ఈ విద్యా సంవత్సరంలో ముఖ్యమైన మార్పులు
అకడమిక్ క్యాలెండరు :-
ఈ నూతన విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ACADAMIC CALENDER ను చాలా పగడ్బందీగ ఏర్పరిచారు. మొత్తం పనిదినాలు 233 కాగా శెలవులు 83 గా నిర్ణయించారు. క్రింది లింక్స్ ద్వార ప్రైమరీ, హైస్కూల్ HINDI TEACHER’S HAND BOOKS, ACADAMIC CALENDERS డౌన్లోడ్ చేసుకోండి.
టీచర్ హ్యాండ్ బుక్ :-
ఈ నూతన విద్యా సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మార్పులు చేసింది. అందులో ముఖ్యంగా నూతన పంథాలో టీచర్స్ కొరకు HANDBOOKS విడుదల చేసారు. టీచర్ హ్యాండ్ బుక్ నందు టీచర్ డైరీ, ఇయర్ ప్లాన్, లెన్స్ ప్లాన్ తో కలిపి ఒక చక్కటి హ్యాండ్ బుక్ అనేది ప్రతి ఉపాధ్యాయునికి అందజేయబడుతుంది. ఇది ఒక అద్భుతమైన మార్పుగా చెప్పవచ్చు. ఉపాధ్యాయులు ఏమేమి, ఎప్పుడెప్పుడు ఎన్ని PERIODS లో బోధించాలో సవివరంగా ఇవ్వడం జరిగింది.
అసెస్మెంట్ రికార్డు:-
ఇంత వరకు పరీక్షలను పరీక్ష పేపర్లో వ్రాయించి, మార్క్స్ ఆన్లైన్లో ఎంటర్ చేసేవారు. ప్రస్తుతం, ప్రతి సబ్జెక్టుకు ఒక అసెస్మెంట్ రికార్డు అనేది ఇవ్వబోతున్నారు అందులో పిల్లవాడు ప్రాజెక్ట్ వర్క్, ల్యాబ్ యాక్టివిటీ, రిటర్న్ వర్క్ అలాగే నాలుగు FAలు, రెండు SAలు కంప్లీట్ గా ఆ పుస్తకంలోనే రాయడం జరుగుతుంది, వాటిని మూల్యాంకనం చేసి ప్రగతి పత్రం లో నమోదు చేసి LEAP APP లో ఆ ప్రగతి పత్రాన్ని స్కాన్ చేసిన వెంటనే CSE SITE నందు మార్క్స్ అప్లోడ్ అయిపోతాయి.
ఈ విధంగా ప్రత్యేకమైనటువంటి మార్పులు రావడం జరిగింది మరి ఈ మార్పుల గురించి ఉపాధ్యాయులకు ఇవ్వబోయే ట్రైనింగ్ లో తెలుసుకుందాం…
DOWNLOAD HINDI HAND BOOKS HERE
ALSO DOWNLOAD ACADEMIC CALENDER 2025-26


