INDEPENDANCE DAY SPECIAL SPEECHES IN HINDI-TELUGU-ENGLISH AND PATRIOTIC SONGS

INDEPENDANCE DAY SPECIAL SPEECHES IN HINDI-TELUGU-ENGLISH AND PATRIOTIC SONGS
INDEPENDENCEDAY PICS 2024
INDEPENDENCEDAY PICS 2024

सभी को स्वतंत्रता दिवस की शुभकामनाएँ मेरा नाम _______________है।  मैं _____________ कक्षा पढ़ रहा / रही हूँ।  

आज हम सभी यहाँ 15 अगस्त, स्वतंत्रता दिवस के पावन अवसर पर एकत्रित हुए हैं। यह दिन हमारे लिए बहुत महत्वपूर्ण है क्योंकि इसी दिन 1947 में हमारा देश ब्रिटिश शासन से आजाद हुआ था। इस आजादी के लिए हमारे स्वतंत्रता सेनानियों ने अपने प्राणों की आहुति दी। महात्मा गांधी, भगत सिंह, सुभाष चंद्र बोस जैसे महान नेताओं के संघर्ष और बलिदान को हम कभी नहीं भूल सकते।

आज हम सभी को यह संकल्प लेना चाहिए कि हम अपने देश की एकता और अखंडता को बनाए रखेंगे और इसे प्रगति की नई ऊँचाइयों तक ले जाएंगे।

सभी को स्वतंत्रता दिवस की शुभकामनाएँ मेरा नाम _______________है।  मैं _____________ कक्षा पढ़ रहा / रही हूँ।  

आज हम सभी यहाँ 78वां स्वतंत्रता दिवस मनाने के लिए एकत्रित हुए हैं। 15 अगस्त 1947 का दिन हमारे देश के इतिहास में स्वर्णिम अक्षरों में लिखा गया है। इस दिन हमारे देश ने ब्रिटिश शासन से आजादी प्राप्त की थी। यह आजादी हमें महात्मा गांधी, सुभाष चंद्र बोस, भगत सिंह, और अन्य अनगिनत स्वतंत्रता सेनानियों के बलिदान से मिली है। आज हम सभी को उनके बलिदान को याद करते हुए, देश की एकता और अखंडता को बनाए रखने का संकल्प लेना चाहिए। हमें अपने देश को प्रगति और विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए मिलकर काम करना होगा।

आज का दिन हमें यह याद दिलाता है कि हम सभी को अपने कर्तव्यों का पालन करते हुए देश की सेवा करनी चाहिए। जय हिंद!

सभी को स्वतंत्रता दिवस की शुभकामनाएँ मेरा नाम _______________है।  मैं _____________ कक्षा पढ़ रहा / रही हूँ।  

आज हम सभी यहाँ 78वां स्वतंत्रता दिवस मनाने के लिए एकत्रित हुए हैं। 15 अगस्त 1947 का दिन हमारे देश के इतिहास में स्वर्णिम अक्षरों में लिखा गया है। इस दिन हमारे देश ने ब्रिटिश शासन से आजादी प्राप्त की थी। यह आजादी हमें महात्मा गांधी, सुभाष चंद्र बोस, भगत सिंह, और अन्य अनगिनत स्वतंत्रता सेनानियों के बलिदान से मिली है। आज हम सभी को उनके बलिदान को याद करते हुए, देश की एकता और अखंडता को बनाए रखने का संकल्प लेना चाहिए।

स्वतंत्रता दिवस हमें यह याद दिलाता है कि हम सभी को अपने कर्तव्यों का पालन करते हुए देश की सेवा करनी चाहिए। हमें अपने देश को प्रगति और विकास की नई ऊंचाइयों पर ले जाने के लिए मिलकर काम करना होगा। आज का दिन हमें यह सिखाता है कि हम सभी को मिलकर देश की सेवा करनी चाहिए। हमें अपने देश की संस्कृति, परंपराओं और मूल्यों को बनाए रखना चाहिए।

आज का दिन हमें यह याद दिलाता है कि हम सभी को अपने कर्तव्यों का पालन करते हुए देश की सेवा करनी चाहिए। जय हिंद


INDEPENDENCEDAY PICS 2024
INDEPENDENCEDAY PICS 2024

నా పేరు ……………………………………… , నేను ……….. తరగతి చదువుచున్నాను.

ఈ రోజు మనం 15 ఆగస్టు, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1947లో ఈ రోజున మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ వంటి మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోలేము. మనం ఈ రోజు వారి త్యాగాలను స్మరించుకుంటూ, మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలి. మనం అందరం కలసి, మన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుదాం.

అందరికీధన్యవాదాలు..

జైహింద్..!

నా పేరు ……………………………………… , నేను ……….. తరగతి చదువుచున్నాను.

ఈ రోజు మనం 15 ఆగస్టు, స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1947లో ఈ రోజున మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్ వంటి మహానుభావులు అనేక త్యాగాలు చేసారు. వారి త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోలేము. మనం ఈ రోజు వారి త్యాగాలను స్మరించుకుంటూ, మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలి. మనం అందరం కలసి, మన దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దుదాం.

అందరికీధన్యవాదాలు..

జై హింద్!

గౌరవనీయులైన పాఠాశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారములు.. నా ప్రియమైన మిత్రులారా అందరికీ స్వాతంత్ర్య దినోత్సవశుభాకాంక్షలు.

నా పేరు ……………………………………… , నేను ……….. తరగతి చదువుచున్నాను.

మన దేశం స్వాతంత్రం పొందిన 77 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, మనం ఈ రోజు 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి అనేక మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు.

మన దేశం స్వాతంత్రం పొందినప్పటి నుండి అనేక రంగాలలో అభివృద్ధి సాధించింది. కానీ ఇంకా పేదరికం, నిరక్షరాస్యత, ఆర్థిక అసమానతలు వంటి సమస్యలు మన ముందు సవాళ్లుగా నిలిచాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు మనం అందరం కలిసి కృషి చేయాలి. మన దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నెరవేర్చాలి.

స్వాతంత్ర దినోత్సవం మనకు దేశభక్తిని పెంపొందించడానికి, మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను స్మరించడానికి ఒక మంచి అవకాశం. మనం ఈ రోజు వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, మన దేశం కోసం కృషి చేయాలని సంకల్పించాలి. మనం ప్రతి ఒక్కరూ మన దేశం అభివృద్ధి కోసం కృషి చేస్తే, మన దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తుంది.

ఈ సందర్భంగా, మనం ప్రతి ఒక్కరూ మన దేశం కోసం కృషి చేయాలని, మన దేశం అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రతిజ్ఞ చేద్దాం. మన దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నెరవేర్చాలి. మన దేశం కోసం కృషి చేయడం మనందరి కర్తవ్యం.

అందరికీధన్యవాదాలు..

జైహింద్..!

 

 

Today, we gather to celebrate the 78th Independence Day of our beloved nation. On this day in 1947, India broke free from the chains of British rule, thanks to the relentless efforts and sacrifices of our freedom fighters. Leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, and Subhas Chandra Bose inspired millions to fight for our freedom. As we hoist the tricolor today, let us remember their sacrifices and pledge to uphold the values of justice, equality, and liberty. Let us work together to build a nation that is strong, prosperous, and united.

Thank you all.

Jai Hind!

Today, we celebrate the 78th Independence Day of India. This day marks the end of British colonial rule and the beginning of a new era for our country. Our freedom fighters, through their courage and determination, gifted us this precious freedom. As we celebrate this day, let us remember the sacrifices made by countless individuals. Let us also commit ourselves to the progress and development of our nation. Together, we can make India a beacon of hope and prosperity for the world.

Thank you all.

Jai Hind!

Thank you all.

