PATRIOTIC SONGS & REPUBLIC DAY SPECIAL SPEECHES IN HINDI-TELUGU-ENGLISH

PATRIOTIC SONGS & REPUBLIC DAY SPECIAL SPEECHES IN HINDI-TELUGU-ENGLISH
INDEPENDENCEDAY PICS 2024
REPUBLICDAY PICS 2025


జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల

జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి


ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు


పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగద్గీత
వేదాలు వెలసిన ధరణి రా
వేదాలు వెలసిన ధరణి రా
ఓంకార నాదాలు పలికిన అవని రా
ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మన నేల విఙ్ఞాన కిరణాలు


ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము


వెన్నెలది ఏ మతము రా
కోకిలది ఏ కులము రా
గాలికి ఏ భాష ఉంది రా
నీతికి ఏ ప్రాంతముంది రా
గాలికీ నీటికీ లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు


ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష…
అందుకే నిరంతరం సాగాలి దీక్ష…

దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ… 
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ….
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ… అంటామందరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బాపూ నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం

I Love India… I Love India…
I Love India… I Love India…
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతౄభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది

I Love India… I Love India…
I Love India… I Love India…
గంగ యమునలు సంగమించిన గానమో
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
అజంతాల… ఖజురహోల…
సంపదలతో సొంపులొలికే భారతి జయహో
మంగళం మాతరం

I Love India… I Love India…
I Love India… I Love India…
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
తాజమహలే ప్రణయ జీవుల పావురం
కౄష్ణవేణి శిల్పరమణి నర్తనం
వివిద జాతుల వివిద మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం

I Love India… I Love India…
I Love India… I Love India…
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం


భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
త్రివేణి సంగమ పవిత్రభూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
పంచశీల బోధించిన భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
శాంతిదూతగా వెలసిన బాపూ జాతి రత్నమై వెలిగిన వెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు …
విప్లవ వీరులు వీర మాతలు …
ముద్దుబిడ్డలై మురిసే భూమి ..
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
సహజీవనము సమభావనము మనతా వాదము వేదముగా
ప్రజా క్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి
లక్ష్యములైన విలక్షణ భూమి
భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవధాత్రికి జేజేలు । । 2 । ।

శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !(2)


వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||


విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||


సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన । । 


మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||


దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||


పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

జయము జయము భరతమాత
ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు || జయము ||

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా

పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు || జయము ||

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు

పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు || జయము ||

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు

వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు
నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు || జయము ||

ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాశ్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుదిశ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వతంత్ర పోరాట తొలి పిలుపురా
మనవెలలేని త్యాగాల ఘనచరితరా
తన తగుబాలతో పోరు నెర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసినా అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 1
శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతం రా.. భారతం
ధర్మానికి సత్యానికి జన్మ భూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రం రా.. భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
శికాలలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని తీరాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలురా…
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

చరణం 2
పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయిక కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే.. సలామురా
మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్యమే ఒక్కటే.. సవాలురా
మానవుడే మావేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొకమాటరా
నువ్వు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావుకెదురైన భయపడదు మా గుండెరా
శతృవుడెవడైన తలవంచని ఈ జెండారా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా


వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఏయ్ జెండా కొండా కత్తి సుత్తి
గిత్త కోత కొమ్ము కోడే
వంచలేని కోడె ఒంగోలు కోడే
సిరిగల కోడే సిరిసిల్ల కోడే

హ ఎల్ల ఎల్ల కోడే ఎచ్చయిన కోడే
రాతికన్న గట్టిదీ రాయలసీమ కోడే హాయ్
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

రయా రయ్యా రగతము లేలెమ్మనే
దమ్ము దమ్ము గుండెలకెగదన్నెనే
ఉక్కు నరం బిర్రు బిర్రు బిగిసెనే
అరె సిమ్మా సీకటి ముప్పంతా ముగిసెనే

ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు ఆడాలా
డప్పుల మేళాలు మహ గొప్పగ మోగాలా
మోత కూత కోత కోట
తూట వేట తురుము కోడే

కసిగల కోడే కలకత్తా కోడే
గుజ్జగల కోడే గుజరాతి కోడే
కత్తిలాంటి కోడే కిత్తూరు కోడే
తిరుగేలేనిది తిరునల్వేలి కోడే హాయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టుచుట్టు చుట్టుచుట్టు చుట్టుచుట్టు
చుట్టు చుట్టు చుట్టు చుట్టు

