LEARN SIMPLE HINDI DAY-12

SPOKEN HINDI DAY-12
https://hamari-hindi.com/learn-simple-hindi-day-12/

LEARN SIMPLE HINDI లో భాగంగా 12 వ రోజుకు స్వాగతం.

ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం మరిన్ని క్రియా పదాలు వాటి ప్రయోగాలు నేర్చుకుందాం..

🧠 నేటి 10 పదాలు 🧠

HindiEnglishTelugu
लेTakeతీసుకొను
लोTakeతీసుకొనుము
लीजिएTakeతీసుకోండి
पीDrinkత్రాగు
पिओDrinkత్రాగుము
पीजिएDrinkత్రాగండి
खाEatతిను
खाओEatతినుము
खाइएEatతినండి
अंदरInsideలోపలకు

📒 2. Note🧠

📌 “तू, तुम, आप” అన్నివి హిందీలో “You” అనే అర్థానికే వస్తాయి. కానీ ఇవి సంభాషణ స్థాయిని, గౌరవాన్ని బట్టీ వాడతాం.

  • तू – చాలా సన్నిహితులు, చిన్నవారికి, జంతువులకు (informal)
  • तुम – స్నేహితులు, సమాన వయస్సు వాళ్ళకి (casual)
  • आप – గౌరవంగా, పెద్దలకు, కొత్త వాళ్లకి , బహువచనంలో మీరు, తమరు అని సంబోధించడానికి వాడతాము (formal)

✍️ వీటి వల్ల క్రియ (verb) రూపం కూడా మారుతుంది.

📒 3. EXAMPLES🧠

1️⃣ गुरुजी आप अंदर आइए। – గురూజీ, మీరు లోపలికి రండి. – Guruji, You please come inside.

2️⃣ आप यहां बैठिए। – మీరు ఇక్కడ కూర్చోండి. – You Please sit here.

3️⃣ राजू, तुम फल खाओ। – రాజూ, నువ్వు ఫలాలు తినుము. – Raju, you eat the fruits.

4️⃣ सुधा जी, आप किताब लीजिए। – సుధాజీ, మీరు పుస్తకం తీసుకోండి. – Sudha ji, please take the book.

5️⃣ रोहित, तू दूध पी। – రోహిత్, నీవు పాలు త్రాగు. – Rohit, you drink the milk.

📒 4. PRACTICE SENTENCES🧠

దిగువ వాక్యాలలో గల ఖాళీలను సరైన క్రియా పదంతో పూరించండి:
(Choose the correct form of the verb:
ले / लो / लीजिए etc.)

  1. माँ, आप पानी ______।
  2. राहुल, तुम किताब ______।
  3. अजय, तू चाय ______।
  4. पापा, आप फल ______।
  5. सीमा, तुम दूध ______।

5. Answers (సమాధానాలు)

  1. लीजिए
  2. लो
  3. पी
  4. खाइए
  5. पिओ

🏠 7. Homework

📌 క్రింద ఇచ్చిన క్రియ పదాలు వాడుతూ “तू, तुम, आप” తూ, తుమ్, ఆప్ రూపాల్లో మీరు మీరే వాక్యాలు తయారు చేయండి:

  • बोल (Speak)
  • पढ़ (Read)
  • चल (Walk)
  • देख (See)
  • साफ कर (Clean)

ప్రతి క్రియా‌కు 3 వాక్యాలు = మొత్తం 15 వాక్యాలు వ్రాసి, టీచర్ కి చూపించండి. 💯✨

Spoken hindi, it helps gain knowledge to speak in hindi

“सपने वो नहीं जो हम सोते वक्त देखते हैं, सपने वो हैं जो हमें सोने नहीं देते।”

-A.P.J. अब्दुल कलाम

👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾

HAMARI HINDI WHATSAPP GROUPS
HAMARI HINDI WHATSAPP GROUPS

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html

https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html