1 నుండి 8 తరగతులకు CBA పరీక్ష విధానం రద్దు
BREAKING NEWS
AP High Court: 1-8 తరగతులకు CBA పరీక్ష విధానం రద్దు…
ఇకపై పాఠశాలల్లో CBA పరీక్షా విధానం ఉండదు. CBA విధానాన్ని కొట్టేసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత గారు.
ఏపీ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ లో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత జగన్ సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష (CBA) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది.
విద్యాహక్కు చట్టం నిబంధనలకు విరుద్ధం… తీర్పు వెల్లడి.. గత ప్రభుత్వ విద్యావిధానాన్ని కొట్టేసిన హైకోర్టు….
రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఉమ్మడి పరీక్ష నిర్వహించేందుకు వీలుగా గత సర్కారు తీసుకువచ్చిన తరగతి గది ఆధారిత అంచనా పరీక్ష (సీబీఏ) విధానాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ పరీక్ష కారణంగా విద్యార్థులు భయం, ఆందోళనకు గురవుతారని పేర్కొంది. సీబీఏ విధానంలో నిర్దిష్ఠ టైం టేబుల్ ప్రకటించడం, రాష్ట్రవాప్తంగా ఒకటే ప్రశ్నపత్రంతో పరీక్ష నిర్వహించడం వంటికి బోర్డు పరీక్షను పోలి ఉన్నాయని అభిప్రాయపడింది.
ప్రభుత్వ నిర్ణయం విద్యాహక్కు చట్టంలోని సెక్షన్లు 29, 30కి విరుద్ధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన సీబీఏ విధానం, దాని అమలుకోసం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వడ్డిబోయిన సుజాత ఇటీవల తీర్పు ఇచ్చారు. సపోర్టింగ్ ద ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ SALT కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్ధులకు సీబీఏ విధానాన్ని తప్పనిసరి చేస్తూ స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ SCERT 2022, అక్టోబర్ 3న ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలన్నీ ఈ విధానంలో భాగస్వామ్యం కావాలని, పరీక్ష నిర్వహణకు నిర్దిష్ఠ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఫెడరేషన్ ఆఫ్ యునైటెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్, మరో విద్యాసంస్థ అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించాయి. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి ఇటీవల నిర్ణయాన్ని వెల్లడించారు.
Union of India
Section 29:: in The Right of Children to Free and Compulsory Education Act, 2009
- Curriculum and evaluation procedure.::-
- The curriculum and the evaluation procedure for elementary education shall be laid down by an academic authority to be specified by the appropriate Government, by notification.
- The academic authority, while laying down the curriculum and the evaluation procedure under sub-section (1), shall take into consideration the following, namely:-
(a)conformity with the values enshrined in the Constitution;
(b)all round development of the child;
(c) building up child’s knowledge, potentiality and talent;
(d)development of physical and mental abilities to the fullest extent;
(e) learning through activities, discovery and exploration in a child friendly and child-centred manner;
(f) medium of instructions shall, as far as practicable, be in child’s mother tongue;
(g) making the child free of fear, trauma and anxiety and helping the child to express views freely;
(h) comprehensive and continuous evaluation of child’s understanding of knowledge and his or her ability to apply the same.
Section 30 of the RTE Act 2009👇
Section 30:: provides that….
“👉No child shall be required to pass Board examinations till completion of elementary education.👈”
The ‘No-Detention’ policy, enshrined in the Right to Education Act 2009, is a groundbreaking concept in Indian education. In essence, it prevents the detention or failure of students up to Class 8. Under this policy, all students automatically progress to the next class without facing traditional examinations.
According to the Right to Education Act::-
- No-detention policy,
- No student can fail or be expelled from school until they complete Primary school, covering 1- 8
- All pupils up to and including level 8 will automatically be promoted to the next class.