





ఈ పొరబాట్లు మహా గ్రహాపాట్లు
తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరబాట్లు చాలా సమస్యలకు కారణం అవుతుంది.. ఇది చాదస్తం అనుకునే వారు దయచేసి చడవకండి, హిందూ సంప్రదాయాలను నమ్మే వాళ్ళు మటుకు తెలుసుకుంటే ఆచరిస్తారా లేదా అనేది మీ వ్యక్తిగతం ఇవన్నీ మన పెద్దవాళ్ళు ఆచరించిన నియమాలు తెలియ చేయడం వరకు నా బాధ్యత..అవి ఏమిటో తెలుసుకుందాము..
- పొద్దు ఎక్కేవరకు ఇంట్లో నిద్రపోకూడదు, ఆ టైం లో వాకిలి చిమ్ముకో కూడదు ,సూర్యుని మోహన నీళ్లు చల్లినట్టు అప్పుడు నీళ్లు చల్ల కూడదు...
- నిద్ర లేవగానే ఆ దుప్పటి విదిలించి మడవాలి లేకుంటే దరిద్రదేవత అసనంగా అక్కడ కూర్చుంటుంది.
- తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలా సేపు కూర్చో కూడదు..తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది అంటారు..
- మాసిన బట్టలు ఉతికాక స్నానం చేయాలి,బట్టలు జాడించిన నీటిని కాళ్లపైన పోసుకో కూడదు. అందు నుండి జేష్ఠ దేవికి ప్రవేశం దొరుకుతుంది.
- ఇళ్లు ఊడ్చిన చీపురు నిల్చో బెట్టకూడదు.
- వంట గదిలో వాడిన మసి బట్టలను పొద్దు పోయాక ఉతక కూడదు.
- సంధ్య కాలంలో సంసారం నిషేధం. నిద్రపోకూడదు.ఆహారం తిన కూడదు. గొడవలు పడకూడదు.ఆ సమయం ప్రదోషం కాలం.ఆకాలంలో ధ్యానం పూజ,మంచి ఫలితం ఇస్తుంది.
- పూజ గదిలో విగ్రహాలు లోహం అయితే ఎత్తు తక్కువగా ఉండాలి. కొంచెం పెద్దగా ఉంటే వెనుక వీపు భాగం ఉండకుండా ఉండాలి.
- పోయిన ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకుని ఇంటినిండా పెట్టకూడదు, మీ పెద్దలు నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు.
- పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం కచ్చితంగా మంచినీరు ఉంచాలి.
- ఒక్క కుంది దీపం పెట్టె వాళ్ళు 3 ఒత్తులు వేయాలి, రెండు అంత కన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది..
- రోజూ వారి దీపారాధన కు మీరు వాడే నూనె మీ శక్తి కొద్దీ ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము,నోము, దీక్ష,పరిహారాలు,సమయంలో, దీపారాధన నూనె అని మార్కెట్ లో దొరికేవి తెచ్చుకోకండి.నువ్వుల నూనె, ఆవు నెయ్యి స్తోమత లేకపోతే కొబ్బరి నూనె తెచ్చుకోండి..కానీ కల్తీ నూనె వాడకండి..
- పూజ చేసిన వెంటనే ఆ ఆసనం తీసివేయాలి. అలానే 5 min కూడా ఉంచకూడదు.కొంచమైనా కదపాలి.
- సాయంత్రం ఆరు దాటాక సూది, ఉప్పు,నూనె,కోడి గుడ్లు. ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు.వాటిని మీ వెంట కొని తెచ్చుకున్నట్టు..
- పొద్దు పోయాక పెరుగు, ఊరగాయాలు, మిరపపొడి ఎవ్వరికీ ఇవ్వకండి. ముఖ్యముగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి .అవి లక్ష్మీ స్థానాలు.
- శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు, మీకు తినే అలవాటు ఉంటే గుడ్లు ముందు రోజు తెచ్చుకోండి..
- జాతకంలో కుజ దోషం ఉన్న వారు,వ్యాపారం లో గొడవలు ఇబ్బందులు ఉన్న వారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది.
- శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి, ఎవరైనా శనివారం రోజు బహుమతులు గా ఇనుము వస్తువులు, నల్లటి,నీలి,వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి.
- ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రం గా ఉంచండి,పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి..పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు.
- వంట చేసే వారు మాట్లాడుతూ అరుస్తూ చేయ కూడదు, వండే టప్పుడు పొరబాటుగా కూడా మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు పడే ఉమ్ము అందులో పడితే అది మహా దోషం పోరబాటుగా అది అతిథులకు పెడితే చాలా పాపం చుట్టుకుంటుంది.
- ఇంటి ముంగిటలో తమల పాకు చెట్టు ఉంచకండి తోట ఉంటే తోటలోనే ఉంచండి తమల పాకు గౌరమ్మ మైలు గాలి తగల కూడదు..
