LEARN SIMPLE HINDI లో భాగంగా 14 వ రోజుకు స్వాగతం.
ప్రియమైన విద్యార్థులారా, ఈరోజు మనం మరిన్ని క్రియా పదాలు వాటి ప్రయోగాలు నేర్చుకుందాం..
📘 Vocabulary
हिंदी (Hindi) | English | తెలుగు (Telugu) |
---|---|---|
भाई | Brother/Brothers | సోదరుడు / సోదరులు |
बहन | Sister | సోదరి |
बहनें | Sisters | సోదరీమణులు |
पति | Husband | భర్త |
पत्नी | Wife | భార్య |
माँ | Mother | అమ్మ |
पिता | Father | నాన్న |
राजा | King | రాజు |
रानी | Queen | రాణి |
रानियाँ | Queens | రాణులు |
✍️ Practice Sentences
విద్యార్థులారా,
ఈరోజు మనం హిందీలో తరచూ ఉపయోగించే “का, के, की” అనే శబ్దాల ప్రయోగం గురించి తెలుసుకుందాం. పిల్లలు గానీ, పెద్దలుగానీ తరచూ ఈవాటిలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఈ మూడింటి వినియోగాన్ని స్పష్టంగా తెలుసుకుందాం.
✨ का / के / की – “యొక్క” అని అర్థం
🔹 “का” – పుల్లింగ (పురుష లింగం), ఏకవచనం పదాలకు వాడతాం.
🔸 ఉదా:
- लव , भगवान श्री राम का लड़का है।
- ఇక్కడ लव పుంలింగ ఏకవచన పదము కాబట్టి का ఉపయోగించాము
🔹 “के” – పుల్లింగ బహువచనం లేదా పురుషుల కొరకు వాడతాం.
🔸 ఉదా:
- लव और कुश भगवान श्री राम के लड़के हैं।
- లవ కుశలు రాముని యొక్క కుమారులు.
- लड़के బహువచన పదం కాబట్టి के ఉపయోగించాము. ( हैं ని కూడా గమనించండి)
🔹 “की” – స్త్రీలింగ (ఆడలింగం) పదాలకు ఏకవచనం మరియు బహువచనం లోను వాడతాం.
🔸 ఉదా:
- शेखर की लड़की उमा है।
- ఇక్కడ लड़की స్త్రీ లింగ పదం కాబట్టి की ఉపయోగించాము.
- उमा और रामा शेखर की लड़कियां हैं ।
- लड़कियां స్త్రీ లింగ బహువచన పదం. కాబట్టి की ఉపయోగించాము.
📝 సూచన:
ఈ మూడు పదాలు అన్నీ “OF” “యొక్క” అనే అర్థం వస్తాయి – అంటే ఎవరికోసమో, ఎవరిది అనే అర్థంలో వస్తాయి.
📒 PRACTICE SENTENCES🧠
👉 ఈ వాక్యాలను తెలుగులోకి, ఇంగ్లీషులోకి అనువదించండి.
- सुरेश का भाई मोहन है।
- अयूब की बहन आयेशा बेगम है।
- राजेश और राकेश भाई भाई हैं।
- पीटर की पत्नी सुनीता है।
- गोविंदा की मां लक्ष्मी है।
- राजा दशरथ की तीन रानियां हैं।
- विजय की बहानें पाठशाला में हैं।
- लक्ष्मी की बहन भी पाठशाला में है।
- पिताजी, आप यहां बैठिए।
- कमला की पाठशाला दूर है।
✅ Answers
1.సురేష్ యొక్క సోదరుడు మోహన్.
ఇవి మిగతావి మీరు ప్రయత్నం చేయండి…
“उठो, जागो और तब तक मत रुको जब तक लक्ष्य की प्राप्ति न हो जाए।”
Arise, awake and stop not till the goal is reached. – SWAMI VIVEKANANDA
👇🏾👇🏾CLICK HERE TO JOIN OUR WHATS APP GRPOUPS👇🏾👇🏾
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html
https://hamari-hindi.com/today/whatsapp_groups/whatsapp_links.html