Welcome to

HAMARI HINDI


Career Guidance: పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..

CAREER GUIDANCE AFTER 10TH CLASS career guidance after 10th career guidance after 10th class career guidance after 10th class pdf career guidance after 10th ppt after 10th class after ssc what's next after 10th class study after 10th study after ssc job after 10th job after ssc Career Guidance పదవ తరగతి తర్వాత.. కోర్సులు, ఉద్యోగ అవకాశాలు..

Career Guidance:- పదవ తరగతి తర్వాత.. కోర్సులు మరియు ఉద్యోగ అవకాశాలు..






కోర్సులు,విభాగాలు / COURSES,SECTIONS


ఇంటర్మీడియెట్ / INTERMEDIATE



పాలిటెక్నిక్
POLYTECHNIC


ఐటిఐజ/ఐటీసీ
ITI / ITC



ఇంటర్ వొకేషనల్ కోర్సులు
VOCATIONAL COURSES


వ్యవసాయ పాలిటెక్నిక్లు
AGRICULTURAL POLYTECHNIC


సుస్థిర కెరీర్ ప్రగతి దిశగా చేసే ప్రయాణంలో పదో తరగతి తొలి సోపానం. ఇక్కడ మనం వేసే అడుగే మన జీవితాన్ని, భవిష్యత్తును, కెరీర్ను నిర్ణయిస్తుంది. ఒకవేళ ఇక్కడ తప్పటడుగు వేస్తే జీవితాంతం సర్దుకుపోతూ గడపాల్సిందే. అందుకే ఇప్పుడు తీసుకునే నిర్ణయం తెలివైనదై ఉండాలి. మన ఆసక్తికి అనుగుణంగా మన కెరీర్ను ఎంపిక చేసుకునేదై ఉండాలి. భవిష్యత్తును బంగారంగా తీర్చిదిద్దేదై ఉండాలి. మంచి వేతనం, ఎదుగుదల, పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టేదై ఉండాలి. అందుకే ఇప్పుడు వేసే అడుగు పదిలంగా వేయాలి. పెద్దలు, చదువుకున్నవారి వద్ద నుంచి మంచి సలహాలు, సూచలను తీసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలి. పదో తరగతి పాసైనప్పటి నుంచి ఏ కోర్సులో చేరాలి? ఎందులో చేరితే అవకాశాలు ఎలా ఉంటాయి? ఏ కోర్సు కష్టంగా ఉంటుంది? ఏ కోర్సు చదివితే జీవితంలో త్వరగా స్థిరపడవచ్చు? ఇలా ఎన్నో ప్రశ్నలు మనల్నే కాకుండా మన తల్లిదండ్రులకు కూడా ఎదురవుతుంటాయి. ఈ నేపథ్యంలో పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలపై ప్రత్యేక కథనం మీకోసం..



ఇంటర్మీడియెట్ 10+2


ఎంపీసీ:- ఇంజనీర్గా కెరీర్లో స్థిరపడాలనుకునే వారు ఇంటర్మీడియెట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ (ఎంపీసీ) గ్రూపులో చేరొచ్చు. గణితంపై ఆసక్తి ఉండి, వివిధ సూత్రాలను వేగంగా అన్వయించే నైపుణ్యాలు ఉన్న విద్యార్థులకు ఎంపీసీ సరైన గ్రూప్. ఐఐటీ, నిట్లు, టాప్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ సీటు సంపాదించాలంటే ఇంటర్లో చేరిన రోజు నుంచి లక్ష్యం దిశగా కృషిచేయాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, బిట్ శాట్ తదితర పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు కోసం కృషిచేయాలి. ఇంజనీరింగ్ కెరీర్పై ఆలోచన. లేని వారు, ఎంపీసీ తర్వాత బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో బీఎస్సీలో అడుగుపెట్టి, తర్వాత ఎమ్మెస్సీ, పీహెచ్ వంటి ఉన్నత విద్యను అభ్యసించి పరిశోధనలు దిశగా వృత్తి జీవితాన్ని సుస్థిరం చేసుకోవచ్చు.



