ఉత్తమ విద్యార్థికి తప్పనిసరిగా ఉండవలసిన ఐదు ఉత్తమ లక్షణాలు.
ఉద్యోగార్థి అయిన విద్యార్థికి చాలా చాలా ముఖ్యం….
ఉత్తమ విద్యార్థి, సాధకునికి ఉండాల్సిన 5 ముఖ్య లక్షణాలు…
” काक चेष्टा, बको ध्यानं, स्वान निद्रा तथैव च
अल्पहारी, गृहत्यागी विद्यार्थी पंच लक्षणं।”
Kaak cheshta bako dhyanam.
Swan nindra tathaiwa cha
Alpahari, grihtyaagi,
Vidyarthi panch lakshnam.
हिन्दी भावार्थ:
एक विद्यार्थी में ये पाँच लक्षण होने चाहिए..
कौए की तरह जानने / लक्ष्य प्राप्त करने की चेष्टा,
बगुले की तरह ध्यान,
कुत्ते की तरह सोना / नींद
अल्पाहारी, आवश्यकतानुसार खाने वाला
और गृह-त्यागी होना चाहिए ।
విద్యార్థి తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ఐదు లక్షణాలను వివరించే చాలా ఆసక్తికరమైన సంస్కృత శ్లోకం ఇది:-
కాక చేష్ట, బకో ధ్యానం,
శ్వాన్ నిద్రా తథైవ చ ।
అల్పహారీ, గృహ త్యాగి,
విద్యార్థి పంచ లక్షణం ॥
విద్యార్థి – విద్యా అంటే జ్ఞానం మరియు అర్థి అంటే జ్ఞానాన్ని కోరుకునేవాడు. విద్యార్థులందరూ ఈ ఐదు లక్షణాలు కలిగి ఉండాలి.
1.కాక చేష్ట (కాకి యొక్క ప్రయత్నాలు)
విపరీతమైన దాహంతో ఎగురుతూ నీళ్ల కోసం వెతుకుతున్న కాకి కథ మనకు తెలుసు కదా.. దాహంతో ఉన్న కాకికి నీటి కుండ కన్పించింది. కానీ నీరు చాలా అడుగునకు ఉండి, త్రాగడానికి వీలుగా లేనప్పుడు, తగు ఉపాయం ఆలోచించి, ప్రయత్నం ప్రారంభించింది. చుట్టుపక్కల గల గులకరాళ్ళను ఎంచుకొని వాటిని తెచ్చి, కుండలో వేయడం ప్రారంభించింది.
అలా నీరు పైకి రాగానే నీటిని త్రాగి, దప్పిక తీర్చుకుంది. ఇక్కడ కాకికి సమస్య రాగానే, దానికి తగు పరిష్కారాన్ని వెతకడం లో ఓపిక, శ్రమ, ప్రయత్నాలు చేసి, విజయం సాధించినట్లు..
విద్యార్థిగా, జీవితాలలో కష్ట సమయాల్లో కూడా నేర్పరితనంతో కఠినమైన పనిని కూడా తెలివిగా చేసి, విజయం సాధించవచ్చని ఈ “కాకి చేష్టల” ద్వారా తెలుస్తోంది.“
పని కంటే ముందు విజయం వచ్చే ఏకైక ప్రదేశం నిఘంటువులో మాత్రమే. ” అంటే అక్షర క్రమంలో ‘W’ (WORK) ముందు ‘S’ (SUCCESS) వస్తుంది. కాబట్టి పని చేస్తేనే విజయం వస్తుంది.
ముఖ్యంగా ఉద్యోగానికి సిద్ధమవుచున్న మిత్రులారా… ఎక్కడ ముఖ్యమైన మెటీరియల్, టెస్ట్ పేపర్స్ ఉన్నా, అక్కడ “కాకిలా” వాలిపోండి. సాధించేవరకూ వదలొద్దు.
2.బకో ధ్యానం (కొంగ యొక్క ధ్యానం)
పూర్తిగా నీటిపై దృష్టి కేంద్రీకరించి ఒంటికాలిపై నిలబడి, తపస్సు చేస్తున్నట్లు ఉన్న కొంగ ..
దానిముందు చిన్న చిన్న చేపలు ఈత కొడుతున్నా వాటిని పట్టించుకోనట్లు వ్యవహరిస్తుంది.
దాని టార్గెట్ పెద్ద చేపలు. అవి వచ్చే వరకు దృష్టి పెడుతుంది. ఒకవేళ అది చిన్న చేపలతో సరిపెట్టుకుంటే పెద్ద చేపలను కోల్పోతుంది. మరియు పెద్ద చేపనే కోరుకుంటే అది చిన్న చేపలను దాటవలసి ఉంటుంది.