చుట్టర చుట్టు తలపాగ చుట్టరా
పట్టర పట్టు పిడికిలి బిగపట్టరా
జబ్బలు రెండు చరిచి జై కొట్టరా
మన ఒక్కో గొంతు కోట్లాది పెట్టురా

చూడరా మల్లేశా చుట్టమైనది భరోసా
కుమ్మర గణేశా కూడగట్టర కులాసా
అస్స బుస్స గుట్ట గిట్ట
గింజ గుంజ కంచు కోడే
భల్లె భల్లె భల్లె భల్లె భల్లే

పంతమున్న కోడే. పంజాబి కోడే
తగ్గనన్న కోడే టంగుటూరి కోడే
పౌరుషాల కోడే పల్లాస్సి కోడే
విజయ విహారమే వీర మరాఠ కోడే హొయ్

నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా
నెత్తురు మరిగితే ఎత్తర జెండా
సత్తువ ఉరిమితే కొట్టర కొండా

ఉరుము ఉరుము ఉరుము ఉరుము
ఉరుమురు మురుమురుమురుమురు
మురుమురుమురు మురుమురు
ఉరుమురుమురుమురు

తికమక పెట్టే అమాయకత్వం.. చకచకలాడే వేగం..

అలాగ ఉంటాం.. ఇలాగ ఉంటాం.. ఆకతాయిలం మేము..

అరే చెప్పేదేదో సమజ్ అయ్యేట్టు చెప్పరా..

అట్లనే చెప్తా.. వినుకో..

సత్యం పలికే హరిశ్చంద్రులం.. అవసరానికో అబద్ధం..

నిత్యం నమాజు పూజలు చేస్తాం.. రోజు తన్నుకు చస్తాం..

నమ్మితే ప్రాణాలైనా ఇస్తాం.. నమ్మడమేరా కష్టం..

ముక్కుసూటిగా ఉన్నది చెప్తాం.. నచ్చకుంటే మీ ఖర్మం..

అరె.. కష్టమొచ్చినా కన్నీరొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనస్సులం..

మేమే.. ఇండియన్స్.. మేమే.. ఇండియన్స్..

మేమే.. ఇండియన్స్.. అరె.మేమే.. ఇండియన్స్..

వందనోటు జేబులో ఉంటే నవాబు నైజం

పర్సు ఖాళి అయ్యిదంటే ఫకీరు తత్వం

కళ్ళు లేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం

పడుచుపిల్ల ఎదురుగ వస్తే పళ్ళికిలిస్తాం..

ప్రేమ.. కావాలంటాం.. పైసా.. కావాలంటాం..

ఏవో కలలే కంటాం.. తిక్క తిక్కగా ఉంటాం..

ఏడేళ్ళయినా టీవి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం..

తోచకపోతే సినిమాకెళ్ళి రికార్డు డాన్సింగ్ చేస్తాం..

కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడి కోటేస్తాం..

అందరు దొంగలే అసలు దొంగకే సీటు అప్పచెప్పేస్తాం..

రూలూ ఉంది.. రాంగూ ఉంది..

తప్పుకు తిరిగే లౌక్యం ఉందీ..

మేమే.. ఇండియన్స్.. మేమే.. ఇండియన్స్..

మేమే.. ఇండియన్స్.. అరె.మేమే.. ఇండియన్స్..

కలలు కన్నీళ్ళెన్నో మన కళ్ళల్లో..

ఆశయాలు ఆశలు ఎన్నో మన గుండెల్లో..

శత్రువుకే ఎదురు తిరిగిన రక్తం మనది..

ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనది..

ఈశ్వర్ అల్లా ఏసు.. ఒకడే కదరా బాసు..

దేవుని కెందుకు జెండా.. కావాలా పార్టీ అండా..

మాతృభూమిలో మంటలు పెట్టే మాయగాడి కనికట్టు..

అన్నదమ్ములకు చిచ్చును పెట్టే లుచ్చాగాళ్ళ పని పట్టు..

భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయి ఒట్టు..

మరోసారి ఇటు చూసే ద్రోహుల తోలు తీసి ఆరెట్టు..

దమ్మే ఉంది.. ధైర్యం ఉంది..

తలవంచని తెగ పొగరే ఉంది..

మేమే.. ఇండియన్స్..

మేమే.. ఇండియన్స్..

రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ
కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

కరెన్సీ నోట్ మీద ఇలా నడి రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదు ర గాంధీ

భరత మాత తల రాతను మార్చిన విధాత ర గాంధీ
తర తరాల యమా యాతన తీర్చిన వరదాత ర గాంధీ

కొంతమంది సొంత పేరు కాదు ర గాంధీ
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ

రామ నామమే తలపంతా ప్రేమ ధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత

కర్మ యోగమే జన్మంతా
ధర్మ క్షేత్రమే బ్రతుకంతా

సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్ గీత
ఈ బోసి నోటి తాతా

మనలాగే ఓ తల్లి కన్న మామూలు మనిషి కదరా గాంధీ
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్ఫూర్తి
సత్య అహింసల మార్గజ్యోతి
నవ శకానికి నాంది

రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజా రామ్
పతిత పావన సీత రామ్
ఈశ్వర అల్లాహ్ తేరో నామ్
సబ్ కో సమ్మతి దే భగవాన్

గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెన గ చేసి
దండి యాత్రని దండ యాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగ్గజేత

చరకా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి
నూలు పోగుతో మదపుటేనుగులా బందించాడురా జాతిపిత
సంకల్ప బలం చేత

సూర్యుడస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపించిన క్రాంతి
తూరుపు తేలారని నడిరాత్రికి స్వేచ్ఛ భానుడి ప్రభాత కాంతి

పదవులు కోరని పావన మూర్తి
హృదయలేలిన చక్రవర్తి

ఇలాంటి నరుడొక డిలాతరం పై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదనే నమ్మకముందే ముందు తరాలకి చెప్పండి

సర్వ జన హితం న మతం
అంటరాని తనాన్ని అంతః కలహాలని అంతం చేసేందుకే న ఆయువంతా అంకితం

హే రామ్

ఓ బాపు నువ్వే రావాలి ని సాయం మళ్ళీ కావాలి

(వందేమాతరం గాంధీ ఓంకారం)

జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం చూపాలి

(వందేమాతరం గాంధీ ఓంకారం)। 

 

కళ్లజోడుతో చేతి కర్రతో కదిలే ఓ సత్యాగ్రహం

(కదిలే ఓ సత్యాగ్రహం)

వెండికొండల శిరసు పండిన యువకులను మించిన సాహసం

(యువకులను మించిన సాహసం)

బక్క పలచని బాపు గుండెలో ఆసేతుహిమాచలం

బిక్కు నరాల్లో ఉప్పొంగి స్వతంత్ర రక్త గంగాజలం

సత్య మార్గమున మడమతిప్పని స్వరాజ్య దీక్షామానసం

అతడంటే గడ గడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం

వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం

చాకు పిస్టలు కొడవలి గొడ్డలి ఎందుకు హింస ఆయుధం

(ఎందుకు హింస ఆయుధం)

ఆవేశం కోపం ద్వేషం కాదు చిరునవ్వే మన ఆయుధం

(చిరునవ్వే మన ఆయుధం)

సాటి మనిషి పై ప్రేమేగా మన మాతృ భూమికి గౌరవం

మానవతే మనకెన్నడు చెరగని అందం అన్న గాంధీజం

వందేమాతరం గాంధీ ఓంకారం

వందేమాతరం గాంధీ ఓంకారం

భయం చెందని నెత్తురు చిందని గాంధీ మహెూద్యమ జ్వాలలు

గాలితరంగాలై వీచినవి దేశంలో నలు మూలాలు

 

(వందేమాతరం గాంధీ ఓంకారం

వందేమాతరం గాంధీ ఓంకారం

వందేమాతరం గాంధీ ఓంకారం

వందేమాతరం గాంధీ ఓంకారం)

ఒకే ఒక్క దేశం ఓంకారమై నినదించింది
ఒకే ఒక్క దేశం శాంతి మంత్రాన్ని వినిపించింది
పరాయి మూకలు ఎగబడుతుంటే ఫలాలనే తెగ దోచుకు తింటే

ఆ ఒకే ఒక్క దేశం పౌరుషజ్వాలలు రగిలించింది
పోరాటాలకు ఉసిగొలిపింది బానిససంకెల భళ్ళున తెంచి
స్వరాజ్యాన్ని సాధించింది స్వతంత్ర్యాన్ని అందించింది


సలాం ఇండియా సలాం ఇండియా
సలాం ఇండియా. సలాం ఇండియా


చరణం:1
తక్కిన జాతులు అక్షర జ్ఞనము నెరుగని రోజుల్లో
ఇక్కడ మాత్రము ఆత్మజ్ఞానపు జ్యోతులు నింపింది
తక్కిన వారికి వ్యాధుల వేదన తప్పని కాలములో
ఇక్కడ మాత్రము ఆయుర్వేదపు దీవెన కురిపించింది


గణితానికి మరి సున్నానిచ్చిన ఘనతా తనదే
గ్రహణాలను తేదీలతొ చెప్పిన చరితా తనదే
రోదసిలో ఘన లక్ష్యాలన్నీ లీలగ ఛేదించినా
రోజూ ఖురాను బైబిల్ గీతల బోధలు పాఠించింది


సలాం ఇండియా సలాం ఇండియా
సలాం ఇండియా. సలాం ఇండియా


చరణం:2
నీటిని మట్టిని చెట్టుని పుట్టని తల్లిగ తలచింది
కంకర కంకర శంకరుడేనను భావన నేర్పింది
వారని వీరని ఎంచక మనిషికి ప్రేమని పంచింది
ఎక్కడనుంచొచ్చారని అడగక అక్కున జేర్చుకుంది


అలుసుగ జూసి ఆక్రమణలకై పాల్పడుతుంటే
శతాబ్దాల తన సహనాన్నింకా పరీక్షిస్తు ఉంటే
సత్యాహింసలు ఆయుధాలుగా సమరం సాగించింది
సత్యాగ్రహమే యుద్ధవ్యూహమై విజయంసాధించింది


సలాం ఇండియా సలాం ఇండియా
సలాం ఇండియా. సలాం ఇండియా


జయోస్తుతే జయోస్తుతే శ్రీ మహన్మంగళే ! శివాస్పదే శుభదే 
స్వతంత్రతే భగవతీ ! త్వామహం యశోయుతాం వందే ||జయోస్తుతే||
రాష్ట్రాచే చైతన్య మూర్త్ తూ నీతి – సంపదాంచీ
స్వతంత్రతే భగవతీ ! శ్రీమతీ రాజ్ఞీ తూ త్యాంచీ
పరవశతేచ్యా నభాత్ తూచీ ఆకాశీ హోసీ
స్వతంత్రతే భగవతీ ! చాందణీ చమచమ లఖలఖసీ
గాలావరచ్యా కుసుమీ కింవా కుసుమాంచ్యా గాలీ
స్వతంత్రతే భగవతీ ! తూచ్ జీ విలసతసే లాలీ||2||
తూ సూర్యాచే తేజ్, ఉదధీచే గాంభీర్యహి తూచీ
స్వతంత్రతే భగవతీ ! అన్యథా గ్రహణ్ నష్ట తేచీ 
మోక్ష – ముక్తి హీ తుఝీచ్ రూపే తులాచ వేదాన్తీ
స్వతంత్రతే భగవతీ ! యోగిజన పరబ్రహ్మ వదతీ 
జే జే ఉత్తమ ఉదాత్త ఉన్నత మహన్మధుర తే తే
స్వతంత్రతే భగవతీ ! సర్వ తవ సహచారీ హోతే
హే అధమ – రక్తరంజితే, సుజన పూజితే,
శ్రీస్వతంత్రతే శ్రీస్వతంత్రతే శ్రీస్వతంత్రతే
తుజసాఠి మరణ తే జనన, తుజవీణ జనన తే మరణ
తుజ సకల చరాచర శరణ, చరాచర శరణ
శ్రీస్వతంత్రతే శ్రీస్వతంత్రతే శ్రీస్వతంత్రతే
జయోస్తుతే జయోస్తుతే శ్రీ మహన్మంగళే ! శివాస్పదే శుభదే 
స్వతంత్రతే భగవతీ ! త్వామహం యశోయుతాం వందే। ।


सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएँ..

आज, हम भारत का 76 वां गणतंत्र दिवस मनाने के लिए एकत्र हुए हैं, यह दिन 26 जनवरी 1950 को हमारे संविधान को अपनाने का प्रतीक है।

यह हमारी आजादी और हमारे स्वतंत्रता सेनानियों द्वारा किए गए बलिदान की याद दिलाता है।

जैसा कि हम अपने राष्ट्र का सम्मान करते हैं, आइए हम सभी के लिए न्याय, स्वतंत्रता और समानता के प्रति अपनी प्रतिबद्धता की पुष्टि करें। आइए हम एक मजबूत, समृद्ध और एकजुट भारत के निर्माण के लिए मिलकर काम करें।

जय हिंद!


