కార్తీక మహాపురాణము
మూడవ రోజు పారాయణం

28-10-2022
కార్తీక శుద్ధ తదియ, శుక్రవారం.
త్రిలోచన గౌరీ వ్రతం
సాధారణంగా ఈశ్వరుణ్ణి త్రిలోచనుడు (మూడు కన్నులు కలవాడు) అంటాం.కానీ ఈరోజు గౌరీ దేవిని అంటే అమ్మవారిని కూడా త్రిలోచని గా భావించి అర్చించాలి. ఎందుకంటే శివపార్వతులకి భేదం లేదు. వారిద్దరూ ఒక్కటే స్వరూపం. అందుకే శాస్త్రం చెబుతోంది.
"వాగర్థా వివసంపృక్తౌ వాగర్థ ప్రతి పత్తయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ".
ఈ రోజు ఈ శ్లోకాన్ని తప్పనిసరిగా పఠించాలి. మూడోకన్ను జ్ఞానానికి సంకేతం.అమ్మవారిని ఈరోజున యధాశక్తి ఆరాధించడం వల్ల గౌరీదేవి అనుగ్రహం వల్ల సాధకుడిలో జ్ఞానశక్తి జాగృత మౌతుంది. ఈ రోజున ఉప్పు వేయకుండా చేసిన పులగం నైవేద్యంగా పెట్టి ఆహారంగా తీసుకోవాలి.అలాగే బ్రాహ్మణులకి ఉప్పుని దానం ఇవ్వాలి. దీని వల్ల విశేషమైన లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది.
ఈరోజు ఉప్పు లేని చప్పిడి ఆహారం తీసుకోవడం వల్ల సాధకుడికి జిహ్వ చాపల్యం, కోరికలు, తగ్గి ఆరోగ్యం కలుగుతుంది.