అదేవిధంగా, జీవితంలో మనం ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టాలనుకున్నప్పుడు, చిన్న విషయాలను దాటవేయడానికి మనం ప్రయత్నించాలి. మరియు చిన్న విషయాలతో మనస్సు చెలించిపోతే ఇక పెద్ద లక్ష్యం అందుకోలేరు. కొన్నిసార్లు లక్ష్య సాధనలో చిన్న చిన్న ఆటంకాలు, ఆకర్షణలు ఎదురవుతుంటాయి. కావున, ఉన్నతమైన లక్ష్యం కొరకు ప్రయత్నించేప్పుడు ఆటంకాలు దాటాల్సి ఉంటుంది.. అప్పుడే మన దృష్టి కొంగలా కేంద్రీకరించాలి అదే “బకో ధ్యానం”
3.శ్వాన్ నిద్ర (కుక్క యొక్క నిద్ర)
శ్వాన్ అంటే కుక్క. శ్వాన్ నిద్ర అంటే కుక్క నిద్ర అని అర్థం. మరింత ఖచ్చితంగా చెప్పాలంటే కుక్క యొక్క చురుకుదనం. కుక్క నిద్రపోతున్నప్పుడు కళ్ళు మూసుకుంటుంది, కానీ అప్రమత్తంగా ఉంటుంది. చుట్టుపక్కల చిన్నపాటి శబ్దం వచ్చినా అది వెంటనే కళ్లు తెరుస్తుంది. జీవితంలో జ్ఞానాన్ని పొందాలనుకునే వారందరూ మరియు జీవితంలో గొప్ప లక్ష్యాలను సాదించాలనుకునేవారు ప్రతీ విషయంలోనూ ఇది పాటించాలి. జీవితంలో ప్రతీక్షణమూ సింహావలోకనం చేస్తూ మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల అప్రమత్తంగా ఉండడాన్ని మనం కోల్పోకూడదు. వ్యక్తులు, వస్తువులు, పరిస్థితులు మరియు పరిసరాల నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి మరియు మనం అప్రమత్తంగా ఉన్నప్పుడు మాత్రమే నేర్చుకుంటామని గ్రహించాలి… ఇదే “శ్వాన్ నిద్ర”.
బద్దకాన్ని వీడి, పుస్తకాన్ని చేపట్టండి. చురుకుదనం అలవాటు చేసుకోండి.. విజయం వరిస్తుంది…
4.అల్పాహారి (మన ఇంద్రియాలకు మనం ఇచ్చే ఇన్పుట్లు)
విద్యార్థి లేదా జ్ఞానాన్ని కోరుకునే వ్యక్తి అమితంగా కాకుండా శరీర పొషణకు అవసరమైనంత మత్రమే తినాలి. ఎందుకంటే సాధారణంగా విద్యార్థులు భోజనం తరువాత నిద్రావస్థలు పడుతుంటారు. పరీక్షల సమయంలో ఎక్కువసేపు చడవాల్సినప్పుడు మిత భోజనం అవసరం. అదీ కూడా పౌష్టికాహారం అవసరం.
ఇక రెండవ అర్థంలో.. మన జ్ఞానేంద్రియాలన్నింటికీ ఇచ్చే ఆహారం. ఉదాహరణకు మన నాలుకకు రుచీ , మన చెవులకు ధ్వని అహారం, మన కళ్ళకు దృశ్యాలు అహారం. ఇలా చదువుకునే విద్యార్థి ఏదిపడితే దానికి ఆకర్షితులైపోతుంటారు.. స్నేహితులతో/ సెల్ ఫోన్లో మాటలకు, యౌవనములో అందానికి ఇలా..
కావున ఈ శ్లోకంలో విదార్థి అల్పహారి అని చెప్పినప్పుడు, ఇంద్రియ వ్యవస్థకు ఇచ్చే ఇన్పుట్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. అవే మనస్సుపై, మన అంతర్గత వ్యవస్థపై లోతైన చెరగని ముద్ర వేస్తుంది.
5.గృహ త్యాగి (కంఫర్ట్ జోన్ వదలాలి).
ఒక విద్యార్ధి కంఫర్ట్ జోన్‌ను వదిలి ప్రపంచాన్ని అన్వేషించడానికి ఓపెన్ మైండ్ కలిగి ఉండాలి. కంఫర్ట్ జోన్లను విడిచిపెట్టి, మనస్సును అన్వేషించాలి మరియు తనను తాను కనుగొనాలి.
ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. కొందరు చదువుటకు హాస్టల్ కి వెళ్లాల్సి ఉంటుంది. కొందరికి రాత్రి వరకూ ట్యూషన్ లేదా స్టడీ క్లాసులు ఉంటాయి. అట్టి సందర్భాల్లో విద్యార్థి సర్దుకుపోయే గుణాన్ని, పరిస్థితులతో పాటు వొదిగే గుణాన్ని అలవరచుకోవాలి. అలాగే సమయాన్ని సద్వినియోగం చేసుకుని చదువుకోవాలి. ఇదే “గృహ త్యాగి” అంటే.
ఇవి పాటిస్తూ, క్రమశిక్షణతో… విద్యాబుద్ధులు నేర్చుకుంటే జీవితంలో గొప్ప లక్ష్యాలను సైతం సాధించగలరు..
కోచింగ్ నిమిత్తము.. ప్రేపరషన్ కై ఇంటికి దూరంగా ఉన్నా.. దిగులు-బెంగలు వీడండి…. జయం మీదే…
పై 5 లక్షణాలను లక్ష్యాన్ని అందుకోవలనే వారు తప్పక అలవరచుకోవాలి….