7వ రోజు..02-10-22 -ఆదివారం - సప్తమి

సరస్వతి దేవి

శ్రీ సరస్వతి దేవి అనగానే చదువుకు , జ్ఞానానికి ప్రతీక. కానీ శ్రీ సరస్వతి దేవి ఎడమ వైపు చేతిలో పుస్తకం , కుడి చేతి వైపులో జపమాల ఉన్నది. సాధారణంగా ఎడమ చేతిలో ఉన్న వస్తువు కంటే కుడి చేతిలో ఉన్న వస్తువుకె విలువ ఎక్కువ. కానీ ఇక్కడ అమ్మవారు ఎడమ చేతిలో పుస్తకం , కుడి చేతిలో జపమాల పట్టుకొని ఉన్నది. కారణం ఎల్లప్పుడు పుస్తకాలు చదవడం మాత్రమే కాదు చదివిన వాటిని ఎప్పుడు కూడా మననం చేస్తూ ఉండాలి అని అంతరార్ధం

వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా హంసవాహినిగా, వీణాపాణిగా, పుస్తకం మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో తెలుపు రంగుకు చెందిన వస్తువుల ప్రాముఖ్యం అధికం. "శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సారస వాహినీ శుభాకారత నొప్పు"నది గా బమ్మెర పోతన తన సరస్వతీ స్తుతిలో తెల్ల వస్తువుల పెద్ద జాబితానే ఉటకించాడు. సరస్వతి ధరించే వీణ పేరు"కచ్ఛపి"

ధ్యాన శ్లోకం

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

పురాణ ప్రస్తావన

ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ , పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాథలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతిని కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించాడనీ ఒక గాథ. సృష్టి కార్యాన్ని నిర్వహించడానికి బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతిని శ్రీమాతా దేవి ప్రసాదించిందని దేవీ భాగవతం చెబుతున్నది. సరస్వతిని బ్రహ్మకు విష్ణువు ఇచ్చాడని మరొక గాథ.




7వ రోజు..02-10-22 -ఆదివారం - సప్తమి

కాళరాత్రీ దేవి

“కాళ” అనగా మృత్యువు, “రాత్రి” అనగా అజ్ఞానం లేదా చీకటి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది కనుక అమ్మవారికి కాళరాత్రి అనే నామం వచ్చింది.కాళరాత్రీ దుర్గాదేవి నవదుర్గల్లో ఏడవ అవతారం. కాళీ, మహాకాళీ, భధ్రకాళీ, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండా, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రీదేవి కూడా ఒకరు. నవరాత్రుల ఏడవ రోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ సప్తమినాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. దేవి పురాణములో దుర్గా దేవిని సర్వాంతర్యామి , సర్వలోకాల్లో , సర్వజీవులలో ఆమె నివసిస్తుంది .

ధ్యాన శ్లోకం

ఓం కరాళ రూపా కాలాబ్జా
సమానాకృతి విగ్రహా
కాళరాత్రి శుభం దద్యాత్
దేవీ చండాట్ట హాసినీ

పురాణ ప్రస్తావన

దేవిభాగవతములో దుర్గాదేవి చరిత్ర ఉన్నది. దుర్గాదేవి నవరత్నమణి దీపకాంతులతో ప్రకాశించే లోకంలో , వేదములలో చెప్పినట్లు సింహవాహనారూఢ ఆయన దుర్గాదేవిప్రకాశిస్తుంది . దుర్గాదేవిని శివుని లో మిగిలిన సగం ఆకారంగా భావిస్తారు. సింహం స్వారీ చేయడం కనిపిస్తుంది. సింహం శక్తిని సూచిస్తుండగా, దుర్గాదేవిని త్రియాంబకే అని పిలుస్తారు, అనగా అగ్ని ,సూర్యుడు, చంద్రుడు ఆమె కళ్లలో ప్రకాశిస్తుంటారు . దుర్గా అనే పదం అంటే కష్టములనుంచి ప్రజలను రక్షించేది . ప్రపంచములో సర్వోనుత్తమైన శక్తి దుర్గ దేవి.

కాళరాత్రి దుర్గాదేవి : స్వరూపము చూచటకు మిక్కిలి భయానకము, ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలలను కలిగి ఉంటాయి . ఈమె వాహనము గాడిద ( గార్దభము), తన ఒక కుడిచేతి వరముద్ర ద్వారా అందఱికిని వరములను ప్రసాదించుచుండును. మఱియొక కుడిచేయి అభయముద్రను కలిగియుండును. ఒక ఎడమచేతిలో ఇనుప ఆయుధమును ( వజ్రాయుధం ), మఱొక ఎడమచేతిలో ఖడ్గమును ధరించియుండును. ఈమె ఎల్లప్పుడును శుభఫలములనే ప్రసాదించుచుండును. అందువలన ఈమెను శుభంకరి అని అందురు. కాళరాత్రి దుర్గ దుష్టులను అంతమొందించును. ఈమెను స్మరించినంత మాత్రముననే రాక్షసులు భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవును , ఈమె యనుగ్రహమున గ్రహబాధలు తొలగిపోవును. కాళరాత్రి దుర్గను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు, భయముగాని, శత్రువుల భయముగాని, ఏ మాత్రమును ఉండవు. భయవిముక్తులగుదురు. కాళరాత్రిమాత దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించువారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫలసాధకము


No. of visitors till now

website counter code