 

 


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల

జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి


ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు


పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగద్గీత
వేదాలు వెలసిన ధరణి రా
వేదాలు వెలసిన ధరణి రా
ఓంకార నాదాలు పలికిన అవని రా
ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మన నేల విఙ్ఞాన కిరణాలు


ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము


వెన్నెలది ఏ మతము రా
కోకిలది ఏ కులము రా
గాలికి ఏ భాష ఉంది రా
నీతికి ఏ ప్రాంతముంది రా
గాలికీ నీటికీ లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు


ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష…
అందుకే నిరంతరం సాగాలి దీక్ష…

దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ… 
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ….
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ… అంటామందరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బాపూ నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం

I Love India… I Love India…
I Love India… I Love India…
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతౄభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది

I Love India… I Love India…
I Love India… I Love India…
గంగ యమునలు సంగమించిన గానమో
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
అజంతాల… ఖజురహోల…
సంపదలతో సొంపులొలికే భారతి జయహో
మంగళం మాతరం

I Love India… I Love India…
I Love India… I Love India…
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
తాజమహలే ప్రణయ జీవుల పావురం
కౄష్ణవేణి శిల్పరమణి నర్తనం
వివిద జాతుల వివిద మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం

I Love India… I Love India…
I Love India… I Love India…
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం


భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు …
విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు । । 2 । ।

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !(2)


వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||


విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||


సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన । । 


మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||


దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||


పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

జయము జయము భరతమాత
ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు || జయము ||

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా

పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు || జయము ||

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు

పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు || జయము ||

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు

వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు
నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు || జయము ||

ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాశ్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుదిశ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వతంత్ర పోరాట తొలి పిలుపురా
మనవెలలేని త్యాగాల ఘనచరితరా
తన తగుబాలతో పోరు నెర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసినా అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 1
శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతం రా.. భారతం
ధర్మానికి సత్యానికి జన్మ భూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రం రా.. భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
శికాలలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని తీరాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలురా…
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 2
పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయిక కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే.. సలామురా
మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్యమే ఒక్కటే.. సవాలురా
మానవుడే మావేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొకమాటరా
నువ్వు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావుకెదురైన భయపడదు మా గుండెరా
శతృవుడెవడైన తలవంచని ఈ జెండారా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా


వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే

హ ఎల్ల ఎల్ల కోడే ఎచ్చయిన కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

కసిగల కోడే కలకత్తా కోడే
గుజ్జగల కోడే గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా

చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
భల్లె భల్లె భల్లె భల్లె భల్లే

పంతమున్న కోడే. పంజాబి కోడే
తగ్గనన్న కోడే టంగుటూరి కోడే
పౌరుషాల కోడే పల్లాస్సి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే హొయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

తికమక పెట్టే అమాయకత్వం.. చకచకలాడే వేగం..

అలాగ ఉంటాం.. ఇలాగ ఉంటాం.. ఆకతాయిలం మేము..

అరే చెప్పేదేదో సమజ్ అయ్యేట్టు చెప్పరా..

అట్లనే చెప్తా.. వినుకో..

సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం..

నిత్యం నమాజు పూజలు చేస్తాం.. రోజు తన్నుకు చస్తాం..

నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం..

ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం.. నచ్చకుంటే మీ ఖర్మం..

అరె.. కష్టమొచ్చినా కన్నీరొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం..

మేమే.. ఇండియన్స్.. మేమే.. ఇండియన్స్..

మేమే.. ఇండియన్స్.. అరె.మేమే.. ఇండియన్స్..

వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం

పర్సు ఖాళి అయ్యిదంటే ఫకీరు తత్వం

కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం

పడుచుపిల్ల ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం..

ప్రేమ.. కావాలంటాం.. పైసా.. కావాలంటాం..

ఏవో కలలే కంటాం.. తిక్క తిక్కగా ఉంటాం..

ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం..

తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం..

కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం..

అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం..

రూలూ ఉంది.. రాంగూ ఉంది..

తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ..

మేమే.. ఇండియన్స్.. మేమే.. ఇండియన్స్..

మేమే.. ఇండియన్స్.. అరె.మేమే.. ఇండియన్స్..

కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో..

ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో..

శత్రువుకే ఎదురు తిరిగిన రక్తం మనది..

ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది..

ఈశ్వర్ అల్లా ఏసు.. ఒకడే కదరా బాసు..

దేవుని కెందుకు జెండా.. కావాలా పార్టీ అండా..

మాతృభూమిలో మంటలు పెట్టే మాయగాడి కనికట్టు..

అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు..

భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయి ఒట్టు..

మరోసారి ఇటు చూసే ద్రోహుల తోలు తీసి ఆరెట్టు..

దమ్మే ఉంది.. ధైర్యం ఉంది..

తలవంచని తెగ పొగరే ఉంది..

మేమే.. ఇండియన్స్..

మేమే.. ఇండియన్స్..

రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ
కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

కరెన్సీ నోట్ మీద ఇలా నడి రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు ర గాంధీ

భరత మాత తల రాతను మార్చిన విధాత ర గాంధీ
తర తరాల యమా యాతన తీర్చిన వరదాత ర గాంధీ

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత

కర్మ యోగమే జన్మంతా
ధర్మ క్షేత్రమే బ్రతుకంతా

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీత
ఈ బోసి నోటి తాతా

మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి
నవ శకానికి నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెన గ చేసి
దండి యాత్రని దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగ్గజేత

చరకా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగులా బందించాడురా జాతిపిత
సంకల్ప బలం చేత

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపించిన క్రాంతి
తూరుపు తేలారని నడిరాత్రికి స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి

పదవులు కోరని పావన మూర్తి
హృదయలేలిన చక్రవర్తి

ఇలాంటి నరుడొక డిలాతరం పై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం న మతం
అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే న ఆయువంతా అంకితం

హే రామ్

ఓ బాపు నువ్వే రావాలి ని సాయం మళ్ళీ కావాలి

(వందేమాతరం గాంధీ ఓంకారం)

జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం చూపాలి

(వందేమాతరం గాంధీ ఓంకారం)। 

 

కళ్లజోడుతో చేతి కర్రతో కదిలే ఓ సత్యాగ్రహం

(కదిలే ఓ సత్యాగ్రహం)

వెండికొండల శిరసు పండిన యువకులను మించిన సాహసం

(యువకులను మించిన సాహసం)

బక్క పలచని బాపు గుండెలో ఆసేతుహిమాచలం

బిక్కు నరాల్లో ఉప్పొంగి స్వతంత్ర రక్త గంగాజలం

సత్య మార్గమున మడమతిప్పని స్వరాజ్య దీక్షామానసం

అతడంటే గడ గడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం

వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం

చాకు పిస్టలు కొడవలి గొడ్డలి ఎందుకు హింస ఆయుధం

(ఎందుకు హింస ఆయుధం)

ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం

(చిరునవ్వే మన ఆయుధం)

సాటి మనిషి పై ప్రేమేగా మన మాతృ భూమికి గౌరవం

మానవతే మనకెన్నడు చెరగని అందం అన్న గాంధీజం

వందేమాతరం గాంధీ ఓంకారం

వందేమాతరం గాంధీ ఓంకారం

భయం చెందని నెత్తురు చిందని గాంధీ మహెూద్యమ జ్వాలలు

గాలితరంగాలై వీచినవి దేశంలో నలు మూలాలు

 

(వందేమాతరం గాంధీ ఓంకారం

వందేమాతరం గాంధీ ఓంకారం

వందేమాతరం గాంధీ ఓంకారం

వందేమాతరం గాంధీ ఓంకారం)

ఒకే ఒక్క దేశం ఓంకారమై నినదించింది
ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది
పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే

ఆ ఒకే ఒక్క దేశం పౌరుషజ్వాలలు రగిలించింది
పోరాటాలకు ఉసిగొలిపింది బానిససంకెల భళ్ళున తెంచి
స్వరాజ్యాన్ని సాధించింది స్వతంత్ర్యాన్ని అందించింది


సలాం ఇండియా సలాం ఇండియా
సలాం ఇండియా. సలాం ఇండియా


చరణం:1
తక్కిన జాతులు అక్షర జ్ఞనము నెరుగని రోజుల్లో
ఇక్కడ మాత్రము ఆత్మజ్ఞానపు జ్యోతులు నింపింది
తక్కిన వారికి వ్యాధుల వేదన తప్పని కాలములో
ఇక్కడ మాత్రము ఆయుర్వేదపు దీవెన కురిపించింది


గణితానికి మరి సున్నానిచ్చిన ఘనతా తనదే
గ్రహణాలను తేదీలతొ చెప్పిన చరితా తనదే
రోదసిలో ఘన లక్ష్యాలన్నీ లీలగ ఛేదించినా
రోజూ ఖురాను బైబిల్ గీతల బోధలు పాఠించింది


సలాం ఇండియా సలాం ఇండియా
సలాం ఇండియా. సలాం ఇండియా


చరణం:2
నీటిని మట్టిని చెట్టుని పుట్టని తల్లిగ తలచింది
కంకర కంకర శంకరుడేనను భావన నేర్పింది
వారని వీరని ఎంచక మనిషికి ప్రేమని పంచింది
ఎక్కడనుంచొచ్చారని అడగక అక్కున జేర్చుకుంది


అలుసుగ జూసి ఆక్రమణలకై పాల్పడుతుంటే
శతాబ్దాల తన సహనాన్నింకా పరీక్షిస్తు ఉంటే
సత్యాహింసలు ఆయుధాలుగా సమరం సాగించింది
సత్యాగ్రహమే యుద్ధవ్యూహమై విజయంసాధించింది


సలాం ఇండియా సలాం ఇండియా
సలాం ఇండియా. సలాం ఇండియా


జయోస్తుతే జయోస్తుతే శ్రీ మహన్మంగళే ! శివాస్పదే శుభదే 
స్వతంత్రతే భగవతీ ! త్వామహం యశోయుతాం వందే ||జయోస్తుతే||
రాష్ట్రాచే చైతన్య మూర్త్ తూ నీతి – సంపదాంచీ
స్వతంత్రతే భగవతీ ! శ్రీమతీ రాజ్ఞీ తూ త్యాంచీ
పరవశతేచ్యా నభాత్ తూచీ ఆకాశీ హోసీ
స్వతంత్రతే భగవతీ ! చాందణీ చమచమ లఖలఖసీ
గాలావరచ్యా కుసుమీ కింవా కుసుమాంచ్యా గాలీ
స్వతంత్రతే భగవతీ ! తూచ్ జీ విలసతసే లాలీ||2||
తూ సూర్యాచే తేజ్, ఉదధీచే గాంభీర్యహి తూచీ
స్వతంత్రతే భగవతీ ! అన్యథా గ్రహణ్ నష్ట తేచీ 
మోక్ష – ముక్తి హీ తుఝీచ్ రూపే తులాచ వేదాన్తీ
స్వతంత్రతే భగవతీ ! యోగిజన పరబ్రహ్మ వదతీ 
జే జే ఉత్తమ ఉదాత్త ఉన్నత మహన్మధుర తే తే
స్వతంత్రతే భగవతీ ! సర్వ తవ సహచారీ హోతే
హే అధమ – రక్తరంజితే, సుజన పూజితే,
శ్రీస్వతంత్రతే శ్రీస్వతంత్రతే శ్రీస్వతంత్రతే
తుజసాఠి మరణ తే జనన, తుజవీణ జనన తే మరణ
తుజ సకల చరాచర శరణ, చరాచర శరణ
శ్రీస్వతంత్రతే శ్రీస్వతంత్రతే శ్రీస్వతంత్రతే
జయోస్తుతే జయోస్తుతే శ్రీ మహన్మంగళే ! శివాస్పదే శుభదే 
స్వతంత్రతే భగవతీ ! త్వామహం యశోయుతాం వందే। ।

 



NO OF VISITERS TILL TODAY