కార్తీక మహాపురాణము
ఐదవ రోజు పారాయణం

శ్రీవల్లీ,దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
30-10-2022
కార్తీక శుద్ద షష్టి, ఆదివారం.
"అగ్నిషష్ఠి" పర్వదినం.
అగ్ని నక్షత్రమైన "కృత్తిక"నక్షత్ర ప్రభావం తో నిండిన కార్తిక మాసంలో జ్ఞానప్రదాత,అగ్ని గర్భుడు అయిన శ్రీసుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాల్సిన రోజు.
ఈ రోజునే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవసేనను వివాహమాడిన రోజుగా పురాణాలు తెలియ చేస్తున్నాయి. అలాగే ఈ రోజు స్వామి తారకాసుర సంహారం చేసినట్లుగా "స్కంద విజయం" గా కూడా జరుపుకుంటారు.
దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు తలచుకొని దీపారాధన చేసి,ఆ జ్యోతిని సుబ్రహ్మణ్య స్వరూపంగా భావించి యధాశక్తి అర్చించినట్లైతే అట్టి సాధకులకు సంతాన వృద్ధి, జ్ఞాన సిద్ధి కలగడమే గాక,మనలో ఉన్న అసుర(తామస) భావనలు తొలగిపోయి, దైవీ(సాత్విక) భావనలు వృద్ధిచెందుతాయి.