Welcome to

HAMARI HINDI


TIRUMALA TIRUPATHI DEVASTHANAM 2023 CALENDAR





Click here to download
TIRUMALA TIRUPATHI DEVASTHANAM 2023 CALENDAR






కార్తీక మహాపురాణము

పదహారవ రోజు పారాయణం


"ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి పదహారవ రోజు అధ్యాయం వినండి


09-11-2022


కార్తిక బహుళపాడ్యమి, బుధవారంవారం.






పారిజాతాపహరణం


నారదుడు ఇంద్ర లోకంలో ఇంద్రుడు తనకు భాహుమతిగా ఇచ్చిన అపురూప పుష్పం(ఆ పువ్వు ను ధరిస్తే ఎప్పటికి ఎవ్వనులుగా ఉంటారని నమ్మకం. ఆ వృక్షం దేవలోకంలో మాత్రమే వుండేది) పారిజాతాన్ని ద్వారకలో ఉన్న శ్రీ కృష్ణుడికి ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు రుక్మిణి దేవి అంతఃపురం లో వున్నారు. ఆ పువ్వు ను ఎదురుగా వున్న రుక్మిణికి ఇవ్వాలా? సత్య భామకు ఇవ్వాలా అన్న సందిగ్దావస్థలో వున్న కృష్ణుడికి నారదుడు రుక్మిణికి ఇమ్మని సైగ చేస్తాడు. దాంతో కృష్ణుడు రుక్మిణికి ఇస్తాడు. రుక్మిణి దేవి ని నారదుడు పొగుడుతాడు. జరిగిన వృత్తాంతాన్ని అంతటిని చిలవలు పలవలు చేసి చెలికత్తె సత్యభామకు చెబుతుంది. అది విన్న సత్యభామ తోక తొక్కిన ఆడత్రాచు పాముల లేస్తుంది. నెయ్యి పోస్తే బగ్గున మండిన మంటలా లేస్తుంది. ఆభరణాలను తీసివేసి కోపగృహానికి వెళ్లి తనలో తాను భాద పడుతూ వుంటుంది. మగ వారి ప్రేమ ఎదురుగా ఉన్నప్పుడే లేకపోతే వుండదు అనుకుంటుంది. తనకు అవమానం జరిగినట్లుగా భావించి భాదపడుతుంటుంది. పరిస్థితిని అంచనా వేసిన శ్రీకృష్ణుడు నారదుడి సేవకు ప్రద్యుమ్నుడిని పురమాయించి తాను సత్యభామ గృహానికి వెళ్తాడు. కోప గృహంలో వున్నా సత్యభామ వద్దకు వెళ్లి. "సత్యా ఎన్దుకుఇలా వున్నావు ఆభరణాలు ఎందుకు ధరించలేదు. నిన్ను ఎవరయినా ఎమన్నా అన్నారా ?చెప్పు ఇప్పుడే వాళ్ళ ప్రాణాలు తీసి వేస్తాను" అని అనునయం గా అడుగుతాడు. దానికి సత్య "ఎందుకు లేనిపోని ప్రేమలు కురుపిస్తారు మీకు ఎక్కడ నిజంగ ప్రేమ వుంటే అక్కడికే వెళ్ళండి. అయిన గోపాలుడికి మన్మద రహస్యాలు ఎలా తెలుస్తాయి ఇన్నాళ్ళు అత్తగారు దేవకీ దేవి సేవకి అందరికంటే ముందుగా నేనే వెళ్ళేదాన్ని ఇప్పుడు ఎ మొహం పెట్టుకుని వెళ్ళను. అందరు నా చాటుగా నన్ను చూసి నవ్వుకుంటూ వుంటే నేను తల ఎత్తుకుని ఎలా తిరగను? "అని కటువుగా సమాధానం చేభుతుంది. అప్పుడు కృష్ణుడు సత్యా నా వాళ్ళ ఏదయినా పొరబాటు జరిగితే నన్ను క్షమించు అంతే కాని నన్ను దూరం పెట్టకు నేను భరించలేను అని జగత్పాలకుడు తన శిరస్సును సత్యభామ దేవి కుడి కాలి పాదం మీద వుంచి అడుగుతాడు. సత్య భామ తన ఎడమ కాలి తో అకిలాండనాయకుడి శిరస్సుని తోసివేస్తుంది. అయిన కృష్ణుడు భాద పడక కోపం తో వున్న కాంతలు వుచిథానుచిథములు ఎరుగరు అనుకుని , నాసిరస్సు తోసివేసినందుకు నాకు భాద లేదు నా శిరస్సు కిరీటం తగిలి నీ సుకుమారమయిన పాదం కందిందేమో చుసుకొఅని ప్రేమగా అంటాడు. అయిన సత్య కోపం తగ్గకపోవడంతో కోపానికి అసలు కారణం పువ్వు అని తెలుసుకుని "పిచ్చిదానా పువ్వు కోసం భాద పడతావా నీ పెరట్లో పారిజాత వృక్షాన్నే నాటతాను. అని చెప్పడం తో సత్య భామ దేవే కాక అంతః పురం అంతా సంతోషం వెల్లివిరుస్తుంది. అనంతరం ఇంద్రలోకం వెళ్లి సత్యా శ్రీకృష్ణులు అడ్డు వచ్చిన వారితో యుద్ధం చేసి ఆ పారిజాత వృక్షాన్ని భూమి మీదకు తెస్తారు.



जय हिन्द


No of visitors till now

website counter code

Follow us on


WHATSAPP GROUPS FOR STUDENTS


WHATSAPP HAMARIHINDI FOR TEACHERS


TELEGRAM


FACE BOOK


INSTAGRAM


TWITTER