INDEPENDENCEDAY PICS 2024
REPUBLICDAY PICS 2024

గౌరవనీయులైన ప్రిన్సిపాల్/ ప్రధానోపాధ్యాయుల వారికి, గౌరవనీయులైన ఉపాధ్యాయులు, గౌరవనీయ అతిథులు మరియు నా ప్రియమైన మిత్రులకు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ రోజు ఈ మహత్తర సందర్భంలో మీ ముందు మన దేశం గురించి మాట్లాడటానికి నిలవడం నిజంగా గర్వముగా భావిస్తున్నాను.. 

ఎన్నో వందల సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గిన మనము, 1857 వ సంవత్సరంలో ప్రథమ స్వాతంత్ర్య ఉద్యమం నుండి, 1947 వ సంవత్సరం వరకూ 90 సంవత్సరాలపాటు ప్రపంచమే గర్వించ దగ్గ పోరాటం చేసి, బ్రిటిష్ వారి  నుండి  స్వాతంత్ర్యాన్ని గెలుచుకున్నాం. ఆ పోరాటంలో తమ ధన-మాన-ప్రాణాలు అర్పించిన వీరులు అందరికి మనం ఋణపడి ఉన్నాం.

స్వాతంత్ర్యం వచ్చాక దేశాన్ని పాలించుకోవడానికి, దేశంలోని మహా మేధావులందరూ శ్రమించి, 2 సంవత్సరాల 11నెలల 18రోజులపాటు రాజ్యాంగాన్ని వ్రాసారు.

ఆ రాజ్యాంగాన్ని 26 జనవరి 1950 నుండి రాజ్యాంగం అమలు లోనికి తెచ్చుకున్నాము. కావున ఆ నాటి నుండీ మనం “సర్వ సత్తాక సార్వభౌమాధికార గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాం. నాటి నుండీ ప్రతి సంవత్సరం 26 జనవరి నాడు “గణతంత్ర దినోత్సవం” ఘనంగా జరుపుకుంటున్నాం.

మన “దేశం అంటే మట్టి కాదోయ్- దేశమంటే మనుషులోయ్” అని గురజాడ అప్పారావుగారు చెప్పినట్లు.. మనం అంతా ఆ మహానుభావుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ, వారు చూపిన మహోన్నత,  అభ్యుదయ మార్గంలో నడిచి, తల్లిదండ్రులకు, గురువులకు, దేశానికి మంచి పేరు తీసుకు వద్దాం.

నాకు ఈ గొప్ప అవకాశంణ్ ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకు ధన్యవాదాలు.

జైహింద్..!

అందరికీ శుభోదయం,

ఇవాళ మనం భారతదేశ 76 వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు..

1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ప్రతీ సంవత్సరం ఈరోజున అందరూ గర్వంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం..

ఈ రోజు మన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకోవడానికి. మనం న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, మరియు బంధుత్వం సూత్రాలను పాటించి ఒక శక్తివంతమైన మరియు సంపన్నమైన భారత్‌ను నిర్మించాలనే సంకల్పం తీసుకుందాం.

జై హింద్!

• Hello everyone. My name is ……………………………… I ……….. I am studying th class.

• To the Hon’ble Principal/Headmasters, Hon’ble Teachers, Hon’ble Happy 76th Republic Day to guests and my dear friends.

• I am truly proud to stand before you today on this great occasion to speak about our country..

•  After hundreds of years of foreign rule, from the first freedom movement in the year 1857, to the year 1947, we fought proudly for 90 years and won independence from the British. We are indebted to all the heroes who sacrificed their lives and money in that struggle.

• To rule the country after independence, all the great intellectuals of the country worked hard and wrote the constitution for 2 years 11 months 18 days.

• We brought that constitution into force on 26 January 1950. Therefore, since that day we have declared ourselves as a “Sarva Sattaka Sovereign Republic. Since then every year on 26th January we celebrate “Republic Day”.

• Guruzada Apparaugaru said that our “country is not soil – country is people”.. Let us all remember the sacrifices of those great people and walk in the path of greatness and progress shown by them and bring good name to our parents, teachers and country.

• Thanks for giving me this great opportunity.

• Once again Wish you Happy 76th Republic Day everyone..

Jai Hind!


NO OF VISITERS TILL TODAY



 

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *