08-11-2022
కార్తిక పౌర్ణమి, మంగళవారం.
కార్తిక పౌర్ణమి
చంద్రగ్రహణం
(గమనిక:- ఈ గ్రహణ నియమాలు.. గ్రహణాన్ని సనాతనంగా విశ్వాసంతో నమ్మేవారికి, ఆస్తికులకు మాత్రమే... దయచేసి వారు మాత్రమే చదవండి...)
చంద్రగ్రహణం సందర్భంగా ఆధ్యాత్మిక, మంత్ర జప సాధకులు పాటించాల్సిన నియమాలు:
1. సూర్యగ్రహణ మైనా చంద్రగ్రహణమైనా అది ఎంతో విశేషమైన సమయము. ఈ సమయంలో చేసే మంత్రజప, అనుష్టానాలు శీఘ్రముగా సిద్ధిని కలిగిస్తాయి.
2. మంత్ర జప సాధకులు ఈరోజు సాధ్యమైతే ఉపవాసం ఉండాలి. కుదరని పక్షంలో ఉదయం 09 గంటల లోపు భుజించాలి.
3. తీవ్ర సాధకులు పట్టు స్నానం, మధ్యాహ్నం 02:39 నిమిషాలకు, సామాన్యులు, గృహస్తులు సాయంకాలం 05:26నిమిషాలకు చేయాలి. విడుపు స్నానం సాయంకాలం 06:20 కి చేసి తీరాలి. మామూలు గృహస్తులు, పిల్లలు, స్త్రీలు మాత్రం ఖచ్చితంగా సాయంకాలం 06:20 నిమిషాలకి విడుపు స్నానమైనా చేయాలి.
4. ఇక గ్రహణ మధ్య సమయం అంతా కూడా మంత్ర జప అనుష్ఠానాలతో గడపాలి.
5. గ్రహణ సమయంలో తినే పదార్థాలమీద, వండిన పదార్థాల మీద, నిలువ ఉండే పచ్చళ్ల మీద దర్భలు ఉంచాలి. అలాగే దేవతా మందిరంలో కూడా దర్బలు ఉంచాలి.
6. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు విశ్రాంతిగా ఉండాలి. పడుకుని ఉంటే శ్రేయస్కరం. వీలైతే భగవన్నామ స్మరణ చేసుకోవచ్చు.
7. గ్రహణ సమయంలో ఎవరూ భుజించరాదు. గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చంటి పిల్లలకు, రోగగ్రస్తులకు నియమాలు వర్తించవు.
8. పచ్చి పాలు, పెరుగు, ఆవు నెయ్యి, ఆవు నెయ్యి కలిపిన అన్నము, దర్భలు గాని తులసి దళాలు గాని వేసి ఉంచిన నీరు, నువ్వులు, ప్రకృతిలో సహజంగా దొరికే పండ్లు, కూరగాయలు,కొబ్బరికాయలు.. మొదలగు వాటికి గ్రహణ దోషము ఉండదు.
9. గ్రహణ అనంతరము అన్ని గదుల్లోనూ ఇంటా, బయటా కొద్దిగా గోమూత్రం చిమ్మినా లేక పసుపు నీళ్ళు గాని దర్భవేశి ఉంచిన నీళ్ళు గాని చిమ్ముకుంటే శుద్ధి అవుతుంది. తదుపరి దేవతా మందిరము, విగ్రహాలు శుభ్రపరచుకుని దీపారాధన చేసుకుని, ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసి, వంట చేసుకుని భుజించాలి.
10. గ్రహణ అనంతరము మర్నాడు ఇల్లు వ్యాపార స్థలాలలో దిష్టి గుమ్మడికాయలు మార్చి కొత్తవి కట్టుకోవాలి.
11. యజ్ఞోపవీత అర్హత ఉన్నవారు, మర్నాడు యజ్ఞోపవీతాన్ని కొత్తది తప్పనిసరిగా మార్చుకోవాలి.
12. అన్ని రాశుల వారు ముఖ్యంగా మేషరాశి వారు ఖచ్చితంగా మర్నాడు యధాశక్తి దానధర్మాలు, ఆలయ దర్శనం, తప్పనిసరిగా రుద్రాభిషేకం చేయించుకోవాలి.
13. దానంలో నూతన వస్త్రాలు, 1-1/4 కేజీ బియ్యము, యధాశక్తి వెండి చంద్రబింబము, 1-1/4 కేజీ మినుములు, స్వయంపాకము, వెండి/రాగి నాగబింబం ఉంచి దానమిచ్చుకోవాలి.