AP TET & DSC కి మరింత సమయాన్ని పెంచిన విద్యాశాఖ.
టెట్, మెగా డిఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఎన్నికల్లో హామీ మేర ఈ మొత్తం ప్రక్రియ ను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
అయితే నూతనంగా బీఈడీ, డిఈడి పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డిఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని టెట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీచేసింది ప్రభుత్వం.
టెట్, మెగా డిఎస్సీ పరీక్షలకి సన్నద్ధం అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు మంత్రి విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు.
అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్ధం అవ్వడానికి
టెట్ పరీక్ష నిర్వహణ కు 90 రోజులు, మెగా డిఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది.
త్వరలోనే టెట్ మరియు డిఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది.
SYLLABUS,TIMETABLE PDFS DOWNLOAD HERE
NOTIFICATIONS | DOWNLOAD LINKS |
---|---|
AP TET Notification | DOWNLOAD PDF |
AP TET Information Bulletin | DOWNLOAD PDF |
AP TET Schedule | DOWNLOAD PDF |
AP TET Syllabus | DOWNLOAD PDF |