కార్తీక మహాపురాణము
ఆరవ రోజు పారాయణం
31-10-2022
కార్తీక శుద్ధ సప్తమి, సోమవారం

శ్రీ కార్తవీర్యార్జునుడు
సహస్ర బాహువులు కలవాడు, అష్ట సిద్ధులు, నవనిధులు ప్రసాదించే వాడు, తప్పిపోయిన వారిని తిరిగి రప్పించే వాడు,ఎవరి నామస్మరణ స్మరిస్తే పోయిన వస్తువులు, పోగొట్టుకున్న వస్తువులు లభిస్తాయో అట్టి శ్రీ కార్తవీర్యార్జున జయంతి ఈరోజు. కార్తవీర్యార్జునుని స్మరణ వల్ల సర్వత్రా రక్షణ, జయము లభిస్తాయని శ్రీ దత్తుని వరం. శ్రీ దత్త సాంప్రదాయంలో కార్తవీర్యార్జునుని స్మరణ తప్పనసరిగా చేయాలి.
కార్తవీర్యార్జునుడు సాక్షాత్తూ.శ్రీ సుదర్శన చక్రావతారం, సహస్ర బాహుసంపన్నుడు, శ్రీదత్తాత్రేయ వర ప్రసాది, మాహిష్మతీ రాజ్య పరిపాలకుడు, సోమవంశ మహారాజు, రావణుని నిగ్రహించినవాడు, మహావిష్ణు విశేష అవతారమైన పరశురాముని చేతిలో ముక్తిని పొంది విష్ణులోకాన్ని చేరుకున్నవాడు.
శ్రీ దత్త వరప్రసాది, అపర సుదర్శన అవతారమైన శ్రీ కార్తవీర్యార్జునుని స్మరించ వలసిన శ్లోకం:
"కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్
తన్నామ సంస్మరణా దేవ హృతం నష్ట్యచ లభ్యతే"
"సుమంతో,సుమంతో, శ్రీ కార్తవీర్యార్జునాయ నమః."
అనే మంత్రముతో జపిస్తే పోయిన వస్తువులు, ఇంటినుండి వెళ్ళిపోయిన మనుషులు, ధర్మముగా రావలసిన పైకము, ఉద్యోగము, వస్తువులు, పశువులు, వివాహము కావలసిన వారు.. ఇలా సమస్యలు ఉన్నవారు జపిస్తే, తప్పక సంకల్ప సిద్ధి పొందగలరు, సమస్య తీవ్రత ను బట్టి జపము ఎక్కువగా చేసుకున్నట్లయితే త్వరలో అభీష్ట సిద్ది కలుగుతుంది.