🧔♂️ నల్లజాతి సూరీడు….
“నెల్సన్ మండేలా”
18 జూలై వారి జయంతి సందర్భంగా …
ఒక వ్యక్తి పేరును, జన్మదినాన్ని పురస్కరించుకుని.. విశ్వవ్యాప్తంగా ఒక రోజుకే పెట్టి, జయంతిని ఘనంగా జరుపుకుంటే.. ఆ వ్యక్తి యొక్క కీర్తి కాంతి ..ఎంతలా వ్యపించిందో కదా… వారి జీవితం… వారు చూపిన బాట ఎందరికో ఆదర్శం
ఇది … ఆ కాంతిని ప్రసరింపజేసిన ఒక సూర్యుడి కథ… ఆఫ్రికా ఖండంలో పెల్లుబికిన – విప్లవ జ్వలాముఖుని కథ.. నల్ల జాతి సూర్యుని ఆదర్శవంతమైన కథ..
పేరు: నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా
పుట్టిన తేది: 18 జూలై 1918
స్థలం: మ్వెజో గ్రామం, దక్షిణాఫ్రికా
మరణం: 5 డిసెంబర్ 2013

🔹 ప్రారంభ జీవితం:
నెల్సన్ మండేలా Nelson Rolihlahla Mandela ఒక థెంబు (Thembu) రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన చిన్ననాటి నుంచే న్యాయం పట్ల ఆసక్తి చూపించారు. ఆయనను చిన్నప్పుడు “రోలిహ్లాహ్లా” అని పిలిచేవారు, దీని అర్థం “తలకిందుల చేయు వ్యక్తి” అనేలా ఉంది. అంటే ఆ జాతి యొక్క దుర్భర పరిస్థితులను తల్లకిందులు చేయగల సత్తా ను చిన్ననాడే గమని౦చారు…
🔹 విద్యాభ్యాసం:
మాండెలా ఫోర్ట్ హేర్ యూనివర్సిటీలో చదివారు. తరువాత లా చదువుకోవడం ప్రారంభించారు. అన్యాయంగా నల్లజాతి ప్రజలపై జరుగుతున్న వివక్షను చూసి, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు.
🔹 అప్పార్తైడ్ వ్యతిరేక ఉద్యమం:
దక్షిణాఫ్రికాలో నల్లజాతి ప్రజలపై తెల్లవారగల ప్రభుత్వం నెరవేర్చిన Apartheid విధానానికి ఆయన తీవ్రంగా వ్యతిరేకంగా పోరాడారు.

1962లో ఆయన అరెస్ట్ అయ్యారు. 27 సంవత్సరాలు Robben Island జైల్లో గడిపారు (1962–1990).
🔹 జైలు నుండి విడుదల- పట్టాభిషేకం:
1990లో మండేలా విడుదల అయ్యారు. 1994లో జరిగిన తొలి ప్రజాస్వామ్య ఎన్నికలలో ఆయన దక్షిణాఫ్రికా మొదటి నల్లజాతి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
🔹 శాంతి దూత: గాంధీజీ యే ఆదర్శం

దేశాన్ని ఐక్యం చేసిన మండేలా గారు 1993లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు.
నెల్సన్ మండేలా మరియు మహాత్మా గాంధీ ఎప్పుడూ కలవకపోయినా, అణచివేతకు వ్యతిరేకంగా చేసిన పోరాటం మరియు అహింస పట్ల వారి నిబద్ధత ద్వారా లోతైన సంబంధాన్ని పంచుకున్నారు. “దక్షిణాఫ్రికా గాంధీ” అని తరచుగా పిలువబడే మండేలా, గాంధీ సత్యాగ్రహ తత్వశాస్త్రంతో బాగా ప్రేరణ పొంది, వర్ణవివక్షకు వ్యతిరేకంగా తన సొంత పోరాటానికి దానిని పునాదిగా ఉపయోగించుకున్నాడు.
జూలై 18
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం’ మండేలా జన్మదినమైన జూలై 18న నిర్వహిస్తారు. 2009 నవంబర్ 10న ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏటా జూలై 18న జరపాలని నిర్ణయించింది. 2010 నుండి ఈ ఉత్సవాన్ని జరుపుతున్నారు. 1918 జూలై 18న దక్షిణాఫ్రికాలో జన్మించిన నెల్సన్ మండేలా అక్కడి జాతి వివక్షపై అలుపెరగని పోరాటం చేశారు.

మొదటి శ్వేతేతర వ్యక్తి సౌత్ ఆఫ్రికా కి ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు. 2013 డిసెంబర్ 5న జీవితం చాలించారు. 27 ఏళ్ళపాటు జైలు జీవితం అనుభవించారు. 1993లో నోబెల్ శాంతి పురస్కారంతో పాటు 25౦ కీ పైగా అవార్డ్స్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వీరు అందుకున్నారు.
స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్య విలువలకోసం భారతరత్న పురస్కారంతో భారత్ మండేలాను గౌరవించింది. 1993లో పోరాడిన మండేలా స్ఫూర్తి ప్రపంచానికి చాటేందుకు ఐక్యరాజ్య సమితి జూలై 18న ఈ దినోత్సవాన్ని వేదికగా ఉపయోగిస్తుంది. అంతేకాకుండా 67 సంవత్సరాలపాటు మండేలా తన జీతితాన్ని ప్రజలకోసం వెచ్చించినందుకు గుర్తుగా జూలై 18న 67 నిమిషాలపాటు ఇతరులకు సేవ చేస్తుంటారు. దీనిని ఐక్యజ్యాసమితి నెల్చన్ మండేలా ఫౌండేషన్ సహకారంతో నిర్వహిస్తుంది..
🕊️ ముఖ్యమైన సందేశం:
జీవితంలో ఎన్నో సవాళ్ళు, ఒడుదుడుకులు ఎదుర్కున్న నెల్సన్ మండేలా చివరికి ప్రపంచానికే ఆదర్శమై, శాంతి మార్గంలో పయనించి, విజయాన్ని సాధించి, ధృవతార అయి, నల్ల జాతి సూర్యుడు గా వెలుగొందుతూనే ఉంటారు…

“విద్య అనేది ప్రపంచాన్ని మార్చగలిగే అత్యంత శక్తివంతమైన ఆయుధం.”
“Education is the most powerful weapon which you can use to change the world.”
- నెల్సన్ మండేలా గారు..
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html