LEARN SIMPLE HINDI లో భాగంగా 15 వ రోజుకు స్వాగతం.
ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం మరిన్ని క్రియా పదాలు వాటి ప్రయోగాలు నేర్చుకుందాం.. హిందీ లో వర్తమాన కాలాన్ని నేర్చుకుందాం. ఇక్కడ కేవలం మాట్లాడేందుకు… అనగా SIMPLE HINDI నేర్చుకుంటున్నాం కావున మొత్తం వ్యాకరణాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఇక్కడ ఇచ్చిన వాటినే నేర్చుకోండి. సులభంగా ఉంటుంది.
📘 Vocabulary
हिंदी (Pronunciation) | తెలుగు (Telugu) | English |
---|---|---|
सीख (seekh) | నేర్చుకొను | Learn |
सीखो (seekho) | నేర్చుకొనుము | Learn (you) |
सीखिए (seekhiye) | నేర్చుకోండి | Learn (formal) |
दे (de) | ఇచ్చు | Give |
दो (do) | ఇమ్ము | Give (you) |
दीजिए (deejiye) | ఇవ్వండి | Give (formal) |
देख (dekh) | చూడు | Look |
देखो (dekho) | చూడుము | Look (you) |
देखिए (dekhiye) | చూడండి | Look (formal) |
सब (sab) | అందరూ / అన్నీ | All |
वर्तमान काल Present Tense
✍️ NOTE🧠 వ్యాకరణ నిబంధనలు (Rules):
విద్యార్థులారా….
ఈరోజు మనం నిత్యజీవితంలో తరచుగా ఉపయోగించే వాక్యాలను హిందీలో నేర్చుకుందాము.
వ్యాకరణ పరిభాషలో దీనిని वर्तमान काल అలాగే ఇంగ్లీషులో Present Tense గా చెబుతారు.
वर्तमान काल లో వాక్య నిర్మాణం కోసం క్రియా పదానికి/క్రియా ధాతువుకి क्रिया धातु +____ ता, ते, ती లను కలుపుతాము.
✨ ता, ते, ती– వివరణ
ता పుంలింగ ఏకవచన పదాలకు ఉపయోగిస్తాము ..
ते పుంలింగ బహువచన పదాలకు ఉపయోగిస్తాము. .
ती స్త్రీ లింగ ఏక వచన, బహు వచన పదాలకు ఉపయోగిస్తాము..
Hindi | Form Explanation |
---|---|
ता | పుల్లింగ ఏకవచన (Singular masculine) |
ते | పుల్లింగ బహువచన (Plural masculine) |
ती | స్త్రీలింగ ఏక వచన, బహు వచన పదాలకు (Feminine both sigular & pl.), |
📝 సూచన:
ఈ వాక్యాలను ప్రతిరోజు అలవాటుగా చేసే పనులకు, అభిరుచులకు వాడుతాము.
📒 PRACTICE SENTENCES🧠
👉 ఈ వాక్యాలను తెలుగులోకి, ఇంగ్లీషులోకి అనువదించండి. అర్థం చేసుకోండి..
- सुरेश क्या खाता है?
- राजू स्कूल जाता है।
- पीटर हिंदी पढता है।
- लड़के मैदान में खेलते हैं।
- पिताजी बेंगलुरु जाते हैं।
- राम और गोपाल यहां क्या देखते हैं?
- लड़की पाठ लिखती है।
- लड़कियाँ गाना सीखती हैं।
- सीता, तुम क्या सोचती हो?
✅ Answers
1.సురేష్ ఏమి తింటున్నాడు? What does Suresh eat?
2.రాజు పాఠశాలకు వెళ్తున్నాడు. Raju goes to school.
3.పీటర్ హిందీ చదువుతున్నాడు. Peter studies Hindi.
4.అబ్బాయిలు పొలంలో ఆడుకుంటున్నారు. The boys play in the field.
5.తండ్రిగారు బెంగుళూర్ వెళుతున్నారు. Father goes to Bangalore.
6.రామ్ మరియు గోపాల్ ఇక్కడ ఏమి చూస్తున్నారు? What do Ram and Gopal see here?
7.అమ్మాయి పాఠము వ్రాయుచున్నది.. The girl writes the text.
8.అమ్మాయిలు పాటలు నేర్చుకుంటున్నారు.. The girls learn songs.
9.సీత, మీరు ఆలోచిస్తున్నారు?. Sita, what do you think?
📌 గమనిక: ఈ పట్టికను అర్థం చేసుకుంటే వర్తమానకాలం వచ్చేసినట్లే
क्रिया धातु +____ | ఉదాహరణ | తెలుగు అర్థం | English Meaning |
---|---|---|---|
ता हूँ | मैं पढ़ता हूँ | నేను చదువుతాను | I do / I read |
ता है | वह खाता है | అతడు తింటాడు | He does / eats |
ते हैं | वे खेलते हैं | వారు ఆడుతారు | They do / play (male/mixed) |
ती है | वह गाती है | ఆమె పాడుతుంది | She does / sings |
ती हैं | वे लिखती हैं | వారు వ్రాస్తున్నారు (స్త్రీ) | They do (females) |
ते हो | तुम जाते हो | నీవు వెళ్తావు | You do / go (informal) |
ते हैं | आप देखते हैं | మీరు చూస్తారు | You do / see (formal/pl) |
🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍
““सफलता उन्हीं को मिलती है जो अपने फैसलों से दुनिया को बदलने की हिम्मत रखते हैं।”
““తమ నిర్ణయాలతో ప్రపంచాన్ని మార్చే ధైర్యం ఉన్నవారికే విజయం లభిస్తుంది.”
“Success comes to those who have the courage to change the world with their decisions.”
🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍🌍
👇🏾👇🏾ఇవి కుడా చూడండి
👇🏾👇🏾
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html