LEARN EASY HINDI-Day 2

LEARN EASY HINDI-Day 2

🌟 Day 2

में , पर, क्या ?, मेज़, घड़ी

మిత్రులారా..🙏🏻🙏🏻


నిన్నటి రోజున అనగా DAY-1 లో మనం నేర్చుకున్న 5 పదాలతో 4 వాక్యాలు నేర్చుకున్నాం…

మరి ఈ రోజు వాటిని ఒకసారి రివిజన్ చేసుకుని, క్రొత్త పదాలు, వాక్యాలు నేర్చేసుకుందాం..

DAY-1 यह, वह, किताब, कलम, है

यह किताब है। ఇది పుస్తకం.  This is a book

वह कलम है।
అది కలము That is a Pen

यह कलम है।
ఇది కలము This is a pen

वह किताब है।
అది పుస్తకము
That is a Book

TODAY’S QUOTE

Life is XXX…

Yesterday is eXperience..

Tomorrow is eXpectation..

Today is an eXperiment..

కావున నిన్నటి Experience ను ఉపయోగించుకుంటూ.. రేపటి Expectations అందుకోవాలంటే..నేటి ఈ Experiment ను విజయవంతంగా నిర్వహించాలి..

అప్పుడే సంస్కారవంతమైన, పరిపూర్ణమైన జీవితం మన సొంతం అవుతుంది..

LEARN HINDI-EASY HINDI ప్లాన్ లో భాగంగా ఈరోజు 2వ రోజు..

(REGULAR పాఠాలు చెబుతూనే.. IFP PANEL లో గానీ, లేక మీ మొబైల్ లో గానీ OPEN చేసి, మన పీరియడ్ లో రోజూ కేవలం 5/10 నిమిషాలు నేర్పండి చాలు.. ఒక పుస్తకంలో రోజూ వ్రాయించండి.. వారిచేత PRACTICEచేయించి, ఇంటివద్ద మరిన్ని పదాలు వ్రాసుకురమ్మని చెప్పండి. ఇదే మనకు గ్రామర్ నోట్స్ గానూ, స్పోకెన్ హిందీ గానూ ఉపయోగపడుతుంది..అధికారుల విజిట్, ఇన్స్పెక్షన్ లలో కూడా మనకు ఉపయోగపడుతుంది..మనకు హిందీ 4/5 పీరియడ్స్ ఉంటున్నాయి కావున మీ మీ సౌలభ్యం, వెసులుబాటు చూసుకుని,రోజూ నేర్పండి.)


45 రోజుల LEARN HINDI-EASY HINDI లో

DAY-2 కు స్వాగతం!

LEARN SIMPLE HINDI – ఈ రోజు మీరు కొన్ని ముఖ్యమైన 5 పదాలను నేర్చుకుని, వాటిని వాక్యాలుగా ఎలా ఉపయోగించాలో అభ్యసనం చేయబోతున్నారు.

ప్రస్తుతం నేర్చుకోబోయే అంశాలు..
  • Vocabulary
  • Notes
  • Practice Sentences
  • Practice exercise
  • Answers
  • More Examples
  • Home work

🟨 Day-2: SIMPLE HINDI

📘 1. Vocabulary – Learn 5 New Words

🟧 Hindi Word🗣️ English📗 Telugu
मेंInలో, లోపల
परOnపైన, మీద
क्याWhat?ఏమిటి?
मेज़Tableబల్ల
घड़ीClockగడియారం

📒 2. Note: Usage of “में” & “पर” in Hindi

  • “में” means in / inside లో, లోపల– e.g., किताब में कलम है।
  • “पर” means on / over పైన, మీద– e.g., मेज़ पर घड़ी है।

Both are postpositions in Hindi (like prepositions in English but come after the noun).


✍️ 3. Sentence Practice – 10 Sentences

🟨 Hindi Sentence📘 Telugu Meaning🟢 English Meaning
यह मेज़ है।ఇది బల్లThis is a table.
वह मेज़ है।అది బల్లThat is a table.
यह घड़ी है।ఇది గడియారం.This is a clock.
वह घड़ी है।అది గడియారం.That is a clock.
यह क्या है?ఇది ఏమిటి?What is this?
वह क्या है?అది ఏమిటి?What is that?
मेज़ पर क्या है?బల్ల పైన ఏమి ఉన్నది?What is on the table?
मेज़ पर किताब है।బల్లపైన పుస్తకం ఉంది.A book is on the table.
मेज़ पर कलम है।బల్ల పైన పెన్ను ఉంది.A pen is on the table.
कलम किताब में है।పెన్ను పుస్తకంలో ఉంది.The pen is in the book.

🧪 4. Practice Exercise

Translate the following sentences into Hindi:

ఈ క్రింది వాక్యాలను హిందీ లోకి అనువదించండి.

1.This is a clock. 🟢 ఇది గడియారం.

Ans._____________

2.The clock is on the table.🟢 గడియారం టేబుల్ పైన ఉంది.

Ans. _______________

3.What is in the book?🟢 పుస్తకంలో ఏమి ఉంది?

Ans.___________________

    4.A pen is in the book.🟢 పుస్తకంలో ఒక పెన్ను ఉంది.

    Ans.________________

    5.What is this?🟢 ఇది ఏమిటి?

    Ans.__________


    5. Answers

    1. यह घड़ी है।
    2. घड़ी मेज़ पर है।
    3. किताब में क्या है?
    4. कलम किताब में है।
    5. यह क्या है?

    🏠 6. Homework

    👉 Use today’s vocabulary and structure to make 2 new Hindi sentences.

    ఈరోజు నేర్చుకున్న పదాలను మరియు వాక్య నిర్మాణాన్ని ఉపయోగించి రెండు కొత్త హిందీ వాక్యాలు రాయండి.

    👉 Write in all three formats: Hindi, Telugu, and English.

    👉 మూడు భాషలలో రాయండి: హిందీ, తెలుగు, మరియు ఇంగ్లీష్.

    🎯 Hint– “Make sentences using: में, पर, क्या, घड़ी, मेज़”

    This lesson is designed to help Telugu and English speakers understand basic Hindi sentences

    (ఉపాధ్యాయులకు సూచన- తమరు బోర్డు పై వ్రాసి, విద్యార్థులచేత ఒక పుస్తకములో వ్రాయించి, పదాలు చదివించి, మరిన్ని ఉదాహరణలు చెప్పించండి)


    Stay tuned for Day 3: More new words and how to use them in real-life Hindi conversation!

    హిందీ నేర్చుకోవడం వలన దేశభక్తి, అంకితభావం పెరుగుతాయి..

    జై హింద్ – జై హిందీ