BIRTH ANNIVERSARY OF TILAK-AZAD
భారత దేశం ప్రపంచ దేశాల చరిత్రలో.. అందరికీ నాగరికతకు నేర్పిన మహోన్నత పుణ్యభూమి. అతి సుందర సుసంపన్నమైన ఈ పుణ్యభూమి.. ఎందరో మహానుభావులకు జన్మనిచ్చింది..
అట్టి ప్రాతఃస్మరనియుల్లో.. నేడు ఇద్దరి జయంతి నేడు.
వారే.. లోకమాన్య తిలక్ గారు మరియు చంద్రశేఖర్ ఆజాద్ గారు.
వారి ప్రేరణాత్మక గాథ ప్రతీ విద్యార్థి తెలుసుకోవాలి..

“స్వరాజ్యం నా జన్మ హక్కు- దాన్ని సాధించి తిరుతాను”
మహారాష్ట్రలో 23 ఆగస్ట్ 1856 లో జన్మించిన బాల గంగాధర్ తిలక్ గారు జ్ఞానవంతుడూ, ధైర్యవంతుడిగా బాల్యం నుండే ప్రతీ విషయంలోనూ తెగువను కనబరిచేవారు..
ఆయనను ప్రజలు ప్రేమతో “లోకమాన్య తిలక్” అని పిలిచేవారు. దేశానికి స్వరాజ్యం అవసరం అని నమ్మిన తిలక్, బ్రిటీష్ వారిని ఎదుర్కొనడంలో ముందుండేవాడు.
తన పత్రిక “కేసరి”లో బ్రిటీష్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఓ వ్యాసం రాశారు. అప్పట్లో ఇది చాలా ధైర్యమైన పని. బ్రిటీష్ వారు కోపంతో తిలక్‌ను అరెస్టు చేసి జైలు కి పంపించారు.
జైల్లో ఉన్నప్పుడు కూడా తిలక్ ఓ మాట చెబుతూ దేశభక్తిని వెలిగించారు –
“స్వాతంత్ర్యం నా జన్మ హక్కు – దాన్ని నేను పొంది తీరుతాను!”
ఈ మాటలు దేశవ్యాప్తంగా ప్రేరణగా మారాయి. ప్రజలలో జాతీయభావనను రగిలించాయి. ఎన్నో కష్టాలు వచ్చినా, జైలు జీవితం అయినా తిలక్ భయపడలేదు. ఆయన ధైర్యం, దేశప్రేమను చూసి ఎందరో యువతులు ఉద్యమంలో చేరారు.
భారత జాతీయోద్యమానికి కొత్తదారులు వేసిన తిలక్ పూర్తిపేరు బలవంత్ గంగాధర్ తిలక్. వీరు న్యాయవాది. 1890లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆనాటికి భారత జాతీయ కాంగ్రెస్ జాతీయోద్యమం కార్యక్రమాల్ని జరిపేవారు. ‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అని నిర్ద్వంద్వంగా మొట్టమొదటగా ప్రకటించారు తిలక్. 1907లో తిలక్ అతివాద ధోరణులకు తెరతీసి, కాంగ్రెస్ నుండి తన అనుచరులతో బయటకు వచ్చి 1916 వరకు బయటే కొనసాగారు. మరాఠా, కేసరి అనే పత్రికలు నిర్వహించి ఆంగ్లేయు కోపానికి గురయ్యారు.
1897లో ఒకటిన్నరేళ్ళ జైలుశిక్షకు 1906లో దేశద్రోహం క్రింద ఆరేళ్ళపాటు ప్రవాసశిక్ష అనుభవించారు. 1916లో ‘హెూంరూల్ లీగ్’ అనే సంస్థను స్థాపించారు.
గణపతి ఉత్సవాలను తిలక్ జనసేకరణకోసం ప్రారంభించారు. నేడు మనం వాడ వాడలా జరుపుకుంటున్న గణపతి నవరాత్రులను జాతీయ ఉద్యమ స్పూర్తితో నిలిపి, అందరినీ ఓకేచోటికి చేర్చి.. వారిలో దేశభక్తి, స్వాతంత్య్రం ఆవశ్యకతను తెలిపిన తిలక్ జీవితమంతా ధైర్యానికి, త్యాగానికి ఉదాహరణ. మన లక్ష్యం ఎంత పెద్దదైనా, మనం నిజాయితీగా, ధైర్యంగా ఉంటే విజయం తప్పదు అని వారి జీవితమే మనకు ఆదర్శం.
జాతీయోద్యమంలో అతివాద ధోరణులకు ఆజ్యం పోసిన తిలక్ 1920 ఆగస్టు 1న భరతమాతపాదాలపై పూవుగా మారారు.
లోకమాన్య తిలక్ జీ-జోహార్

🌟చంద్రశేఖర్ ఆజాద్ గారి ప్రేరణాత్మక గాథ🌟
ఆయన వయసు కేవలం 15 సంవత్సరాలే అయినా, 1921లో మహాత్మా గాంధీ చేపట్టిన సహాయనిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నాడు. బ్రిటీష్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కోర్టులో న్యాయమూర్తి అడిగినపుడు:
🔸జడ్జ్: నీ పేరు?
➡చంద్రశేఖర్: “ఆజాద్”
🔸జడ్జ్: తండ్రి పేరు?
➡చంద్రశేఖర్: “స్వాతంత్ర్యం”
🔸జడ్జ్:(హతాసుడై) నీ ఇల్లు ఎక్కడ?
➡చంద్రశేఖర్: “జైలే నా నివాసం”
అతని ధైర్యానికి న్యాయమూర్తి ఆశ్చర్యపోయాడు. క్రోధంతో 15 బెత్తపు దెబ్బల శిక్ష విధించాడు..
అప్పటినుంచి అతడు “ఆజాద్”గా ప్రసిద్ధి చెందాడు.
అలా చంద్రశేఖర్ ఆజాద్ చిన్నప్పటినుంచే దేశభక్తితో ఉరకలేశాడు.
అతను చెప్పిన మాటలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోయాయి.
🙏చంద్రశేఖర ఆజాద్🙏
పేరొందిన స్వేచ్ఛా సమరయోధుడు చంద్రశేఖర ఆజాద్ మధ్యప్రదేశ్ లో 1906 జూలై 23న జన్మించారు. 14 ఏళ్ళ వయసులో వారణాసిలో ఉండగా గాంధీజీ ప్రభావం ఈయనపై పడింది. 15 ఏళ్ళ వయసులో ఉద్యమంలో పాల్గొన్న వీరిని కోర్టులో హాజరుపర్చగా తన పేరును ‘ఆజాద్’గాను, తండ్రిపేరు ‘స్వాధిన్’గా, తల్లిపేరు ‘ధాత్రిమా’గా చెప్పుకున్నారు. 15 కొరడా దెబ్బలు ‘భరత మాతాకు జై’ అంటూ భరించారు. దీంతో ఈయనను ఆజాద్ వ్యవహరించటం మొదలైంది. సహాయ నిరాకరణోద్యమంలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. అది తన సిద్ధాంతానికి విరుద్ధమని గాంధీజీ మంచి ఊపులో ఉన్న ఆ ఉద్యమాన్ని అర్ధంతరంగా ఆపేశారు. గాంధీ చర్య దేశంలో కొన్ని లక్షలమంది హృదయాలను గాయపరిచింది. దాంతో ఎందరో నవయువకులు బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టేందుకు హింసామార్గాన్ని ప్రారంభించారు. తోటి యువకులతో కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియే షన్’ ప్రారంభించిన ఆజాద్ హింసామార్గంలో ఉద్యమించారు. కాకోరి రైలు దోపిడి, వైశ్రాయి రైలు విద్రోహచర్యలు 1926లో వీరు రచించినవే. ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు లాలా లజపతి రాయ్ మృతికి కారణమైన జాన్ సాండర్స్ అనే బ్రిటిష్ అధికారిని కాల్చి చంపారు. వీరి సహచరుల ద్రోహం వల్ల 1931 ఫిబ్రవరి 27న పోలీ సులు అలహాబాద్లో వీరిని చుట్టుముట్టారు. బ్రిటిష్ వారి చేతుల్లో మరణించకూడదని, తనను తానే పిస్టల్తో కాల్చుకొని అమరజీవి అయ్యారు. భరతమాత ఒడిలో నిదురపోయారు
👉 “బ్రిటీష్ నా శరీరాన్ని తాకవచ్చు కానీ నా మనస్సును కాదు. నేను జీవించి ఉన్నంతవరకు, బ్రిటిష్ ప్రభుత్వం నన్ను బందీ చేయలేదు – నేను చివరి గాలి పీల్చే వరకు ఆజాదే ఉండతాను!”
1931లో బ్రిటిష్ పోలీసులు అతన్ని ముట్టడించినప్పుడు, చేతిలో ఉన్న తుపాకీతో చివరి వరకు పోరాడాడు. చివరికి బ్రిటిష్ చేతిలో పడిపోవడం కన్నా తనే తుపాకీతో గోళీ పెట్టుకుని ప్రాణాలు త్యాగం చేశాడు.
👉 వారి ప్రేరణతో ఎందరో నిజమైన స్వాతంత్ర్య యోధుల గుండె ధైర్యంతో నిండినది.
ఆజాద్ అంటే భయం లేని జీవితం– జోహార్
ఇలా ఒక్కరా.. ఇద్దరా… ఎందరెందరో తమ ధన-మాన-ప్రాణాలు దేశంకోసం సమర్పించారు.. వారి భిక్షగా మనం ఈ స్వేచ్చా జీవితాన్ని అనుభవిస్తున్నాం..
కాబట్టి పిల్లలూ.. వారిచ్చిన ఈ స్వేచ్ఛ కు గౌరవం ఇస్తూ.. దేశ ఖ్యాతిని పెంచేలా ప్రవర్తించాలి..
జై హింద్!

