కార్తీక మహాపురాణము
ఏడవ రోజు పారాయణం
01-11-2022
కార్తీక శుద్ధ అష్టమి, మంగళవారం

గోపాష్టమి పర్వదినం
ఈ రోజున శ్రీ కృష్ణ భగవానుడు గోమాతని పూజించినట్లుగా పురాణాలు తెలియజేస్తున్నాయి. దీపావళి తరువాత, కార్తీక మాసం శుక్లపక్ష అష్టమిని గోపాష్టమిగా జరుపుకుంటారు. ఇది కృష్ణుని తండ్రి, నంద మహారాజు, బృందావనంలోని గోవులను సంరక్షించే బాధ్యతను కృష్ణుడికి అప్పగించినప్పుడు నిర్వహించిన వేడుక. నందనవనంలోని ప్రజలను కాపాడటానికి శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెన వేలుతో పైకి లేపింది కూడా ఈ రోజే అని పురాణాలు చెబుతున్నాయి.
అందునా ఈరోజు శ్రవణా నక్షత్రం,ఉండడం వల్ల గోపూజ ఎంతో విశేషమైన భగవదనుగ్రహాన్ని కలిగిస్తుంది.
ఈరోజు గోవులకి అలంకారం చేయడం, ఆహారం అందించడం, పూజించడం చేయడం శాస్త్ర విధి.