వేద పండితుల యొక్క సూచన మేరకు..
7వ తారీఖు సోమవారం నాడు సాయంత్రం పౌర్ణమి వచ్చుచున్నది.. మరుసటి రోజు అనగా మంగళవారం నాడు సాయంత్రం పౌర్ణమి ఘడియలు వెళ్లిపోవుచున్నవి.
మంగళవారం నాడు చంద్రగ్రహణం ఉన్న కారణం చేత సోమవారం నాడే సాయంత్రం చంద్రోదయం అయిన తరువాత 365 వత్తులను వెలిగించుకోవాలి మరియు నోములు ఉన్నవారు ఈ రోజునే నోములు నోచుకోవాలి.
ఆలయాల్లో జ్వాలతోరణం ఈరోజునే వెలిగించాలి
07-11-2022
కార్తిక శుద్ధ చతుర్దశి, సోమవారం.
ఆ బోతును అచ్చువేసి వదలుట (వృషోత్సర్జనము)/p>
వశిష్ఠుల వారు, జనకుని దగ్గరకు కూర్చుండ బెట్టుకుని కార్తిక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజ కార్తిక పౌర్ణమి రోజున పితృ ప్రీతిగా వృ షో త్సర్జనము చేయుట, శివ లింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరి కాయలు దక్షణతో దానము చేయుట మొదలగు పుణ్య కార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింప జేసుకొందురు. వారికీ కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుజుని పితృ దేవతలును తమ వంశ మందె వ్వరు ఆ బోతునకు అచ్చు వేసి వదలునో అని ఎదురు జుచుచుందురు.
ఎవడు ధనవంతుడై యుండి పుణ్య కార్యములు చేయక, ధన ధర్మములు చేయక కడకు ఆ బోతునకు అచ్చు వేసి పెండ్లి యైననూ చేయడో అట్టి వాడు లౌరవాది నకల నరకములు అనుభవించుట యే గాక వాణి బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సయం సమయమున శివ కేశవులకు ఆలయము. నందు దీపారాధన చేసి ఆ రాత్రి యంతయు జగర ముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజన మిడిన వారు ఇహ పరములందు సర్వ సుఖములను అనుభవింతురు.
కార్తీక మాసములో విసర్జీపవలసినవి
ఈ మాసమందు పరాన్న భక్షణ చేయురాదు. ఇతరులకు యెంగిలి ముట్ట కూడదు. తిన కూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరుల్లి పాయ తిన రాదు. తిలదనము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తిన రాదు. పౌర్ణమి, అమావాస్య సోమవారముల నాడు సూర్య చంద్ర గ్రహణపు రోజుల యందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయు వారలు ఆ రెండు రాత్రులు తప్పని సరిగా జాగారము ఉండవలెను. ఒక్క పుట మాత్రమే బోజన్నాము చేయవలెను. కార్తీక మాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్సిన్చారాడు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కల్లుతో సమానమని బ్రహ్మ దేవుడు. చెప్పెను. కావున, వేడి నీటితో స్నానము కూడదు. ఒక వేళ అనారోగ్యము వుంది యెలాగైన విధవ కుండ కార్తీక మాస వ్రతం చేయవలెనన్న కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము. చేయవచ్చును. అటుల చేయు వారలు గంగ, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.
ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతః కాలమున స్నానము చేయవలయును అటుల చేయని యెడల మహా పాపియై జన్మ జన్మములు నరక కూపమున బడి కృశింతురు ఒక వేళ నదులు అందు బాటులో లేనప్పుడు నుతి దగ్గర గాని, చెరువు నందు గాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరి స్నాన మాచరించావలెను.
శ్లో॥ గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి.
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిదింకురు||
అని పాటించుచు స్నానము చేయవలయును. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పటన శ్రవణం, హరి కథ కాలక్షేపము లతో కాలము గడుప వలెను సయంకలమున సంధ్య వందనది కాది. కృత్యములు ముగించి పూజ మందిరమున నున్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించ వలెను.
కార్తీక మాస శివ పూజ కల్పము.
- ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి.
- ఓం పరమేశ్వరాయ నమః అవాహం సమర్పయామి.
- ఓం కైలాసవాసయ నమః నవరత్న సంహాసనం సమర్పయామి.
- ఓం గౌరీ నాథాయ నమః పాద్యం సమర్పయామి.
- ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
- ఓం వృషభ వాహనాయ నమః స్నానం సమర్పయామి.
- ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి.
- ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవితం సమర్పయామి.
- ఓం కపాల ధారిణే నమః గంధం సమర్పయామి.
- ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి.
- ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి.
- ఓం పార్వతీనాథాయ నమః దుపం సమర్పయామి.
- ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి.
- ఓం లోక రక్షాయ నమః నైవైద్యం సమర్పయామి.
- ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి.
- ఓం శంకరాయ నమః సవర్ణ మంత్ర పుష్పం సమర్పయని.
- ఓం భావయ నమః ప్రదక్షణ నమస్కారాన్ సమర్పయామి.
ఈ ప్రకారముగా కార్తీక మసమంతయు పూజించ వలెను శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివ పూజ చేసిన యెడల ధన్యు డగును. పూజానంతరము తన శక్తి ని బట్టి బ్రాహ్మణులకు సమర్దన చేసి దక్షణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచ వలెను. ఇటుల చేసిన నూరు. ఆశ్వ మేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసము నెలరోజులు బ్రాహ్మణ సమారాధన శివ కేశవుల సన్నిధి ని నిత్య దీపరాదన, తులసి కోట వద్ద కర్పూర హరతులతో దీపారాధన చేసిన యెడల వారికీ, వారి వంశీయులకు, పితృ దేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి యుండి కూడా యీ వ్రతము నాచరించి ని వారు వంద జన్మలు నానా యోనులందునా జన్మించి తర్వత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్త ముగా ఆచరించిన యెడల పది హేను జన్మయొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినాను, విన్నను అట్టి వారలకు సకలైశ్వర్య ములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగును.