LEARN EASY HINDI IN 45DAYS-Day 1

LEARN EASY HINDI IN 45DAYS-Day 1

🌟 Day 1: Learn “यह, वह, किताब, कलम, है” in Hindi

ఉపాధ్యాయ మిత్రులారా..🙏🏻🙏🏻


✅మన వద్ద 10 పాస్ అయిన విద్యార్థులలో కనీసం హిందీ లో మాట్లాడే పరిజ్ఞానం ఉండట్లేదని చాలామంది వాపోతున్నారు.కేవలం హిందీ ను 20 మార్కుల సబ్జెక్టుగా చుసేవారే ఎక్కువ. 10 అయిపోయాక జీవితంలో వారికి ఉపయోగపడే హిందీని మనం నేర్పలేమా..? అది హిందీ పట్ల మరింత మందిని ఆకర్షితులను చేస్తుంది.

మన మాతృభాష-అమ్మ అయితే… పెద్దమ్మ-హిందీ

అని మన గౌరవ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కె.పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు.. ఈరోజు నుండే మనం విద్యార్థులకు మన పెద్దమ్మ భాషను జీవితంలో కుడా ఉపయోగపడేలా నేర్పుదాం..!

45రోజుల LEARN HINDI-EASY HINDI ప్లాన్ ను REGULAR పాఠాలు చెబుతూనే.. IFP PANEL లో గానీ, లేక మీ మొబైల్ లో గానీ OPEN చేసి, మన పీరియడ్ లో రోజూ కేవలం 5/10 నిమిషాలు నేర్పండి చాలు.. ఒక పుస్తకంలో రోజూ వ్రాయించండి.. వారిచేత PRACTICEచేయించి, ఇంటివద్ద మరిన్ని పదాలు వ్రాసుకురంమని చెప్పండి. ఇదే మనకు గ్రామర్ నోట్స్ గానూ, స్పోకెన్ హిందీ గానూ ఉపయోగపడుతుంది..

(అధికారుల విజిట్, ఇన్స్పెక్షన్ లలో కూడా మనకు ఉపయోగపడుతుంది..)

మనకు హిందీ 4/5 పీరియడ్స్ ఉంటున్నాయి కావున మీ మీ సౌలభ్యం, వెసులుబాటు చూసుకుని,రోజూ నేర్పండి.


అందరికీ 45 రోజుల LEARN HINDI-EASY HINDI కి స్వాగతం-సుస్వాగతం!

📌ప్రతీ సంవత్సరం సెప్టెంబర్ 14 నాడు మనం “జాతీయ హిందీ భాషా దినోత్సవం” ఘనంగా నిర్వహించుకుంటున్నాం..

📌ఈరోజు జూలై 14. అంటే నేటి నుండి సరిగ్గా 2 నెలల్లో మన హిందీ పండుగ రాబోతోంది..

📌మరి ఈ 2 నెలల్లో సెలవులు, పరీక్షల సమయాన్ని తీసివేయగా.. మిగిలిన 45 రోజులపాటు మనం పూర్తి స్థాయిలో హిందీ నేర్చుకుని.. సెప్టెంబర్ 14 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో హిందీ రానివారు ఉండకూడదనే సంకల్పంతో సులభంగా.. చక్కటి పదాలతో.. ఏర్పరచిన మన ఈ LEARN HINDI-EASY HINDI ను నేర్చుకోవడం ద్వారా.. హిందీని నిత్య జీవితంలో ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలిగే స్థాయికి చేరతారు.

📌ఈ కోర్సు ప్రత్యేకంగా విద్యార్థులకు అనుకూలంగా రూపొందించబడింది.
— ప్రాథమిక పదాలు, వాక్య నిర్మాణం నుండి ప్రారంభించి, వ్యాకరణం, కాలాలు మరియు నిజ జీవిత సంభాషణల వరకు చక్కగా మార్గదర్శనం చేస్తుంది.

📌 ఈ కోర్సు ద్వారా మీరు మీ పరిచయాన్ని హిందీలో చెప్పగలుగుతారు.

📌ప్రతి రోజు ఉపయోగించే పదాలు, వాక్యాలను మాట్లాడగలుగుతారు.
షాపింగ్, స్కూల్, ఆఫీస్, ఇంటి వద్ద సరళమైన హిందీలో మాట్లాడగలుగుతారు.

📌ప్రశ్నలు అడగడం, దిశలు చెప్పడం, మర్యాదపూర్వక సంభాషణ చేయడం నేర్చుకుంటారు.

📌Role-plays, quizzes మరియు practical activities ద్వారా మీ ఫ్లూయెన్సీ మెరుగవుతుంది.

📌కోర్సు చివర్లో Test ద్వారా certificate కూడా ఇవ్వబడుతుంది.

📌ఇది కేవలం భాష నేర్చుకునే కోర్సు కాదు — ఇది మంచి కమ్యూనికేషన్, ఉద్యోగ అవకాశాలు మరియు సాంస్కృతిక అనుబంధానికి దారి తీసే ప్రయాణం.

📌ఈ కోర్స్ నేర్చుకుంటే హిందీ పరీక్షలగు “ప్రాథమిక.. మధ్యమ వంటివే గాక 10వ తరగతి వరకూ అతి సులభంగా హిందీ చదవగలరు మరియు మార్కులు పొందగలరు.

45 రోజుల్లో హిందీ మాట్లాడే మీ ప్రయాణాన్ని ఇక మొదలెడదామా..

This lesson is designed to help Telugu and English speakers understand basic Hindi sentences.

DAY-1

Learn five words and make four sentences by your own.

కేవలం 5 పదాలతో 4 వాక్యాలు తయారు చేయండి

यह (this), वह (that), किताब (book), कलम (pen), है (is).


📝 Vocabulary

HindiTelugu MeaningEnglish Meaning
यह (Yah)ఇది, ఇతడు, ఈమె, ఈThis / He / She / It
वह (Vah)అది, అతడు, ఆమె, ఆThat / He / She / It
किताब (Kitaab)పుస్తకముBook
कलम (Kalam)కలముPen
है (Hai)ఉన్నది, ఉన్నాడుIs/helping verb

🔍 Note

  • यह = used for something near దగ్గరగా ఉన్న వస్తువులను, వ్యక్తులను, వస్తువులను సంబోధించడానికి వాడతాము
  • वह = used for something far దూరంగా ఉన్న వస్తువులను, వ్యక్తులను, వస్తువులను సంబోధించడానికి వాడతాము
  • है = “is” (used to tell what something is/helping verb) కలిగిఉన్న / ఉన్న స్థితిని తెలుపుటకు వాడతాము

📘 Sentence Practice

Hindi SentenceTelugu MeaningEnglish Meaning
यह कलम है। ఇది కలముIt is a pen.
यह किताब है।ఇది పుస్తకంIt is a book.
वह कलम है।అది కలముThat is a pen.
वह किताब है।అది పుస్తకముThat is a book.

🧠 Practice Exercise

Translate into Hindi– క్రింది వాక్యాలను హిందీ లోకి అనువదించండి.

1.This is a book. ఇది పుస్తకం

Ans.________________

2.That is a pen. అది కలము.

Ans.______________

3. This is a pen. ఇది కలము.

Ans.__________________

4.That is a book. అది పుస్తకము.

Ans.__________________

✅ Answers:

  1. यह किताब है।
  2. वह कलम है।
  3. यह कलम है।
  4. वह किताब है।

(ఉపాధ్యాయులకు సూచన- తమరు బోర్డు పై వ్రాసి, విద్యార్థులచేత ఒక పుస్తకములో వ్రాయించి, పదాలు చదివించి, మరిన్ని ఉదాహరణలు చెప్పించండి)


📅 Stay tuned for Day 2: More new words and how to use them in real-life Hindi conversation!

మన మాతృభాష-అమ్మ అయితే… పెద్దమ్మ-హిందీ

శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు