కార్తీక మహాపురాణము
రెండవ రోజు పారాయణం

27-10-2022
కార్తీక శుద్ధ విదియ,గురువారం.
"యమద్వితీయ లేదా భగినీ హస్త భోజనం".
ఈరోజున భాతృపూజనం అనగా అన్నదమ్ములను సత్కరించడం ప్రతి స్త్రీమూర్తి విధి. ఈ రోజున అన్నదమ్ములు కూడా తమ ఇంట భోజనం చేయకుండా సోదరి (అక్కా లేదా చెల్లి) లేదా సోదరి సమానురాలి చేతి భోజనం చేయడం పుష్టి కలిగిస్తుంది. అక్కా చెళ్ళెళ్ళను అన్నదమ్ములు కూడా యధా శక్తి వస్త్రాలంకారాలతో తృప్తి పరచాలి అని శాస్త్రం. ఈ రోజున యమధర్మరాజు తన సోదరి యైన యమున ఇంట పరివార సమేతంగా భోజనం చేయుట వలన ఈ పర్వదినానికి "యమ విదియ" అను పేరు వచ్చింది.
ఈ రోజున సోదరి చేతి వంట తిన్న సోదరునికి అపమృత్యు దోషం లేకుండా వుండేలాగ అలాగే అన్నదమ్ములకు భోజనం పెట్టిన సోదరిలకు దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తాయని యమధర్మరాజు వరం.
