29-10-2022
కార్తీక శుద్ధ చవితి, శనివారం.
కార్తీక మహాపురాణము
నల్గవ రోజు పారాయణం
"ఈ క్రింది వీడియో పై క్లిక్ చేసి, వినండి"

"నాగుల చవితి పర్వదినం"
ఈరోజు సర్ప / నాగ దేవతలను పూజించడం వల్ల విశేషంగా సర్ప దోషాల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అలాగే ఈరోజు తిథి ద్వయం. అంటే కార్తిక శుద్ధ పంచమి కూడా. ఈ పంచమిని "జ్ఞాన పంచమి" అని అంటారు.
ఈ రోజు చేసే శ్రీసుబ్రమణ్య స్వామి వారి ఆరాధనవల్ల సాధకుడికి జ్ఞానసిద్ధి కలుగుతుందని శాస్త్ర వచనం.
పాములు పాలు తాగుతాయా ..?
"దేవాఃచక్షుషా భక్షయిత్వా భక్తాన్ పాలయతి"
అనేది శాస్త్ర ప్రమాణ వాక్యం. అనగా దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరగిస్తారని అర్థం.
పాములు పాలు తాగవనే అపోహతో పాలు పోయడం మానకుండా కొద్దిగా ఆవు పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే అక్కడ ఉన్న పుట్ట మట్టిని ప్రసాదంగా తీసుకొని రెండు చెవి తమ్మిలకి అద్దుకోవాలి (దీనినే పుట్టబంగారం అంటారు).ఈ క్రియ వల్ల సంతాన దోషాలు తొలగి సంతాన ప్రాప్తి, కలిగిన సంతానం అభివృద్ధిలోకి వస్తుంది.
ఆధ్యాత్మిక/యోగా పరంగా సర్ప విశిష్టత: మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో అనేక వేల నాడులతో నిండివున్న వెన్నెముకను వెన్నుపాము అని అంటారు. అందులో కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఆ శక్తికి ప్రతిరూపంగా బాహ్యంలో ఉండే సర్పాలని ఆరాధించినట్లయితే, భక్తిగా స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేస్తే బాహ్యంగా చేసే ఈ సర్ప పూజలు, అభిషేకాల వల్ల ఆంతరికంగా మనలో నిద్రాణ స్థితిలో సర్పాకారంగా ఉన్న కుండలిని శక్తి ప్రచోదనమయ్యి మన దోషాలు, దుర్గుణాలు శాంతించి, సత్వగుణ అభివృద్ధి అవుతుంది. అలాగే ఆధ్యాత్మిక వికాసం కలుగుతుంది. మంచి శారీరిక ఆరోగ్యము కలుగుతుంది. సర్ప దోషాలు శాంతిస్తాయి.