10TH CLASS NON-DETAIL LESSON-1 हरिहर काका 2024

మిథిలేశ్వర్ వ్రాసిన ‘హరిహర కాకా’ అను కథ పల్లెటూరి వాతావరణంలో జీవిస్తున్న వృద్ధుని కథ. జీవిత చరమాంకంలో నిస్సహాయతకు, అణచివేతకు బలి అయిన వ్యక్తి కథ-వ్యథ.
రచయితకు మరియు హరిహర్ కాకాకు మధ్య చాలా వయోభేదం ఉన్నప్పటికీ, ఇద్దరి మధ్య స్నేహం, వాత్సల్య భావనలు ఉన్నాయి. రెండు వివాహాలు చేసుకున్నప్పటికీ కాకా కు సంతానం కలగలేదు. 15 బీగాలు పొలం (బీగా అంటే ముప్పావు ఎకరానికి ఎకరానికి మధ్య కొలత ) కాకా పేరున ఉన్నది. గ్రామంలో ఉన్న ఠాకూర్ బారీ మఠాధిపతి మహంత్ మరియు కాకా సోదరుడు ఇద్దరూ ఆ పొలాన్ని హస్తగతం చేసుకోవడం కోసం కాకాతో చాలా నీచంగా ప్రవర్తిస్తారు. హరిహర్ కాకా నిరక్షరాస్యుడైనప్పటికీ ప్రపంచాన్ని బాగా అర్థం చేసుకున్నాడు.
తన గ్రామంలో ఎంతోమంది తమ జీవిత చివరి దశలో ఆస్తిని బిడ్డలకు అప్పగించి కుక్క కంటే హీనమైన దుర్భర జీవనాన్ని గడపవలసి వచ్చింది. అందుకే కాక బతికి ఉన్నంత వరకు తన ఆస్తిని ఎవరికి బదలాయించకూడదని నిర్ణయించుకున్నాడు. కాకా కు రక్షణగా పోలీసులు నియమింపబడ్డారు. హరిహర్ కాకా ఖర్చుతో పోలీసు సిబ్బంది ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అంటే హరిహర కాకా దగ్గర ఉన్న డబ్బు పై అందరికీ ప్రేమ ఉంది కానీ కాకాపై ఎవరికీ ప్రేమ లేదు. ఈ సత్యాన్ని గ్రహించిన కాకా మౌనంగా జీవితం ముగించాలని నిశ్చయించుకున్నారు.

సంపదపై దురాశను విడిచిపెట్టి, మన పెద్దలను జాగ్రత్తగా చూసుకోవాలి. డబ్బు కోసం, ఆస్తి కోసం మన బంధాలను బంధుత్వాలను పోగొట్టుకోకూడదు. వయోవృద్ధులను గౌరవించాలి మరియు వారికి రక్షణ కల్పించాలి. వారిని గౌరవంగా జీవించే హక్కును కల్పించాలి.
10th class non-detail LESSON-1 हरिहर काका – मिथिलेश्वर material pdf.
10TH CLASS TEXTBOOK LESSONS