56 YEARS Of 1ST LANDING ON MOON
చంద్రునిపై తొలి మానవుడు… 1st MOON WALK
చంద్రునికి మానవునికి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. చంద్రుడిని అమ్మ తమ్ముడు ‘మామ’గా చందమామ అంటాం. .పిల్లలకోసం

అమ్మ పాడే– చందమామ రావో జాబిల్లి రావో
కుందనపు పైడికోర వెన్నపాలు తేవో॥ అనే అన్నమయ్య పాట నుండి ..
చంద్రుడిలో ఉండే కుందేలు కిందికొచ్చిందా… కిందికొచ్చి నీలా మారిందా... అని పడే ప్రేమ పాటవరకూ..
రావోయి చందమామ.. మా వింత గాథ వినుమా అని పాడే ఘంటశాల గారి వలపు పాటనుండి..
ఏ చాంద్ చుప్ నా జానా అనే లతా మంగేష్కర్ గారి పాట….
MOON WALK (DANCE MOMENT) చేస్తూ… Scared of moon అని పడే MICHAEL JACKSON పాటవరకు ప్రతీభాషలోనూ…
చంద్రునితో మనకు పాటల బంధం ఉంది…
భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహం.. దేవాలయాలలోని నవగ్రహాలలో 2 వ గ్రహంగా చంద్రునికి మానవ జీవితానికి ఎంతో సంబంధముంది.
చిన్నతనంలో మనం చదివే చందమామ కథలు… ప్రేమికులకు చంద్రుడు వెన్నెలలపై అల్లిన సాహిత్యం ఇలా….
అలాంటి చంద్రునిపైకి మనిషి వెళ్ళాడంటే ఆదో ఆద్భుతం. అక్కడ వేసిన మొదటి అడుగు ప్రపంచ మానవ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించారు.
1969 జూలై 16న అపోలో 11 అనే అంతరిక్ష నౌకలో నీల్ఆర్ స్ట్రాంగ్, ఎడ్విన్ ఇ. ఆల్డ్రిన్, మైకేల్ కోల్లిన్స్ అనే ముగ్గురు అమెరికా అంతరిక యాత్రికులు ప్రయాణం ప్రారంభించారు. నాలుగు రోజుల తర్వాత జూలై 20న చంద్రునిపైకి చేరారు.

మొదట నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపైన దిగి కాలుమోపాడు. మానవజాతి కోసం వేస్తున్న చిన్న అడుగు ఇది అనే మాటలన్నాడు. మానవుడు ఇతర గ్రహంపై కాలుమోపిన మొట్టమొదటి సందర్భం. ఆ తరువాత 20 నిమిషాలకు ఆల్డ్రిన్ దిగాడు. మూడవ వ్యోమగామి అంతరిక్ష నౌకలోనే ఉండి ప్రయోగాలు నిర్వహించాడు, క్రిందకు దిగలేదు. ఆర్మ్ స్ట్రాంగ్, ఆల్డ్రిన్ కలిసి చంద్రధూళిని, శిలల్ని భూమికి తీసుకువచ్చేందుకు సేకరించారు. చంద్రునిపై అమెరికా జెండా పాతారు. అక్కడ – ‘భూగ్రహం నుండి వచ్చిన మానవులు క్రీ.శ. జూలై 1969లో ఇక్కడ చంద్రునిపై కాలు మోపారు. మేము మానవజాతికంతటికి శాంతికోసం వచ్చాము’ అని వ్రాసివున్న ఫలకాన్ని అక్కడ ఉంచారు. అక్కడి నుండి అమెరికా అధ్యక్షునితో వారు సంభాషించారు. చంద్రుని ఉపరితలంపై ఆర్మ్ స్ట్రాంగ్ సుమారు రెండున్నర గంటలు గడిపారు. వారి వర్క్స్టేషన్లో ముగ్గురూ కలిసి చంద్రునిపై ఇరవై ఒకటిన్నర గంటలున్నారు. ఆ యాత్ర ముగించుకుని 1969 జూలై 24న భూమిపైకి తిరిగివచ్చారు
వారి ప్రయాణం… ప్రయోగాలు.. ప్రతీది తరువాతి తరానికి, ఇతర దేశాలకు మార్గదర్శనాలు అయ్యాయి..
అంతరిక్ష చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖిన్చబడ్డ ఈ రోజు భావి తరాలకు తెలియజెప్పాల్సిందే….
ఇక ప్రశ్న ఏమిటంటే..
ప్రశ్న. చంద్రునిపై మొదటి కాలు పెట్టింది నీల్ ఆర్మ్ స్ట్రాంగ్.. కాగా.. 2 వ కాలు ఎవరిదీ..?
జవాబు- రెండవ కాలు కుడా ఆయనదే.. ఎందుకంటే అయన 2 కాళ్ళతో నడిచారు మరి….
🤣😂🥰
(Just kidding)
2వ వ్యక్తి ఎడ్విన్ ఇ. ఆల్డ్రిన్ (look at the pic here👇🏾👇🏾)

చంద్రునిపై మొదటి కాలు పెట్టిన
నీల్ఆర్ స్ట్రాంగ్ బృందం
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html