RAAMA NAAMAM-RAMAYANAM-RAMA KALYANAM-RAMA RASAM

RAAMA NAAMAM-RAMAYANAM-RAMA KALYANAM-RAMA RASAM

నాడు భద్రాచలంలో రామ మందిర నిర్మాణం నుండి ప్రతీగ్రామంలో రామ మందిరాన్ని ఏర్పాటు చేసి.. అందరూ కంచర్ల గోపన్న “రామదాసు” లుగా మారి కీర్తనలు చేస్తూనే వచ్చారు..

1.సహస్రనామ తత్తుల్యం:

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే ||

పరమశివుడు పార్వతీ దేవి తో చెప్పిన ఈ శ్లోకం అందరికీ తెలిసినదే. శ్రీ రామ రామ రామ అని మూడు సార్లు జపిస్తే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలము వస్తుందనేది ఈ శ్లోక భావం .

అదెలా అంటే  ప్రకారం “య” వర్గం లో “రా” రెండవ అక్షరం కాగా… “ప” వర్గం లో “మ ” ఐదవ అక్షరం రెండుx ఐదు =పది.. దీనిని బట్టి ఒక సారి రామ అంటే పది సంఖ్య కు సంకేతం .ఇక మూడు సార్లు జపిస్తే 10x10x10 =1000 కి సమానమవుతుంది .

జై శ్రీ రామ్రామ రామ రామ
శ్రీ రామ జయరామ జయజయ రామ

2.రామాయణము: “రామస్య ఆయనం రామాయణం”

అయనము అంటే నడక అని అర్థం. రామాయణము అంటే రాముని యొక్క నడక అని అర్థం.

శ్రీరామ మందిరము లేని ఊరు..

శ్రీరామ కీర్తన చేయని నోరు..

శ్రీరామయని తలవని శుభము.. ఉండజాలవు..

 “శ్రీరామ” వంటి నామము..

శ్రీరాముని వంటి కుమారుడు, సోదరుడును, భర్త, మిత్రుడు, చుట్టము, స్వామి, పరిపాలకుడు

మరొకరు ఉండరు.. వారు నడచిన మార్గం అందరికీ ఆదర్శం..

అట్టి రామ రామయ్య  నడచిన, పాలించిన భూమియందు మనం జన్మించడమే మహదానందకారకం..

శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం

రామం నిశాచరవినాశకరం నమామి

అంటూ మనం శ్రీరామచంద్రుని జన్మదినోత్సవాన్ని జరుపుకునే చైత్ర శుధ్ధ నవమి.

ఈరోజు పవిత్రమైన Sri Rama Navami పర్వదినం. ఈరోజు శ్రీరాముడు జన్మించినరోజు.. భారతీయులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. ఆయన జీవితం మనకు సత్యం, న్యాయం, కర్తవ్యనిష్ఠ వంటి విలువలను నేర్పుతుంది. కష్టకాలంలో కూడా ధర్మాన్ని వదలకుండా ఎలా జీవించాలో ఆయన చూపించారు.

ఈ పర్వదినం సందర్భంగా భక్తులు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి, “పానకం ప్రసాదం తయారుచేస్తారు. అలాగే రామాయణం పారాయణం చేస్తూ శ్రీరాముని ఆశీస్సులు కోరుకుంటారు.

సందేశం
ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. నిజాయితీగా, కర్తవ్య బద్ధంగా జీవిస్తే విజయంమనదే.

ఈ సందర్భంగా ప్రతిగ్రామంలో భక్తులు భక్తి భావంతో రామకళ్యాణం నిర్వహిస్తారు.

3.🛕 శ్రీ సీతారాముల కల్యాణం💐

ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా జరుపుకునే అత్యంత పవిత్రమైన కార్యక్రమం శ్రీసీతారాములకల్యాణం. ఇది కేవలం ఒక వివాహవేడుక మాత్రమే కాదు— ధర్మం, ప్రేమ, కర్తవ్యానికి ప్రతీక.

అయోధ్య రాజకుమారుడు శ్రీరాముడు మరియు మిథిలా రాజకుమారి సీతాదేవి వివాహం భక్తులకు ఆనందం, ఆధ్యాత్మికతను అందిస్తుంది. ఈ కల్యాణం చూడడం, వినడం కూడా పుణ్యఫలాన్ని ఇస్తుందని నమ్మకం.

🕉 మంత్రం

మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా
కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదః శతమ్

అర్థం

“లోకరక్షణ కోసం ఈమాంగల్యాన్ని నీ కంఠానికి కడుతున్నాను. మనం నూరేళ్లు సుఖంగా, కలసి జీవిద్దాం” అని శ్రీరాముడు సీతాదేవికి పలికిన పవిత్రమైన మాటలు... అంటే కళ్యాణం అనేది లోక రక్షణ హేతువు అని ఆనాడే చెప్పారు..

4.ఏంతో రుచిరా.. ఈ రామ రసం..

ఈరోజు మరో ముఖ్యమైన అంశం పానకం సేవనం. వేసవి కాలం ప్రారంభమవుతోంది. ఈ సమయంలో మన శరీరాన్ని చల్లగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. అలాంటి సమయంలో మన సంప్రదాయ పానీయం పానకం ఒకఅద్భుతమైన సహజ ఔషధంలాంటిది.

ప్రత్యేకంగా శ్రీరామనవమి రోజున పానకం తయారు చేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించడం ఒకమంచి ఆచారం. ఇది కేవలం పండుగకు మాత్రమేకాకుండా— వేసవిలో ప్రతిరోజూ తీసుకోవడానికి కూడా చాలా మంచిది.

🌿 పానకం అంటే ఏమిటి?

పానకం అనేది బెల్లం, నీరు, మిరియాలపొడి, ఏలకులు, (నిమ్మరసం) కలిపి తయారుచేసే సహజపానీయం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ వేసవిలో అందరికీ దాహార్తిని తీర్చే ఔషధం ఈ రామ రసం..

మీకు మరియు మీకుటుంబ సభ్యులకు
🌸 శ్రీరామనవమి శుభాకాంక్షలు🌸

— మీ
Hamari Hindi Team
💐 శ్రీ సీతారాముల కల్యాణోత్సవ శుభాకాంక్షలు💐

AYODHYA RAM DARSHAN

COURTESY -DD

BHADRACHALAM LIVE

COURTESY -BHAKTI NIDHI

5.రామ కీర్తనలు/పాటలు

కొన్ని భక్తి పాటలు.. సినిమాలనుండి

🎵 “శ్రీరామ నీ నామమే ఎంతో రుచిరా”
👉 Movie: Bhakta Ramadasu
🔗 https://www.youtube.com/results?search_query=sri+rama+nee+naamame+ento+ruchira

🎵 “జగదానంద కారక”
👉 Movie: Tyagayya
🔗 https://www.youtube.com/results?search_query=jagadha+ananda+kaaraka+telugu

🎵 “రామ కథను వినరయ్యా”
👉 Movie: Lava Kusa
🔗 https://www.youtube.com/results?search_query=rama+katha+gaaname+lava+kusa

🎵 “సీతారాముల కల్యాణం చూద్దాం రారండి”

🔗 https://www.youtube.com/results?search_query=seetharamula+kalyanam+chooddam+rarandi

🎵 “రామ సీతా రామ”
👉 Movie: Adipurush
🔗 https://www.youtube.com/results?search_query=ram+sita+ram+telugu+adipurush

🎵 “జై శ్రీరామ్ (Telugu)”
👉 Movie: Adipurush
🔗 https://www.youtube.com/results?search_query=jai+shri+ram+telugu+song

🎵 Modern Sri Rama Bhajans Mix
🔗 https://www.youtube.com/results?search_query=sri+rama+bhakti+songs+telugu+latest