బైపీసీ:- మొక్కలు, జంతువులపై ఆసక్తి ఉండి, విశ్లేషణాత్మక నైపుణ్యాలున్న వారికి సరిపడే గ్రూప్ బైపీసీ (బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ). వైద్య వృత్తిలో స్థిరపడాలనుకునే వారు తొలుత పూర్తిచేయాల్సిన గ్రూప్ ఇది. దీని సిలబస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కష్టపడి చదివే తత్వం ప్రధానం. ఈ గ్రూప్ ప్రాక్టికల్స్క ప్రాధాన్యం ఉంటుంది. ప్రయోగశాలలో పరిశీలించే విధంగా సన్నద్ధత అవసరం. బైపీసీ తర్వాత ఎంసెట్, ఎయిమ్స్, జిప్ మర్, సీఎంసీ పరీక్షల ద్వారా ఎంబీబీఎస్ లో చేరి డాక్టర్గా స్థిరపడటం సుదీర్ఘ ప్రక్రియే. రెండేళ్ల పాటు ఇంటర్ చదివి.. ఎంబీబీఎస్, పీజీ కోర్సు చేయాలి. కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా బైపీసీలో చేరడంపై నిర్ణయం తీసుకోవాలి.



సీఈసీ, ఎంఈసీ:- వ్యాపార వ్యవహారాలు, గణాంకాల విశ్లేషణపై ఆసక్తి ఉన్నవారికి సరైన గ్రూపులు సీఈసీ, ఎంఈసీ. ప్రస్తుత కార్పొరేట్ యుగంలో వ్యాపార, పారిశ్రామిక రంగం శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో కామర్స్లో నైపుణ్యాలున్న వారికి అవకాశాలు పలకరిస్తున్నాయి. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ వంటి ప్రొఫెనల్ కోర్సుల్లో రాణించేందుకు అనుకూలమైన గ్రూప్లు సీఈసీ, ఎంఈసీ. ఏ కోణంలో చూసినా ఇవి అవకాశాలకు వేదికగా నిలుస్తున్నవే.

* ఈ గ్రూప్లను ఎంపిక చేసుకునే విద్యార్థులకు సహనం ముఖ్యం. చిట్టాపద్దుల సమస్యలను సాధించే క్రమంలో ఒక్కోసారి చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది.



హెచ్ ఈసీ:- సామాజిక అంశాలపై అవగాహన, సమాజంలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే పరిణామాలను అన్వేషించే నైపుణ్యం ఉన్నవారికి సరైన గ్రూప్ హెచ్ ఈసీ. ఇంటర్ హెచ్ ఈసీ పూర్తిచేసిన తర్వాత ఉన్నత విద్యాపరంగా ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్ కోర్సుల నుంచి డిగ్రీ స్థాయి వరకు వివిధ కోర్సులను వీరు అభ్యసించవచ్చు. సంప్రదాయ డిగ్రీ కోర్సులతోపాటు జాబ్రియెంటెడ్ డిప్లొమా కోర్సులు విద్యార్థులకు అందుబాటు లో ఉన్నాయి. ఉన్నతవిద్య మాత్రమే కాకుండా ఉన్నతోద్యోగాల దిశగా కూడా అనేక అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ ఉద్యోగ నియామక పరీక్షల్లో విజయం సాధిస్తే. ప్రభుత్వ ఉద్యోగం ఖాయం.




పాలిటెక్నిక్


తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు యువత సత్వర ఉపాధి పొందేందుకు వీలుకల్పిస్తున్నాయి. చిన్న వయసులోనే ఉన్నత ఉద్యోగాలు, అత్యున్నత సాంకేతిక విద్య దిశగా ప్రయాణించేందుకు పునాదులు వేస్తున్నాయి.
అర్హత: పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు. ఈ పరీక్షను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (ఎసీబీటీఈటీ) నిర్వహిస్తోంది. ఇందులో సాధించిన ర్యాంకు ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందొచ్చు.
మూడేళ్ల కోర్సులు: సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్కండీషనింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటి బ్రాంచులున్నాయి.



