కార్తీక మహాపురాణము
పన్నెండవ రోజు పారాయణం
05-11-2022
కార్తిక శుద్ధ ద్వాదశి, శనివారం.

క్షీరసాగర మథనం

క్షీరాబ్ది ద్వాదశి / చిలుకు ద్వాదశి
నేడే క్షీరాబ్ది ద్వాదశి.దీనినే చిలుకు ద్వాదశి అని కూడా అంటారు.
దేవ దానవులు కలిసి క్షీర సాగరాన్ని ఈ రోజే చిలికారట. అందుకని ఈ ద్వాదశి ని చిలుకు ద్వాదశి అని కూడా అంటారు.
ఏకాదశి రోజు పూర్తి ఉపవాసం ఉన్నవారు ద్వాదశి ఘడియలలో భోజనం చేయటానికి ముందు దగ్గరలోని ఆలయానికి వెళ్లి స్వయంపాకం ఇచ్చి భోజనం చేయడం మంచిది.
సాయంత్రం తులసి చెట్టు, ఉసిరి కొమ్మ కలిపి లక్ష్మీ నారాయణ పూజ చేసుకోవాలి.
ద్వాదశి కథ చదుకోవాలి. 5 కి మించి దీపాలు వెలిగించుకోవాలి.
ద్వాదశి ఘడియాల్లో చేసిన దానం అఖండ పుణ్యాన్ని ఇస్తుంది. దీప దానం, యజ్ఞోపవీత దానం , సాలిగ్రామ దానం, వస్త్ర దానం ఇలా కార్తీక పురాణం లో చెప్పిన దానాలు చేసుకోవచ్చు.
భక్తి శ్రద్ధలతో పూజ చేసుకొని అఖండ పుణ్యాన్ని సంపాదించుకోండి.