- ఇంటి ముందు భాగంలో అరటి చెట్టు ఉంచకూడదు.
- తులసి చెట్టు ఆకులు గోటితో గిల్ల కూడదు.వేళ్ళతో తుంపాలి. ఆడవారు అసలు కోయకూడదు, పొద్దు పోయాక నీరు పోయకూడదు, ఒక చిన్న రాయిని తులసి కోటలో ఉంచి కృష్ణుడు గా భావించాలి...
- దేవాలయం లో పూజించే విధంగా గాని గుడిలో గాని ఫ్లూట్ ఉన్న కృష్ణుడు ఉండాలి, గృహంలో ఫ్లూట్ ఊదు తున్నట్టు కృష్ణుడి విగ్రహం ఉండకూడదు...ఆవుతో ఉన్న కృష్ణుడు విగ్రహం మంచిది.
- ఇంటికి వచ్చిన సుమంగళికి కుంకుమ బొట్టు పెట్టి పంపాలి.
- రాత్రి పూట గాజులు, తాళి పక్కన తీసి పెట్టకూడదు, తాళిబొట్టులో దేవతా విగ్రహాలు డాల్లర్స్ వేసుకో కూడదు, పిన్నిసులు వేయకూడదు, దేవుడికి వాడిన పసుపు మంగళసూత్రంకి పెట్టాలి..
- అపశకునాలు మాటలాడకూడదు తథాస్తు దేవతలు మన భుజాల పైనే ఉంటారు.
- వారానికి ఒక్కసారి అయినా ఇల్లు తుడిచే నీటిలో ఉప్పు వేయాలి. డబ్బు నగలు పెట్టె బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వడం లాంటివి చేస్తే డబ్బు అసలు నిలవదు.
- దీపం పెట్టిన కుంది కింద పళ్ళెంలో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కరువు లేకుండా ఉంటుంది.
- విడిచిన బట్టలు కాలితో తొక్క కూడదు, స్నానం చేసి తుడుచుకున్న టవల్ ఇంటి తలుపు పైన వేయకూడదు.
- ప్రతి రోజు ఇంట్లో దీపారాధన అలవాటు చేసుకోవాలి. వారానికి ఒక్క సారి అయినా గడపకు పసుపుకుంకుమ పెట్టాలి.
- ఉదయం లేవగానే పాచి మొహంతో అద్దం చూడకూడదు, తల దువ్వ కూడదు.
- భోజనం చేస్తున్న సమయంలో ఎవరిని తిట్టకూడదు.
- స్నానం చేసి విడిచిన బట్ట మళ్ళీ కట్టకూడదు.
- మంగళవారం, శుక్రవారం క్షుర సంస్కారం చేయకూడదు, గోర్లు తీయకూడదు, పేనులు కుక్కడం దువ్వడం చేయకూడదు.
- రెండు చేతులతో తల గోక కూడదు .గోర్లు కొరుకుతూ ఉండకూడదు, కాలుపై కాలు వేసి ఆడిస్తూ ఉండటం మంచిది కాదు, గుమ్మం చిలుకు ఆడించకూడదు.
- తినే టప్పుడు తుమ్మితే చై కడిగి మళ్ళీ తినాలి.
- వెండి వస్తువులు బహుమతులు గా ఇవ్వకూడదు.
- ఇంటి గుమ్మాల ముందు చెప్పులు వదల కూడదు. కొంచెం దూరంగా వదలాలి.
- ఇంట్లో మైలు ఉన్న స్త్రీలు వారు తాగే నీరు, తిని మిగిలినవి ఎవరికి పెట్టకూడదు, ముఖ్యంగా భర్తకు ఎంగిలి చేసినవి ఆ సమయంలో పెట్టకూడదు. మైలు నియమం పాటించాలి.
- ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు కానీ ఏ రోజు ఆ రోజు వ్యాపారం లో వచ్చే ధనం కానీ నేరుగా డబ్బులు దాచే బీరువాలో పెట్టకూడదు. ముందు ఉప్పు డబ్బాలో పెట్టి తర్వాత బీరువాలో పెట్టాలి.
- జీతం రాగానే ఆ డబ్బుతో ముందు శుక్రవారం వారం నాడు ఉప్పు కొనాలి.అప్పుడు ధనం ఇంట్లో నిలుస్తుంది.
- రాహు కాలంలో ,స్నానం, భోజనం, మైధునం చేయకూడదు.
- ఇంట్లో నిమ్మకాయ దీపం పెట్టకూడదు. దేవాలయం లో మటుకే పెట్టాలి.
- గృహస్థులు ఏక వస్త్రంతో పూజ చేయకూడదు.
ఇవన్నీ పెద్ద కష్టమైనవి కాదు. మనము పాటించాల్సిన కనీస నియమాలు. ఇవన్నీ పాటించకుండా ఎడ్డీమడ్డీ గా ఉంటూ ఆ పూజలు చేశాము ఈ పూజలు చేశాము ఫలితం లేదు అనకండి..