మూడున్నరేళ్ల కోర్సులు:- కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వంటివి. కెరీర్:పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ (బీటెక్/బీఈ) కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలో లేటరల్ ఎంట్రీ స్కీం ద్వారా ప్రవేశించవచ్చు. దీనికి ఈ-సెట్ రాయాల్సి ఉంటుంది. ఉద్యోగాల పరంగా చూస్తే ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలలో అవకాశాలు లభిస్తాయి. వీటికి సంబంధించి ఎంప్లాయిమెంట్ న్యూస్, ప్రముఖ దినపత్రికలలో ప్రకటనలు వెలువడుతుంటాయి. డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారు స్వయం ఉపాధిని కూడా పొందొచ్చు.
వేతనాలు: చేరిన సంస్థసుబట్టి రూ. 15 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రారంభ వేతనం ఉంటుంది.




వ్యవసాయ పాలిటెక్నిక్ లు


గ్రామీణ యువత స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో వ్యవసాయ పాలిటెక్నిక్ లు ఏర్పాటు చేశారు. పాలిటెక్నిక్లలో మూడు రకాల కోర్సులున్నాయి. అవి.. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ కోర్సుల కాల పరిమితి రెండేళ్లు. ఇంజనీరింగ్ కోర్సు కాల పరిమితి మూడేళ్లు.


అర్హత, ప్రవేశాలు: పదేళ్ల చదువు కాలంలో కనీసం నాలుగేళ్లు గ్రామీణ ప్రాంత పాఠశాలలో చదివి ఉండాలి. పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంటర్, ఆపై కోర్సులు పూర్తిచేసిన వారు అర్హులు కారు. అర్హత పరీక్షలో సాధించిన గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ప్రకారం కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు.



అవకాశాలు: వ్యవసాయ డిప్లొమా కోర్సులు పూర్తిచేసిన వారికి ఎరువులు, పురుగు మందులు, విత్తనాల సంస్థలు వంటివాటిలో ఉద్యోగాలు లభిస్తాయి. సొంత ప్రాజెక్టులతో స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయొచ్చు. ప్రారంభంలో రూ. 15 వేల వరకు వేతనం లభిస్తుంది.



వొకేషనల్ కోర్సులు


అర్హత: పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఇంటర్మీడియెట్లో రెండేళ్ల కాల వ్యవధిగల ఒకేషనల్ కోర్సుల్లో ప్రవేశించవచ్చు. ఆరు కేటగిరీల్లో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి.


కోర్సులు: క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీస్ అసిస్టెన్స్ షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశించొచ్చు. అంతేకాకుండా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించే అప్రెంటీస్ పరీక్ష రాసే అవకాశం కూడా ఇంటర్ వొకేషనల్ గ్రూపుల్లో టెక్నికల్ గ్రూప్ ఉత్తీర్ణులకు లభిస్తుంది..


కెరీర్: బ్రాంచ్కనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అవకాశాలుంటాయి. ప్రభుత్వ రంగంలో రైల్వేలు, గెయిల్, సెయిల్ వంటి భారీ కంపెనీల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. స్వయం ఉపాధి దిశగా వెళ్లొచ్చు.



ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. వీటిని పూర్తిచేసింది తడవు తక్షణ ఉపాధి లభిస్తుంది


వీటిలో ముఖ్యమైనవి:


ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:


కరిక్యులం:వర్క్షాప్ టెక్నాలజీ, బేసిక్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఆటో పవర్ ప్లాంట్, ఆటో ట్రాన్స్ మిషన్ అండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్స్, ఆటో సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్..


ఉద్యోగావకాశాలు: ఆటో మెకానిక్, వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఆటో ఫిట్టర్, స్పేర్ పార్ట్స్ సేల్స్ అసిస్టెంట్/మ్యానుఫ్యాక్చర్ రిప్రెజెంట్, ఇన్సూరెన్స్ అండ్ లాస్ అసెసర్ అసిస్టెంట్, లాబొరేటరీ అసిస్టెంట్, ఆటో ఎలక్ట్రిషియన్.

మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:

ఉద్యోగావకాశాలు: ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల మెకానికల్ విభాగాలు, ఆటోమొబైల్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్, రిఫ్రిజిరేషన్, ఎయిర్కండీషనింగ్ సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్, వర్క్ షాప్ టెక్నీషియన్, పవర్ ప్లాంట్ల టెక్నీషియన్, సోలార్ సిస్టమ్ టెక్నీషియన్.


• ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో వాటర్ సప్లై అండ్ శానిటరీ ఇంజనీరింగ్, డీటీపీ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.



ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్:

ఉద్యోగావకాశాలు:ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అసెంబ్లీస్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ టెస్టర్-రిపైరర్, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ సేల్స్ అండ్ సర్వీస్.


ఎలక్ట్రికల్ టెక్నీషియన్: ఉద్యోగావకాశాలు: ఎలక్ట్రిక్ ఉపకరణాల అసెంబ్లర్, టెస్టర్, ఇన్స్టలేషన్ అండ్ సర్వీస్, రిపైరర్, వైండర్/రివైండర్ (మోటార్),సేల్స్ మ్యాన్.



ఐటీఐ/ఐటీసీ


ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ప్రభుత్వ), ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ (ప్రైవేటు)లు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ (డీజీఈటీ) పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి.



అర్హత: ఐటీఐ/ఐటీసీలలోని ట్రేడ్లలో పదో తరగతి లేదా తత్సమాన అర్హతతో చేరవచ్చు.


కోర్సులు: ఐటీఐ/ఐటీసీలలో మూడు నెలలు మొదలుకొని మూడేళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ తదితర కోర్సులున్నాయి.


కెరీర్: కోర్సు పూర్తయ్యాక అప్రెంటీస్ చేయొచ్చు. ఈ సమయంలో విద్యార్థి వేతనం (స్టెఫండ్) లభిస్తుంది. వివిధ కోర్సులను పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలుంటాయి. రైల్వే, ఆర్మీ, పోలీసు, పారా మిలిటరీ తదితర విభాగాల్లో అవకాశాలుంటాయి. స్వయం ఉపాధి దిశగా కూడా అడుగులు వేయొచ్చు. ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు ప్రవేశ పరీక్ష ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చు.


వేతనాలు: ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు వేతనం పొందొచ్చు.


స్వయం ఉపాధి దిశగా.. ఉన్నత విద్యనభ్యసించడానికి ఆర్ధిక ఇబ్బందు లు ఎదురైతే స్వయంఉపాధి దిశగా కూడా ఎన్నో సంస్థలు స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. సెట్విన్, స్వామిరామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్, ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ వంటి సంస్థలు ప్రస్తుత జాబ్ మార్కెట్కు అవసరమైన ఎన్నో కోర్సులను అతి తక్కువ రుసుముకే అందిస్తున్నాయి. ఆయా సంస్థలు అందించే కోర్సుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్ ట్రేడ్, సెల్ఫోన్ రిపేరింగ్, ట్రాక్టర్ డ్రైవింగ్, ఫుట్ వేర్ డిజైన్, స్టోర్ కీపర్, హౌస్ కీపింగ్, గార్మెంట్ తయారీ, బేకరీ అండ్ కన్ఫెక్షనరీ, పుట్టవంటి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి.



NOTE:- Dear kids always take suggestions from your Parents & Teachers.. It's just for your guidance only


CAREER GUIDANCE PDF











जय हिन्द


No of visitors till now

website counter code

Follow us on


WHATSAPP GROUPS FOR STUDENTS


WHATSAPP HAMARIHINDI FOR TEACHERS


TELEGRAM


FACE BOOK


INSTAGRAM


TWITTER