస్తు తే ॥ 17 ॥

ఇదం స్తోత్రం మహద్దివ్యం దత్తప్రత్యక్షకారకమ్ ।
దత్తాత్రేయప్రసాదాచ్చ నారదేన ప్రకీర్తితమ్ ॥ 18 ॥

ఇతి శ్రీనారదపురాణే నారదవిరచితం శ్రీ దత్తాత్రేయ స్తోత్రమ్ ।



जय हिन्द


No of visitors till now

website counter code

Follow us on


WHATSAPP GROUPS FOR STUDENTS


WHATSAPP HAMARIHINDI FOR TEACHERS


TELEGRAM


FACE BOOK


INSTAGRAM


TWITTER