NATIONAL HINDI DAY CELEBRATIONS 2024-25

NATIONAL HINDI DAY CELEBRATIONS 2024-25

सभी को नमस्कार।

आप सभी को ” हिंदी दिवस की शुभकामनाएँ” ।

हिंदी दिवस हर साल 14 सितंबर को मनाया जाता है। इस दिन का उद्देश्य हिंदी भाषा के महत्व को उजागर करना और इसके प्रचार-प्रसार को बढ़ावा देना है। 14 सितंबर 1949 को भारतीय संविधान सभा ने हिंदी को देवनागरी लिपि में भारत की आधिकारिक भाषा के रूप में स्वीकार किया था।

इस दिन देशभर में विभिन्न कार्यक्रमों का आयोजन किया जाता है, जैसे निबंध लेखन, भाषण और सांस्कृतिक कार्यक्रम। हिंदी दिवस हमें राष्ट्र भाषा और राज भाषाभा के रूप में सम्मान का अनुभव कराता है।

హిందీ భాషా దినోత్సవం ను ప్రతి సంవత్సరం సెప్టెంబరు 14ను “హిందీ దివస్” (హిందీ దినోత్సవం)గా జరుపుకుంటారు. భారత జాతీయోద్యమంలో అఖిల భారతాన్ని జాగృతం చేసి, ఏకతాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 సెప్టెంబరు 14న రాజ్యాంగంలోని 343 వ అధికరణం 8వ షెడ్యూల్‌లో హిందీని కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున హిందీ భాషా దినోత్సవమును జరుపుకుంటారు.

దేవనాగరి లిపిలో వ్రాయబడిన హిందీ భాషను రిపబ్లిక్ ఆఫ్ ఇండియా రెండు అధికారిక భాషలలో ఒకటిగా భారత రాజ్యాంగ సభచే జరుపుకుంటారు. ఈ మేరకు హిందీకి అనుకూలంగా బీహార్ రాజేంద్ర సింహాతో పాటు హజారీ ప్రసాద్ ద్వివేది, కాకా కలేల్కర్, మైథిలి శరణ్ గుప్త్, సేథ్ గోవింద్ దాస్ లు ర్యాలీలు చేసారు. అందుకని, 1949 సెప్టెంబరు 14 న బీహార్ రాజేంద్ర సింహా 50 వ పుట్టినరోజున, హిందీని అధికారిక భాషగా స్వీకరించిన తరువాత వారి ప్రయత్నాలు ఫలించాయి. ఈ నిర్ణయం 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగం ఆమోదించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 343 ప్రకారం, దేవనాగరి లిపిలో వ్రాసిన హిందీని అధికారిక భాషగా స్వీకరించారు. మొత్తం మీద, భారతదేశంలో 22 షెడ్యూల్డ్ భాషలు ఉన్నాయి, వాటిలో రెండు అధికారికంగా యూనియన్ స్థాయిలో ఉపయోగించబడతాయి: హిందీ, ఇంగ్లీష్. ఆధునిక హిందీని నేడు 250 మిలియన్లకు పైగా ప్రజలు మొదటి భాషగా మాట్లాడుతున్నారు.

అధికారిక భాష హిందీ దేవనాగరిక లిపి నుంచి రూపొందించబడింది. ఈ భాష ఇండో యూరోపియన్ భాష సంతతికి సంబంధించిన ఇండో-ఆర్యన్ శాఖకు చెందినది. హిందీ అంటే “పర్షియన్ కానుక” అని అర్థం. హిందీ భాష చాలావరకూ సంస్కృతం నుంచి గ్రహించబడినది. అయితే కాలక్రమంలో ఉత్తర భారతదేశంలోని ముస్లిం ప్రభావం వల్ల పర్షియన్, అరబిక్, టర్కిష్ పదాలు హిందీలో చేరి ఉర్దూ భాష ఆవిర్భవించింది.

మనం గమనించినట్లయితే శుద్ధ హిందీ(ప్యూర్ హిందీ) భాషను రేడియోలలో, టి.వి. వార్తలలో వినవచ్చు. ప్రస్తుతం చలామణిలో ఉన్న హిందీ భాష చాలా వరకూ సులభతరం చేయబడింది. ప్రపంచంలోని చాలా దేశాలలో హిందీ భాషను మాట్లాడుతారు. మారిషస్, ట్రినిడాడ్, అమెరికా, దక్షిణాఫ్రికా, న్యూజిల్యాండ్ వంటి చాలా దేశాలలో ఇప్పటికీ హిందీ ముఖ్య భాషగా ఉంది.

అయితే… మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా మాట్లాడే భాషలలో హిందీ భాష రెండవది కావడం. ఇది మనం అందరం గర్వించదగిన విషయం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు కూడా దేశంలో ఐక్యతను తీసుకురావడానికి ఈ భాషనే వాడేవారు. ఈ భాషను “లాంగ్వేజ్ ఆఫ్ యూనిటి” అనేవారు. అంత గొప్పది మన హిందీ భాష, అందుకే అన్నారు మేరా భారత్ మహాన్ అని..! కాబట్టి హిందీ నేర్చుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భాష సమస్య లేకుండా జీవించ వచ్చన్నమాట


💥💥💥💥💥💥💥💥💥💥💥


ఆదరించిన ఉపాధ్యాయ మిత్రులకు, విద్యార్థులకు, అందరికీ కృతజ్ఞతలు
🙏🏻💐🥳🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻

👉🏻HINDI QUIZ ఇక్కడ 30ప్రశ్నలు
👉🏻हिंदी भाषण డౌన్లోడ్ చేసుకోండి