Welcome to

HAMARI HINDI


15-11-2022


కార్తీక బహుళ సప్తమి, మంగళవారం


కార్తీక మహాపురాణము

ఇరవైరెండవ రోజు పారాయణం


"ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి ఇరవైరెండవ రోజు అధ్యాయం వినండి








🌺పుష్పాష్టక మానస పూజ🌺



శివారాధనలో శివమానస పూజ ఎంతో పవిత్రమైనది. పుణ్యప్రదమైనది. మానస పూజలో ఎనిమిది విధములైన సద్గుణాలున్నాయి.


శ్లో||
అహింసా ప్రథమం పుష్పం- పుష్ఫమింద్రియ నిగ్రహం
సర్వ భూతా దయా పుష్పం- క్షమా పుష్పం విశేషత:
శాంతి పుష్పం- తప: పుష్ఫం- ధ్యాన పుష్పంతధైవచ
సత్య పుష్పం- విధి పుష్పం – శివప్రీతికరం భవత్!!


అనగా శివునికి ప్రీతికరమైన అష్టవిధి పుష్పాలు ఎనిమిది రకాలుగా ఉన్నాయి. అహింస- ఇంద్రియ నిగ్రహం – సర్వభూత దయ- క్షమ, శాంతి, తపము, ధ్యానము- సత్యము అనునవి. ఇవే మానవులకు సద్గుణాలుగా పేర్కొనబడినవి. వీటిని ఆచరణలో పెట్టి శివప్రీతికరంగా శివుని ఆరాధిస్తే సత్పలితాలను ఇస్తాయి. శివానుగ్రహం కలుగుతుంది. సుఖ సంతో షాలు లభిస్తాయి.


శివా!


  • తొలి పుష్పంగా అహింసతో నిన్ను ఆరాధి స్తున్నాను.

  • మలి పుష్పంగా నా సర్వేంద్రియాల చాపల్యమునూ అరికట్టిన ఫలంతో సేవిస్తున్నాను.

  • అన్ని ప్రాణులయందు కూడా దయా దృష్టులతో ప్రవ ర్తించడమనే గుణాన్ని ఒక పూవుగా అర్పిస్తున్నాను.

  • నీ సేవలో వున్న నాకు ఎలాంటి కష్ట నష్టాలు వాటిల్లవు. కానీ, పురాకృతమైన, మే సంచితార్థం వలన గానీ వచ్చే సకల విధములైన కష్టనష్టాలను, నీ యందుగల ఏకా గ్రత వలన ఓర్పుగా వుండి, నాలుగో పుష్పాన్ని అంది స్తున్నాను.

  • ఎటువంటి అపకారినైనా, ఘాతకుడినైనా, నిర్మ లంగా స్వీకరించే శాంతినే ఐదో పుష్పంగా అర్పిస్తున్నాను.

  • తపస్సును మనసారా ఆరో పుష్పంగా ఇస్తున్నాను.

  • నిత్యం నీ గురించి ధ్యానమే సప్తమ కుసుమంగా సమర్పణ చేస్తున్నాను.

  • స్థితిగతుల వలనగానీ, ఇతర మైన వివాదాల వలనగానీ, శంభో, అసత్యం పలక కుండా సత్యాన్నే పలకాలనీ, ఎరిగినవీ అయిన సంగ తులన్నింటినీ సత్యమనే పుష్ప రూపంలో మనసారా సమర్పిస్తున్నాను.

ఇదే పుష్పాష్టకం. నిజమునకు ఈ ఎనిమిది గుణ గణాలు ఎవరిలో ఉన్నాయో, వారికి వేరే పూజలు అవసరం లేదు. ఆ గుణాలను శివ పూజ గా సంకల్పించడ మే చాలుననే భావన కల్పిస్తుంది.


శివారాధనకు చేయాల్సిన లింగ పూజలు- వ్రతాలలో, లింగ పూజలలో పార్థివ లింగ పూజ శ్రేష్టమైనది. వ్రతా లలో పాశు పత వ్రతం కూడా అంత శ్రేష్టమైనది. సాధ కులు వైశాఖ మాసంలో వజ్ర లింగమును, జ్యేష్ట మాసంలో మరకత లింగమును, ఆషాఢ మాసంలో మౌక్తిక లింగమును, శ్రావణ మాసంలో ఇంద్ర నీల ముతో చేసిన లింగమును, భాద్రపదంలో పద్మ రాగ లింగాన్ని, మార్గ శిరంలో వైఢూర్య లింగాన్ని, మాఘ మాసంలో సూర్య కాంత లింగమును, ఫాల్గుణంలో చంద్రకాంత లింగమును సేవించాలనీ శాస్త్ర ప్రమా ణం. శివ పురాణోక్తం, రత్నాలు లభించకుంటే పన్నెం డు నెలల్లోను కూడా బంగారపు లింగములను అర్చించవచ్చు. బంగారు, వెండి లింగములను ఖరీదై నవి అనుకుంటే సుగంధ ద్రవ్యములతో చేసిన లింగా లు కూడా సేవనీయములేనని తెలిపింది శాస్త్రం. పరి శుద్ధమైన మనస్సు ముఖ్యము.


వర్ణాశ్రమ ధర్మరీత్యా, ఆయా కుటుంబాల సాంప్రదాయాల రీత్యా వారి వారి వేద శాఖల రీత్యాను ఏయే లింగాలు అర్హ మో వాటినే ఆరాధించాలి. పూజించాలి. పూజా నంతరం తూర్పు లేదా ఉత్తర దిక్కుగా ఆసీనులై దర్భలు ధరించి, దర్భాసనం మీద కూర్చుని ప్రాణాయా మం చేస్తూ, శాస్త్రానుసారం శివ నామ జపం చేసి, "నీ ఆజ్ఞతో ఈ వ్రతమును పూర్తి చేశాను శివ" అని చెప్పి మనసారా నమస్కరించి, పిదప అక్కడ ఉన్న దర్భలన్నింటిని తీసి ఉత్తర దిక్కుకు విసర్జన చేయాలి. దండలు, నార వస్త్రములు మేఖలం వదలి, ఆచమనం చేసి శివపంచాక్షరిని జపించాలి. శక్తి గల వారైతే జీవితాంతం వ్రతాచరణ చేయవచ్చు. పురాణాల్లో ధేమ్యుని సోదరుడైన ఉపమన్యుడు ఈ వ్రత మాచరించి అన్ని పాపములను పోగొట్టు కున్నాడు. శివ భక్తులెందరో ఆచరించి ధన్యులై నారు. మానస పూజలో భక్తి పుష్పం ఎంతో విశిష్ట మైనది. ప్రధానమైనది. బాహ్య, అనన్య- ఏకాంత భక్తి గొప్పవి. ఈ మూడింటిలో ఏ భక్తి మార్గం అనుసరించినా శివలోక ప్రాప్తి లభిస్తుంది.శివుని మించినది ఏదీ లేదు. శివుని ధ్యాన మే పర మోత్కృష్ట కార్యంగా భావించి చేస్తే సర్వ కామ నలూ సిద్ధిస్తాయి.


శ్లో||
పూజాకోటి సమం స్తోత్రం
స్తోత్ర కోటి సమో జప:
జప కోటి సమం ధ్యానం
ధ్యాన కోటి సమోలయ:
అని పురాణోక్తి.


శక్తి శివాత్మకమైనది శివలింగం. కలి మానవులు పవిత్రమైన ఈ కార్తిక మాసంలో అష్ట విధ పుష్పాలతో మనసారా శివార్చన ఆచరించినచో మనసంతా శివ మయమై, ఆధ్యాత్మిక భావం, శివతత్త్వం తెలిసి పునీ తులౌతారు. శివలీలలు అనంతములు. శివారాధనలో తరించడం ఎన్నో జన్మల పుణ్య ఫలం. భగవత్తత్త్వమే శివ తత్త్వం. శివుడే సర్వేశ్వరుడు. నిష్కళంకుడు. నిరంజనుడు.


ఓం హర హర మహా దేవ



जय हिन्द


No of visitors till now

website counter code

Follow us on


WHATSAPP GROUPS FOR STUDENTS


WHATSAPP HAMARIHINDI FOR TEACHERS


TELEGRAM


FACE BOOK


INSTAGRAM


TWITTER